ETV Bharat / state

పట్టాలపైకి విశాఖ మెట్రో- సీఎం చంద్రబాబు ఆదేశాలతో కదలిక - VISAKHA METRO - VISAKHA METRO

Chandrababu on Visakha Metro Rail Project: ఎన్నికల వేళ ఇచ్చిన మాట ప్రకారం అభివృద్ధి వికేంద్రీకరణకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. రాజధాని అమరావతికి పూర్వవైభవం తెచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్న సర్కార్‌ ఇప్పుడు విశాఖ అభివృద్ధిపై దృష్టి సారించింది. మెట్రో రైలు ప్రాజెక్టుని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రణాళికలు రచిస్తోంది. డీపీఆర్‌లో కొన్ని మార్పులు చేసి ఎన్​హెచ్​ఏఐతో కలిసి ముందుకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

Chandrababu on Visakha Metro Rail Project
Chandrababu on Visakha Metro Rail Project (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 14, 2024, 7:08 AM IST

Chandrababu on Visakha Metro Rail Project : విశాఖ నగర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రజా రవాణా సౌకర్యాన్ని మెరుగుపర్చేందుకు మెట్రో రైలు ప్రాజెక్టును పట్టాలెక్కించనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనల మేరకు ఈ ప్రాజెక్టుకు సంబంధించి గత డిజైన్లలో అధికారులు కొన్ని మార్పులు చేయనున్నారు. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ నిర్మించే పైవంతెనలకు అనుసంధానంగా మెట్రో డిజైన్లు ఉండేలా చర్యలు తీసుకోనున్నారు. ఈ మేరకు ఎన్​హెచ్​ఏఐతో సమన్వయం చేసుకుని ముందుకెళ్లేందుకు వీలుగా ప్రణాళిక రచిస్తున్నారు. మెట్రోకు సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదికలోనూ కొన్ని మార్పులు చేసే అవకాశం ఉంది. సీఎం చంద్రబాబు విశాఖ పర్యటన అనంతరం ఈ ప్రాజెక్టులో కదలిక వచ్చింది.

ఆర్థికంగా నష్టం కలిగించడంతో పాటు సమస్యలు : ఉత్తరాంధ్ర ప్రాజెక్టులపై సమీక్ష సందర్భంగా మెట్రో పనుల్ని ముందుకు తీసుకువెళ్లాలన్న తన ఆలోచనలను చంద్రబాబు ఏపీ మెట్రోరైలు కార్పొరేషన్‌ ఎండీ యూజేఎమ్ రావుకు తెలియజేశారు. ట్రాఫిక్‌ రద్దీ నియంత్రణకు నగర పరిధిలో పలుచోట్ల పైవంతెనల నిర్మాణానికి ఎన్​హెచ్​ఏఐ ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేసింది. వాటిని నిర్మించాక మెట్రో కోసం మళ్లీ వంతెనలు నిర్మిస్తే ఇబ్బందులు తలెత్తవచ్చన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

జగనన్నా ఇదేనా నీ చిత్తశుద్ధి - ఎన్నికల ముందు విశాఖ మెట్రో అంటూ ఎందుకీ హడావుడి?

ఉన్నవాటిని కూల్చడం, మళ్లీ కొత్తగా నిర్మించడం వంటివి ఆర్థికంగా నష్టం కలిగించడంతో పాటు సమస్యలు తెచ్చిపెడతాయని భావించారు. ఈ నేపథ్యంలో ఇటు ఎన్‌హెచ్‌ఏఐకు అటు మెట్రోకు ఉపయోగపడేలా నిర్మాణాలు చేపట్టాలని సూత్రప్రాయంగా సీఎం ఆ సమీక్షలో తెలియజేశారు. ప్రస్తుతం విశాఖలో 12 పైవంతెనలు నిర్మించేందుకు ఎన్‌హెచ్‌ఏఐ డీపీఆర్‌ రూపొందించింది. ఆయాచోట్ల స్తంభాల చుట్టుకొలత పెంచడం, అదనంగా నిర్మించడం, వంతెనల పొడవు, వెడల్పుల్లోనూ కొన్ని మార్పులు చేయనున్నారు. త్వరలో వాటిపై స్పష్టత రానుంది.

విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టుపై తీవ్ర నిర్లక్ష్యం : వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టు తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది. విజయవాడలోని కార్యాలయాన్ని విశాఖకు తరలించడం తప్ప మరే పనీ జరగలేదు. 2017లోనే అప్పటి టీడీపీ ప్రభుత్వం ప్రీబిడ్‌ సమావేశం నిర్వహించింది. 2018లోనే అర్హత కలిగిన 5 నిర్మాణ సంస్థలు ఆసక్తి చూపగా ఎస్సెల్‌ ఇన్‌ఫ్రా కన్సార్టియం ఫైనాన్షియల్‌ బిడ్‌ దాఖలు చేసింది. ప్రాజెక్టు పట్టాలెక్కే సమయంలో ఎన్నికలు రావడం తరువాత పరిణామాలతో మొత్తం ప్రక్రియ ఆగిపోయింది.

YSRCP Government Neglect on Visakha Metro Rail Project: ఉత్తరాంధ్ర అభివృద్ధి అంటున్న జగన్​కి.. విశాఖ మెట్రో కనపడలేదా?

2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక గతంలో పిలిచిన టెండర్లతో పాటు డీపీఆర్‌ను రద్దు చేసి మళ్లీ కొత్తగా చేపట్టారు. నాటి టీడీపీ ప్రభుత్వం 46 కిలోమీటర్లలో మొదట దశ ప్రాజెక్టు పూర్తి చేయాలని నిర్ణయించగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం గొప్పలకు పోయి అనకాపల్లి నుంచి భోగాపురం వరకు 140 కిలోమీటర్లకు పెంచింది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం మొదటిగా స్టీల్‌ప్లాంట్‌ నుంచి కొమ్మాది వరకు 46 కిలోమీటర్ల కారిడార్‌ నిర్మించి ఆ తర్వాత, భోగాపురం విమానాశ్రయానికి ఎయిర్‌ ట్రాఫిక్‌ పెరిగే సమయానికి మిగిలిన మార్గాన్ని విస్తరిస్తే బాగుంటుందన్న ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.

Vizag Metro: విశాఖ మెట్రోకు మంగళం పాడిన జగన్​.. నాలుగేళ్లుగా మాటలకే పరిమితం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.