Clash Between Two RTC Drivers at Vijayawada Pandit Nehru Bus Stand : విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్‌లో ఇద్దరు ఆర్టీసీ డ్రైవర్లు బాహాబాహీకి దిగారు. ప్లాట్ ఫాం పైకి బస్సులను చేర్చే విషయమై డ్రైవర్ల మధ్య వివాదం చెలరేగింది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 6న రాత్రి 8 గంటల సమయంలో బస్సులో ఉన్న డ్రైవర్‌పై మరో డ్రైవర్ దాడి చేశారు. బస్సులో ఉన్న ప్రయాణికులకు ఏం జరుగుతుందో అర్థం కాక ఆందోళన చెందారు.
చవితి వేడుకల్లో యువకుల అనుచిత ప్రవర్తనతో గ్రామాల మధ్య ఘర్షణ - Two villeges fighting
అసభ్య పదజాలంతో దూషిస్తూ : జమ్మలమడుగు, కల్యాణదుర్గం డిపోలకు సంబంధించిన సూపర్ లగ్జరీ బస్సు డ్రైవర్లు, వాటిని ప్లాట్ ఫామ్ వద్దకు చేర్చే సమయంలో ఘర్షణ మొదలైంది. మొదట చిన్నగా మొదలైన ఘర్షణ మాట మాట పెరిగి పెద్ద గొడవకు దారితీసింది. జమ్మలమడుగు డ్రైవర్ బస్సులో ఉండగానే కల్యాణదుర్గం డ్రైవర్ అసభ్య పదజాలంతో దూషిస్తూ బస్సులోకి ప్రవేశించి కాలుతో తన్నిన దృశ్యాలు ఓ ప్రయాణికుడి సెల్‌ఫోన్ ద్వారా చిత్రీకరించాడు. ప్రస్తుతం ఇది సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
పండుగ వేళ మామిడాకుల కోసం గొడవ - వ్యక్తిపై కత్తితో దాడి - Accidents on Vinayaka Chavithi
ఒకరిపై మరొకరు అధికారులకు ఫిర్యాదులు : ఇంజిను ఆన్ లోనే ఉండగా డ్రైవర్‌పై దాడి చేశారని ప్రయాణికులు పేర్కొన్నారు. పొరపాటున బస్సు ముందుకు, వెనుకకు కదిలినా భారీ నష్టం జరిగి ఉండేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డ్రైవర్లు ఒకరిపై మరొకరు అధికారులకు ఫిర్యాదులు చేశారు. ఫిర్యాదులపై ఆయా డిపోల అధికారులు విచారణ జరుపుతున్నారు. బాధ్యులపై చర్యలకు ఆర్టీసీ ఉన్నతాధికారులు సిద్దమవుతున్నారు.
ముగ్గురి పేర్లూ ఒకటే- మద్యం మత్తులో ఒకరి హత్య- అసలేంజరిగిందంటే!