ETV Bharat / state

అర్బన్‌ యాప్ వినియోగంపై ప్రజల్లో చైతన్యం పెంచుతాం: చంద్రబాబు - CM Chandrababu in Flood Areas - CM CHANDRABABU IN FLOOD AREAS

CM Chandrababu in Flood Affected Areas Visit: ప్రకాశం బ్యారేజ్‌కు నష్టం కలిగించేలా వైఎస్సార్సీపీ వాళ్లే బోట్లు వదిలారని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజలకు అన్యాయం చేయడానికి జగన్‌ చేయని కుట్రంటూ లేదని ధ్వజమెత్తారు. వరద బాధితులు మళ్లీ మెరుగైన జీవితం గడిపేందుకు అవసరమైన తోడ్పాటు అందిస్తామని భరోసా ఇచ్చారు. ఇంట్లో పాడైన వస్తువుల్ని బాగుచేసుకోడానికి అర్బన్‌ కంపెనీ సహాయం తీసుకుంటామని అన్నారు.

CM Chandrababu
CM Chandrababu (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 10, 2024, 8:20 AM IST

CM Chandrababu in Flood Affected Areas Visit: వరద ముంపునకు గురైన విజయవాడలో తొలి రోజు ప్రజల కళ్లలో బాధ కనిపిస్తే, తొమ్మిదో రోజు ప్రభుత్వంపై వారిలో నమ్మకం కనిపించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. వరద బాధితులకు ఆర్థికసాయం అందించి ఆదుకుంటామని హామీ ఇచ్చారు. వారంలో ఇన్సూరెన్స్‌ క్లయిం అందేలా చూస్తామని, మెకానిక్‌లను తీసుకొచ్చి వాహనాలు రిపేర్‌ చేయిస్తామని స్పష్టంచేశారు. విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు వరుసగా తొమ్మిదోరోజూ పర్యటించారు. భవానీపురం, సితారరోడ్డు, ఊర్మిళానగర్, కబేళా సెంటర్లలో బాధితుల్ని పరామర్శిచారు. చనుమోలు వెంకట్రావు ఫ్లైఓవర్‌ మీదుగా చిట్టినగర్, అజిత్‌సింగ్‌నగర్‌ వెళ్లారు. వరద తీవ్రత తగ్గడంతో కారులోనే వెళ్లారు.

ప్రతిచోటా ప్రజలతో మాట్లాడి సహాయకచర్యల గురించి ఆరా తీశారు. డ్రైనేజీ క్లీనింగ్‌ పనుల్ని పరిశీలించారు. కబేళా సెంటర్‌లో పలువురు మహిళలు తమకు ఉపాధి చూపించాలని కోరగా ఆయన సానుకూలంగా స్పందించారు. గత తొమ్మిది రోజులుగా ప్రజలు వరదనీళ్లలో ఉన్నారని, వారి కష్టాలు వర్ణనాతీతమన్నారు. వారు తమ సర్వస్వాన్ని కోల్పొయారని, ఇంట్లో ఏమీ లేకుండా కట్టుబట్టలతో బయటకొచ్చారని తెలిపారు. వారికి కొంత ఆర్థిక సాయం చేస్తే తప్ప కోలుకొనే పరిస్థితి లేదని, అందరికీ న్యాయం చేస్తామని స్పష్టం చేశారు. పరిస్థితుల్ని సాధారణ స్థితికి తీసుకురావడానికి అన్నిచర్యలూ తీసుకుంటున్నట్టు వెల్లడించారు.

అప్పుడూ ఇప్పుడూ బస్సులోనే - ప్రజల కోసం జీవితం అంకితం: చంద్రబాబు - CM Chandrababu on Skill Case Arrest

ఇంట్లో పాడైన వస్తువుల్ని బాగుచేసుకోడానికి అర్బన్‌ కంపెనీ సహాయం తీసుకుంటామని, ఆ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకుని, టెక్నీషియన్‌లను బుక్‌చేసుకోవడంలో ఇబ్బందులు లేకుండా సచివాలయ సిబ్బందిని, వాలంటీర్లను వినియోగిస్తామని తెలిపారు. ముంపు ప్రాంతాల్లో చివరి వ్యక్తికి న్యాయం జరిగేంత వరకు అండగా ఉంటామని చంద్రబాబు తేల్చిచెప్పారు. ఐవీఆర్‌ఎస్‌ కాల్స్‌ ద్వారా ప్రజల అభిప్రాయాలు తెలుసుకుంటానని, ప్రజలు వీటికి స్పందించాలని కోరారు. మంత్రులు నిమ్మల రామానాయుడు, నారా లోకేశ్​లు బుడమేరుకు గండ్లు పూడ్చే ప్రక్రియను పర్యవేక్షించారని ప్రశంసించారు.

బుడమేరు నుంచి కొల్లేరుకు నీరు వెళ్లకుండా కొందరు కబ్జాలు చేశారని ధ్వజమెత్తారు. గత ప్రభుత్వం పది లక్షల కోట్లకు పైగా అప్పులు చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందని విమర్శించారు. తాము సర్వస్వం కోల్పొయామని, కట్టుబట్టలతో రోడ్డుపైకి వచ్చామని, దుస్తులతో సహా ఇంట్లో ఉన్న అన్ని వస్తువులు దెబ్బతిన్నాయని పలువురు మహిళలు చంద్రబాబు ముందు కన్నీరుమున్నీరుగా విలపించారు. దీంతో చలించిపోయిన చంద్రబాబు, ఆప్కో సహా ఎక్కడుంటే అక్కడి నుంచి దుస్తులు సేకరించాలని, వాటిని నేటి నుంచి పంపిణీ చేయాలని అధికారుల్ని ఆదేశించారు. చిన్న దుకాణాలు, తోపుడు బండ్లు ఉన్న వారికి సాయంగా నిలుస్తామని, అవసరమైతే బ్యాంకులతో మాట్లాడి రుణాలు ఇచ్చేలా చూస్తామన్నారు.

వరద కష్టాలు తీర్చేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నాం- బాధితులకు పూర్తిస్థాయిలో న్యాయం చేస్తాం: సీఎం - CM Visit to Flood Affected Areas

ప్రకాశం బ్యారేజిని బోట్లు ఢీకొట్టడం వైఎస్సార్సీపీ కుట్రేనని చంద్రబాబు స్పష్టం చేశారు. జగన్‌ ఇక్కడుండి ప్రజల కష్టాలు తెలుసుకోకుండా బెంగళూరులో ఉండి ప్రభుత్వంపై బురదజల్లడానికి ప్రయత్నిస్తున్నారని సీఎం దుయ్యబట్టారు. వైఎస్సార్సీపీ రంగులున్న ఆ పడవలను కావాలనే లంగర్లు వేయకుండా వదిలేశారని మండిపడ్డారు. గతంలో ఇసుక అక్రమ వ్యాపారం చేసిన పడవల్నే నేడు ప్రాజెక్టుకు నష్టం కలిగించేందుకు వాడారని అన్నారు. క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగా మంత్రులకు, ఎమ్మెల్యేలకు చంద్రబాబు క్షేత్రస్థాయి బాధ్యతలు అప్పగించి, ఈ సాయంత్రం కలెక్టరేట్‌ నుంచి సచివాలయానికి వెళ్లే అవకాశం ఉంది.

ఆపరేషన్ బుడమేరు స్టార్ట్ చేస్తాం - ప్రజల భద్రత కంటే ఏదీ ముఖ్యం కాదు: సీఎం చంద్రబాబు - CM CHANDRABABU ON Encroachments

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.