ETV Bharat / state

2047 నాటికి రాష్ట్రం నెంబర్‌వన్​గా ఎదగాలి - చదువుకున్న యువతే ఆస్తి: చంద్రబాబు - CM DISTRIBUTED PENSIONS

అనంతపురం జిల్లా పర్యటనలో సీఎం చంద్రబాబు - ఇంటింటికి పింఛన్ల పంపిణీలో పాల్గొన్న సీఎం

cm_distributed_pensions
cm_distributed_pensions (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 30, 2024, 4:34 PM IST

Updated : Nov 30, 2024, 7:41 PM IST

CM Chandrababu Distributed Pensions: అణగారిన వర్గాలకు అండగా ఉండటమే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం చంద్రబాబు అన్నారు. అనంతపురం జిల్లా నేమకల్లులో ఇంటింటికి పింఛన్ల పంపిణీలో సీఎం పాల్గొన్నారు. వితంతువు రుద్రమ్మ ఇంటికెళ్లిన సీఎం ఆమె యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఆమె కుటుంబసభ్యులతోనూ మాట్లాడారు. అనంతరం రుద్రమ్మకు స్వయంగా సీఎం పెన్షన్‌ అందించారు. ఇల్లు లేదని రుద్రమ్మ చెప్పడంతో వారికి వీలైనంత త్వరగా స్థలం కేటాయించి ఇల్లు కట్టాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

అదేవిధంగా నేమకల్లులో దివ్యాంగురాలు భాగ్యమ్మ ఇంటికి సీఎం చంద్రబాబు వెళ్లారు. భాగ్యమ్మ కుటుంబ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. భాగ్యమ్మకు దివ్యాంగ పింఛను 15 వేల రూపాయలను అందించారు. నేరుగా ముఖ్యమంత్రి ఇంటికి వచ్చి పెన్షన్ అందించడంపై లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్‌ కాలవ శ్రీనివాసులు, కలెక్టర్‌ వినోద్‌కుమార్, ఎస్పీ జగదీష్‌, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు తమ గ్రామానికి రావడంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు.

పింఛను ఎక్కువగా ఇచ్చే రాష్ట్రం మనదే: పింఛన్ల పంపిణీ అనంతరం ఏర్పాటు చేసిన గ్రామసభలో సీఎం మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా 64లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నామని సీఎం తెలిపారు. దేశవ్యాప్తంగా పింఛను ఎక్కువగా ఇచ్చే రాష్ట్రం మనదేనని తెలిపారు. పింఛన్ల కింద 5 నెలల్లో రూ.18వేల కోట్లు ఇచ్చామని పెంచిన పింఛన్లు ఏప్రిల్‌ నుంచి ఇచ్చామని తెలిపారు. పింఛను 3 నెలలకోసారి తీసుకునే సౌకర్యం కల్పించామని అన్నారు. లబ్ధిదారుల్లో కూలీలు, కార్మికులు ఉన్నారనే ఇలా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజల్లో ఆనందం శాశ్వతంగా ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు. అనంతపురం జిల్లా అంటే తనకు ప్రత్యేక అభిమానం ఉందని సీఎం చంద్రబాబు అన్నారు.

సెకి ఒప్పందంపై అభ్యంతరాలన్నీ తూచ్‌ - జగన్ అవినీతికి ఇవే సాక్ష్యాలు!

రాయలసీమను రతనాల సీమగా మార్చుతా: రాయదుర్గం వెనకబడిన ప్రాంతమని ఈ నియోజకవర్గం ఏడారిగా మారకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు. హంద్రీనీవాపై రూ.4,500 కోట్లు, రాయలసీమలోని ప్రాజెక్టులకు రూ.12,500 కోట్లు ఖర్చు పెట్టామని సీఎం వివరించారు. రాయలసీమను రతనాల సీమగా మారుస్తానని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. కష్టపడి పనిచేసి సంపద పెంచి పేదలకు పంచుతామని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 50 లక్షల మంది గ్యాస్‌ బుక్‌ చేసుకున్నారని సిలిండర్‌కు చెల్లించిన డబ్బు 48 గంటల్లో రిఫండ్‌ చేస్తున్నామని తెలిపారు. గత ఐదేళ్లు ఇసుక దొరక్క లక్షల మంది కూలీలు ఉపాధి కోల్పోయారని ఇక ఇసుక విషయంలో ఎవరు అడ్డువచ్చినా ఊరుకునేది లేదని చంద్రబాబు అన్నారు.

నెంబర్‌వన్ రాష్ట్రంగా ఏపీ: నా విజన్ వల్ల దేశంలోనే నెంబర్‌వన్‌ నగరంగా హైదరాబాద్‌ తయారైందని సీఎం అన్నారు. 2047 నాటికి దేశంలోనే ఏపీ నెంబర్‌వన్ రాష్ట్రంగా మారాలన్నారు. ప్రపంచాన్ని శాసించే శక్తియుక్తులు మన పిల్లలకున్నాయని, పిల్లలను చదివించాలి, వారిలో నైపుణ్యాలు పెంచాలని సూచించారు. స్థానిక సంస్థల్లో పోటీకి పిల్లల నియంత్రణ చట్టం తీసేశామని తెలిపారు. చదువుకున్న యువతే మన రాష్ట్రానికి పెద్ద ఆస్తి అని చంద్రబాబు అన్నారు.

బియ్యం అక్రమ ఎగుమతి వెనక పెద్దవాళ్లు - ఓడలోకి వెళ్లకుండా అడ్డుకున్నారు: పవన్ కల్యాణ్​

గంజాయి, డ్రగ్స్​పై డేగకన్ను: గతంలో నాసిరకం మద్యంతో విచ్చలవిడిగా దోచుకున్నారని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నాణ్యమైన మద్యం సరఫరా చేస్తున్నామని తెలిపారు. మత్తుపదార్థాల నిర్మూలనకు ఈగల్‌ పేరుతో డేగకన్ను ఉంచామని తెలిపారు. గంజాయి, డ్రగ్స్‌ విషయంలో కఠిన చర్యలు ఉంటాయని రాష్ట్రంలో ల్యాండ్‌, శాండ్‌, గంజాయి మాఫియా లేకుండా చేస్తామని సీఎం అన్నారు. రేషన్‌ బియ్యం కొని విదేశాలకు అమ్ముతున్నారని అలాంటి అక్రమ వ్యాపారులపై కఠినచర్యలు ఉంటాయని అన్నారు.

ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా సోలార్: ప్రతి గ్రామంలో సోలార్ ప్యానళ్లు పెరగాలని ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా ఇస్తామని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఏ గ్రామం చూసినా పరిశుభ్రంగా కనిపించాలని చెత్తాచెదారంతో కనిపించకూడదని అన్నారు. రాయదుర్గంలో ఇంటింటికీ తాగునీరు అందిస్తామని, కణేకల్‌, బొమ్మనహాళ్‌లో ఇసుక మేటలు పెరగకుండా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ఎక్కువమందికి ఉపాధి ఇచ్చే పరిశ్రమలకు ఎక్కువ రాయితీ ఇస్తామని తెలిపారు. ఐదు నెలల్లోనే రూ.4 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని అవి వస్తే వస్తే 4 లక్షల మందికి ఉపాధి వస్తుందిని సీఎం చంద్రబాబు వివరించారు.

అవినీతి జరిగితే చర్యలు తప్పవు: ఎక్కడ అవినీతి జరిగినా ఆయా అధికారులపై చర్యలు తప్పవని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. ఇంటికివచ్చి ఇచ్చారా లంచం అడిగారా అని ప్రజలను అడుగుతామని అన్నారు. అభిప్రాయాలు చెప్పేటప్పుడు ప్రజలు వాస్తవాలే చెప్పాలని సూచించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు నిత్యం పనిచేస్తామని తెలిపారు. బిందు, తుంపర సేద్యానికి మళ్లీ ప్రాధాన్యత ఇస్తామని సీఎం తెలిపారు.

అధికారులు అప్రమత్తంగా ఉండాలి - ఫెంగల్ తుపానుపై సీఎం చంద్రబాబు సమీక్ష

ఇక ప్రతి కుటుంబానికీ ఫ్యామిలీ బెనిఫిట్‌ కార్డు - ఏఐ ఆధారంగా పథకాల వర్తింపు

Last Updated : Nov 30, 2024, 7:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.