ETV Bharat / state

బల్లకట్టుపై బుడమేరు ముంపు ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటన - CM CBN Visit Flood Affected Areas - CM CBN VISIT FLOOD AFFECTED AREAS

CM Chandrababu Field Visit to Flood Affected Areas: వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు మరోసారి పర్యటించారు. ఎనికేపాడు వద్ద ఏలూరు కాల్వ, బుడమేరు ముంపు ప్రాంతాలను ఆయన పరిశీలించారు. బల్లకట్టుపై బుడమేరు దాటి ముంపు ప్రాంతాల్లో సీఎం పర్యటించారు. గండ్లు పడిన ప్రాంతాల్లో పనులపై అధికారులతో చర్చించారు. దెబ్బతిన్న పంటల వివరాలు స్థానికులను అడిగి తెలుసుకున్నారు.

CM_CBN_Visit_Flood_Affected_Areas
CM_CBN_Visit_Flood_Affected_Areas (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 5, 2024, 3:38 PM IST

Updated : Sep 5, 2024, 8:35 PM IST

CM Chandrababu Field Visit to Flood Affected Areas: వరద ముంపు ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు క్షేత్రస్థాయి పర్యటన చేస్తున్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు మరోసారి పర్యటించారు. ఎనికేపాడు వద్ద ఏలూరు కాలువ దాటి బుడమేరు ముంపు ప్రాంతాలను ఆయన పరిశీలించారు. బల్లకట్టుపై వెళ్లి ముంపు ప్రాంతాల్లో సీఎం పర్యటించారు. బుడమేరుకు గండ్లు పడిన ప్రాంతాల్లో జరుగుతున్న పనులపై అధికారులతో సీఎం చర్చించారు. దెబ్బతిన్న పంటలు వివరాలను సీఎం చంద్రబాబు స్థానికులను అడిగి తెలుసుకున్నారు.

కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలోని కేసరపల్లి వద్ద బుడమేరు కాలువపై వరద ఉద్ధృతిని సీఎం చంద్రబాబు పరిశీలించారు. వరద పరిస్థితిపై అధికారులను సీఎం అడిగి తెలుసుకున్నారు. విజయవాడకు ఇటువంటి విపత్తు మళ్లీ రాకుండా చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. బుడమేరులో వరద తగ్గిందని అధికారులు బాధ్యతగా పని చేయాలని సూచించారు. బుడమేరు కాలువ ప్రక్షాళన చేపడతామని తెలిపారు.

గతంలో బుడమేరు ఆధునికీకరణ కోసం నిధులు కూడా కేటాయించడం జరిగిందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఆ తరువాత విజయవాడ మధురనగర్​ బ్రిడ్జి వద్ద ముంపు ప్రాంతాలను చంద్రబాబు పరిశీలించారు. పలువురు స్థానికులతో మాట్లాడి ప్రభుత్వ సహాయక చర్యలు అందుతున్న తీరును స్వయంగా ఆడిగి తెలుసుకున్నారు. అనంతరం వరద నష్టం పరిశీలనకు వచ్చిన కేంద్రమంత్రి శివరాజ్​ సింగ్​ చౌహాన్​ను కలిశారు. విజయవాడ కలెక్టరేట్​లో వరద నష్టం ఫొటో ఎగ్జిబిషన్​ను శివరాజ్​కు చంద్రబాబు చూపించారు. అనంతరం ఇద్దరూ మీడియాతో మాట్లాడారు.

CM Chandrababu Missed an Accident: విజయవాడ మధురానగర్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబుకు తృటిలో ప్రమాదం తప్పింది. వరద ప్రాంతాల పరిశీలనకు రైలు వంతెనపైకి వెళ్లిన సీఎం భద్రతా సిబ్బంది వారించినా ఆగలేదు. వంతెనపై నడుస్తూ బుడమేరును పరిశీలించారు. ఆ క్రమంలో వంతెనపై నడుస్తుండగానే ఎదురుగా వచ్చిన రైలు ముఖ్యమంత్రి చంద్రబాబుకు అతి సమీపంగా వెళ్లింది. కొంచెం పక్కకు నిలబడి ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. ఈ హఠాత్‌ పరిణామంతో ఆందోళన చెందిన అధికారులు, భద్రతా సిబ్బంది ప్రమాదం తప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు.

ఆక్రమణల చెరలో ఉప్పుటేరు- దారిలేక లంకగ్రామాలను కుమ్మేస్తోన్న బుడమేరు - Kolleru Lanka Stuck in Flood Effect

వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్ట్ - మంగళగిరికి తరలింపు - EX MP Nandigam Suresh Arrest

Last Updated : Sep 5, 2024, 8:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.