AP CM Chandrababu Visit Amaravati Updates : ఆంధ్రుల కలల రాజధాని అమరావతి నిర్మాణ పనుల్ని, వీలైనంత త్వరగా పట్టాలెక్కించాలనే పట్టుదలతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నారు. ఇందులో భాగంగా తొలుత జగన్ విధ్వంసాన్ని అంచనా వేయాలనే ఉద్దేశంతో రాజధానిలో పర్యటిస్తున్నారు. ఉదయం 11:00 గంటలకు ఉండవల్లిలోని తన నివాసం నుంచి ఆయన పర్యటన ప్రారంభమైంది.
CBN Inspected Prajavedika in Amaravati : తొలుత జగన్ కక్షగట్టి కూల్చేయించిన ప్రజావేదికను సీఎం చంద్రబాబు సందర్శించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే, కూల్చేసిన ప్రజావేదిక శిథిలాలలను ముఖ్యమంత్రి పరిశీలించారు. కూల్చివేతలకు చిరునామాగా నిలిచిన జగన్ ప్రభుత్వంలో, కనీసం ఆ శిథిలాలను కూడా తొలగించలేదు. చంద్రబాబు కూడా జగన్ చేసిన విధ్వంసం అందరికీ తెలియాలనే ఉద్దేశంతో, ప్రజావేదిక శిథిలాల తొలగింపు చేపట్టమని ఇటీవల తేల్చిచెప్పారు. అమరావతి అభివృద్ధి దిశగా ఆయన అడుగులు వేస్తున్నారు.
ప్రజావేదిక పరిశీలన అనంతరం చంద్రబాబు కరకట్ట రోడ్డు మీదుగా సీడ్ యాక్సెస్ రహదారిపైకి వెళ్లారు. దారి పొడవునా ఎక్కడా తట్ట మట్టిసిన పరిస్థితి లేకపోవడాన్ని కళ్లారా చూశారు. రాజధాని రైతుల ఆవేదనను కళ్లకు కడుతూ భూములన్నీ, జగన్ అరాచకానికి సాక్ష్యాలుగా నిలవడాన్ని గమనించారు. సీడ్ యాక్సెస్ రహదారి మీదుగా ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి శంకుస్థాపనన జరిగిన ఉద్ధండరాయునిపాలెం ప్రాంతానికి బస్సులో వెళ్లారు.
నాటి రోజులను గుర్తు చేసుకున్న చంద్రబాబు : అమరావతి శంకుస్థాపన ప్రాంతానికి వెళ్లిన చంద్రబాబు నాటి రోజులను గుర్తు చేసుకున్నారు. గొప్ప సంకల్పంతో నిర్మించ తలపెట్టిన అతిరథ మహారథులను ఆహ్వానించిన చోట, ప్రస్తుతం పాడుబడిన ప్రాంతంగా మారిన పరిస్థితిని చూశారు. వివిధ ప్రాంతాల నుంచి తీసుకొచ్చి మట్టిన భద్రపరిచిన చోటుకు వెళ్లిన ఆయన సాష్టాంగ నమస్కారం చేశారు. ఆ తర్వాత పైకి లేచి వందనం సమర్పించారు. అభివృద్ధికి చిరునామాగా నిలవాల్సిన ప్రాంతం, దారుణ పరిస్థితుల్లో ఉండటంపై తీవ్ర ఆవేదన చంద్రబాబు కళ్లలో వ్యక్తమైంది. అనంతరం శంకుస్థాపన జరిగిన చోటుకు వెళ్లి శిలాఫలకాలను పరిశీలించారు.