ETV Bharat / state

జగన్​ను కలవడానికి వస్తే అవమానిస్తారా- ఓడినా బుద్ధి మారలేదని కార్యకర్తలు ఆగ్రహం - Clash at YS Jagan House - CLASH AT YS JAGAN HOUSE

Clash at Former CM YS Jagan Residence in Tadepalli: మాజీ సీఎం జగన్‌ని కలిసేందుకు వెళ్లిన ఆ పార్టీ కార్యకర్తలకు చేదు అనుభవం ఎదురైంది. సమస్యలతో వచ్చిన వారికి ఆర్థిక సాయం అందిస్తారని వైఎస్సార్​సీపీ నాయకులు ప్రచారం చేసారు. దీన్ని నమ్మి కార్యకర్తలు జగన్‌ను కలవడానికి పెద్ద ఎత్తున తాడేపల్లిలోని జగన్ నివాసానికి తరలివచ్చారు. కాని అక్కడ జగన్ భద్రతా సిబ్బంది కార్యకర్తలను బయటకు నెట్టేశారు.

clash_at_ys_jagan_house
clash_at_ys_jagan_house (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 2, 2024, 7:39 PM IST

Updated : Aug 2, 2024, 8:30 PM IST

Clash at Former CM YS Jagan Residence in Tadepalli:

అధికారంలో ఉండగా ఐదేళ్ల పాటు వైఎస్సార్​సీపీ నేతలు, కార్యకర్తలను, జనాన్ని తాడేపల్లి ప్యాలెస్ గేటు కూడా దాటనివ్వకుండా పక్కన పెట్టిన వైఎస్ జగన్ ఎన్నికల్లో ఘోర ఫరాభవం పాలై, అధికారం పోగానే మెట్టు దిగారు. ఐదేళ్లలో ఏనాడూ వైకాపా శ్రేణులు, ప్రజలను తాడేపల్లి ప్యాలెస్ లోకి రానివ్వని మాజీ సీఎం జగన్ ఇప్పడు వారిని ఆహ్వానిస్తూ కలిసేందుకు అవకాశమిచ్చారు. కార్యకర్తలు, జనం కోసం జగన్ బంగ్లా తలుపులు తెరవడంతో పలువురు వైకాపా శ్రేణులు, ప్రజలు జగన్​ను కలిసేందుకు క్యాంప్‌ ఆఫీస్‌కు వచ్చారు. ఈ క్రమంలో జగన్ నివాసం వద్ద తోపులాట జరిగింది.

వైఎస్సార్​ససీపీ అధ్యక్షుడు జగన్‌ని కలిసేందుకు వెళ్లిన ఆ పార్టీ కార్యకర్తలకు చేదు అనుభవం ఎదురైంది. సమస్యలతో వచ్చిన వారిని జగన్‌ స్వయంగా కలిసి ఆర్థిక సాయం అందిస్తారని వైఎస్సార్​సీపీ నాయకులు ప్రచారం చేశారు. దీన్ని నమ్మి వివిధ జిల్లాల నుంచి కార్యకర్తలు జగన్‌ను కలవడానికి తాడేపల్లిలోని ఆయన నివాసానికి తరలివచ్చారు. గేటు బయట నుంచి 'రావాలి జగన్‌ రావాలి జగన్‌' అంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో జగన్‌ వ్యక్తిగత సిబ్బంది ప్రవర్తన కార్యకర్తలకు అసహనం తెప్పించింది.

జగన్‌ సాయం చేస్తారని ఆశగా వచ్చిన ఓ కార్యకర్త సెల్‌ ఫోన్‌ని వ్యక్తిగత సిబ్బంది లాక్కుని విసిరేశారు. కార్యకర్తలను బయటకు నెట్టేశారు. ఐదేళ్లుగా ఎవరు వచ్చినా జగన్‌ని కలవనివ్వకుండా చేయడం వల్లే ఓడిపోయామంటూ కొంతమంది కార్యకర్తలు వ్యాఖ్యానించారు. దీంతో వ్యక్తిగత సిబ్బంది, కార్యకర్తల మధ్య కొంత వాగ్వాదం జరిగింది. జగన్ ఇంటివద్ద తమకు ఎదురైన అనుభవంపై కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా చేయడం వల్లే ఎన్నికల్లో జగన్ ఓడిపోయారని కార్యకర్తలు మండిపడ్డారు. ఒడినా బుద్ధి మారలేదని ఆగ్రహంతో భద్రతా సిబ్బందిని తిట్టారు. అవమానించారంటూ కార్యకర్తలు తాడేపల్లి ప్యాలెస్ నుంచి అసహనంతో వెళ్లిపోయారు.

సమస్యలు ఉంటే తీరుస్తామని వైఎస్సార్​సీపీ నేతలు మాతో చెప్పారు. మేము కూడా మా సమస్యలు తీరుతాయని జగన్ ఇంటి వద్దకు వచ్చాము. ఎలాగైనా జగన్​ను కలిసే వెళ్దామనుకున్నాం. కానీ సెక్యురిటీ నన్ను కొట్టారు. కొట్టి బయటకు గెంటేశారు.- కార్యకర్త

ఆశ్చర్యపోతున్న ప్రజలు: అధికారంలో ఉన్న ఐదేళ్లూ తాడేపల్లి ప్యాలెస్ దరిదాపుల్లోకీ రానివ్వకుండా, ప్యాలెస్ మెట్లు ఎక్కనివ్వని జగన్ ఇటీవల తన ప్యాలెస్​లోకి కార్యకర్తలను నేతలను అనుమతిచ్చారు. ఆయన​లో వచ్చిన ఈ మార్పు చూసి పలువురు పార్టీ కార్యక్రర్తలు, ప్రజలు ఆశ్చర్యపోయారు. పార్టీ పుట్టినప్పటి నుంచీ జెండా మోసిన తమకు కనీస గౌరవం ఇవ్వలేదని, ఓడిపోగానే తాము గుర్తుకొచ్చామా అని కొందరు చర్చించుకుంటున్నారు. కనీసం తమ ప్రాంతాలకు వచ్చినపుడు కలుద్దామనుకున్నా పరదాలు కడుతుండటంతో జగన్​ను కలిసే అవకాశం రాలేదని పరాభవంతో జగన్​లో ఎట్టకేలకు మార్పు వచ్చినట్లుందని అనుకుంటున్నారు. ఈ సమయంలో జగన్ భద్రతా సిబ్బంది పార్టీ కార్యకర్తలు, అభిమానులపై జగన్ వ్యక్తిగత సిబ్బంది దురుసుగా ప్రవర్తించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

హైదరాబాద్​లో మరో ఇంటర్నేషనల్ స్టేడియం - త్వరలో స్పోర్ట్స్ పాలసీ - ONE MORE INTERNATIONAL STADIUM HYD

నాబార్డు నిధులను దారి మళ్లించిన వైఎస్సార్సీపీ సర్కార్​ - నిలిచిన బాపట్ల వైద్య కళాశాల నిర్మాణం - Medical College Construction

Last Updated : Aug 2, 2024, 8:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.