Chandrababu on Seaplane : దేశంలో తొలిసారి పర్యాటకంగా సీ ప్లేన్ వినియోగం అందుబాటులోకి వచ్చింది. సీ ప్లేన్ పర్యాటకాన్ని సీఎం చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించారు. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి సీ ప్లేన్‌లో విజయవాడ నుంచి శ్రీశైలానికి చేరుకున్నారు. చంద్రబాబుతో పాటు పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, పలువురు కేంద్ర, రాష్ట్రప్రభుత్వ అధికారులు ఉన్నారు.
అనంతరం సీఎం చంద్రబాబు భ్రమరాంబ, మల్లికార్జునస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. సాయంత్రం సీ ప్లేన్‌లోనే విజయవాడ పున్నమిఘాట్‌కు చేరుకుంటారు. ఈ టూరిజంను కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహించారు. అంతకు ముందు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. తక్కువ సమయంలోనే అత్యున్నత స్థానానికి ఎదిగిన వ్యక్తి రామ్మోహన్ నాయుడు అని కేంద్ర మంత్రివర్గంలో అత్యంత యువకుడని కొనియాడారు.
"భవిష్యత్ అంతా పర్యాటకానిదే. భవిష్యత్‌లో ఏ యిజం ఉండదని టూరిజం ఒక్కటే ఉంటుంది. నూతన ఆలోచనలను అమలు చేస్తున్న స్పైస్‌జెట్‌ను అభినందిస్తున్నా. ఎంత త్వరగా అనుకున్న ప్రగతిని సాధించాలనేదే ఆలోచిస్తున్నాం. విధ్వంసమైన వ్యవస్థను బాగు చేసేందుకే తీవ్రంగా ప్రయత్నిస్తున్నా. గాడితప్పిన పరిపాలనను సరిచేయడమే నా లక్ష్యం. ఏపీలో రోడ్లను చూసి అవహేళన చేశారు. పోగొట్టిన బ్రాండ్‌ను తిరిగి తీసుకొచ్చే బాధ్యత తీసుకున్నాం. ప్రజలు గెలవాలి ఎన్డీయేకు ఓటేయాలని నేను, పవన్, మోదీ కోరాం. ఏపీ ప్రజలు గెలిచారు మన రాష్ట్రాన్ని నిలబెట్టారు. వెంటిలేటర్‌పై ఉన్న రాష్ట్రానికి ప్రజలు ఆక్సిజన్ ఇచ్చారు." - చంద్రబాబు, ముఖ్యమంత్రి
భావితరాల భవిష్యత్ మార్చే అవకాశం : సీ ప్లేన్ ప్రయాణం వినూత్న అవకాశమని చంద్రబాబు తెలిపారు. అభివృద్ధి జరగాలని సంపద సృష్టిస్తేనే ఆదాయం పెరుగుతుందని చెప్పారు. ఆదాయాన్ని పేదరిక నిర్మూలనకు ఉపయోగించుకోవచ్చని వివరించారు. సాంకేతికత చాలా వేగంగా పెరుగుతోందని పేర్కొన్నారు. దీనిని పూర్తిగా వినియోగించుకోవాలన్నారు. భావితరాల భవిష్యత్ మార్చే అవకాశం ఉందని వెల్లడించారు. ఐటీ అంటే ఆనాడు ఎగతాళి చేశారని ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడ చూసినా మనవాళ్లే ఉన్నారని వ్యాఖ్యానించారు.
'అనునిత్యం కొత్త ఆలోచనలు చేయాలని రాబోయే రోజుల్లో విమానాశ్రయాలే కాకుండా సీ ప్లేన్ ద్వారా రవాణా సౌకర్యం లభిస్తుంది. సీ ప్లేన్ విధానాలను సరళీకృతం చేసినందుకు అభినందిస్తున్నా. సీ ప్లేన్ వల్ల రవాణానే కాదు పర్యాటకం అభివృద్ధి చెందుతుంది. అన్ని రంగాల్లోనూ ఆధునికతను అందిపుచ్చుకోవాలి. వ్యవసాయరంగంలోనూ కొత్త విధానాలు వచ్చాయి. పర్యాటక రంగంలో అనేక అవకాశాలు వచ్చాయి' అని చంద్రబాబు వివరించారు.
సామాన్యులకు అందుబాటు ధరల్లో సీ ప్లేన్ ప్రయాణం : రామ్మోహన్ నాయుడు