ETV Bharat / state

రెండు నెలలుగా క్లాప్​ డ్రైవర్లుకు వేతనాలు బంద్​ - CLAP Drivers Demands - CLAP DRIVERS DEMANDS

CLAP Drivers Demands for Pending Salaries : తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విజయవాడలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ డ్రైవర్లు ఆందోళన చేపట్టారు. డ్రైవర్లకు చెల్లించాల్సిన వేతన బకాయిలు ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. సకాలంలో జీతాలు ఇవ్వకపోతే కుటుంబాలను తాము ఎలా పోషించాలని యాజమాన్యాన్ని ప్రశ్నిస్తున్నారు.

clap_drivers_protest
clap_drivers_protest (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 21, 2024, 9:05 AM IST

రెండు నెలలుగా క్లాప్​ డ్రైవర్లుకు జీతాలు బంద్​ - వేతనం ఇవ్వకుండా యాజమాన్యం జాప్యం (ETV Bharat)

CLAP Drivers Demands for Pending Salaries : సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విజయవాడలో క్లాప్‌ డ్రైవర్లు చేస్తున్న ఆందోళన కొనసాగుతుంది. బకాయిలు చెల్లించి, సకాలంలో జీతాలు ఇవ్వాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని క్లాప్‌ డ్రైవర్లు హెచ్చరిస్తున్నారు.

CLAP Drivers Situation Miserable : విజయవాడ నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో 64 డివిజన్ పరిధిలో ప్రతిరోజు 225 చెత్త సేకరణ వాహనాలు తిరుగుతున్నాయి. ఈ వాహనాల డ్రైవర్లకు స్వయంభూ ట్రాన్స్‌పోర్టు యాజమాన్యం జీతాలు చెల్లిస్తోంది. క్లాప్​ డ్రైవర్‌కు రూ. 18,500 ఇవ్వాల్సి ఉంది. యాజమాన్యం మాత్రం రూ. 12,000 మాత్రమే చెల్లిస్తోంది. అదీ సకాలంలో ఇవ్వటంలేదని డ్రైవర్లు వాపోతున్నారు.

పని 'ఫుల్' జీతాలు 'నిల్' - దుర్భర పరిస్థితుల్లో క్లాప్ డ్రైవర్లు - Clap Auto Drivers Problems

సకాలంలో జీతాలు చెల్లించకుండా యాజమాన్యం వెట్టి చాకిరీ చేయించుకుంటుందని క్లాప్‌ డ్రైవర్లు ఆవేదన చెందుతున్నారు. సెలవులు లేకుండా 365 రోజులు పనిచేస్తున్న తమను గుర్తించటంలేదని అంటున్నారు. ఎప్పుడైనా సెలవు పెడితే ఆ రోజు జీతంలో కోత విధిస్తున్నారని వాపోతున్నారు. సమ్మెకు వెళ్లకుండా ఉంటే జీతం రూ.15,000 పెంచుతామని ఇచ్చిన హమీ ఇప్పటివరకు అమలు చేయలేదని డ్రైవర్లు ధ్వజమెత్తారు.

" రెండు నెలల నుంచి మాకు జీతాలు రావడం లేదు. యాజమాన్యం మాకు గుర్తింపు కార్డు కూడా ఇవ్వడం లేదు. ముందు కూడా ఒకసారి ధర్నా చేస్తే సమయానికి జీతాలు చెల్లిస్తామని పేర్కొన్న ఇంత వరకు చెల్లించలేదు. ఇంటి అద్దె కట్టడానికి, కనీస అవసరాలు కొనుగోలు చేయడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నాము " _విజయవాడ క్లాప్​ డ్రైవర్లు

Clap Drivers Wages Problems చెప్పింది ఒకటి.. చేర్చుకున్నాక ఇంతే.. చేతికిచ్చేది కొంతే.. కొన్ని నెలలుగా అదీ లేదు.. చెత్తసేకరణ ఉద్యోగుల జీతం వెతలు

క్లాప్‌ డ్రైవర్ల సమస్యలపై సీఐటీయూ (CITU) నాయకులతో చర్చించిన స్వయంభూ యాజమాన్యం డ్రైవర్లకు ఇవ్వాల్సిన జీతాన్ని రెండు రోజుల్లో జమ చేస్తామని హమీ ఇచ్చారు. ఇతర సమస్యల పరిష్కారం కోసం సీఐటీయూ నాయకులు వచ్చే నెల వరకు సమయం ఇచ్చారు. యాజమాన్యం అప్పటికి స్పందించకుంటే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని కాశీనాథ్‌ హెచ్చరించారు.

తామేమీ గొంతెమ్మ కొర్కెలు కోరడం లేదని డ్రైవర్లు అంటున్నారు. కనీస వేతనం అమలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. లేకుండా పెద్ద ఎత్తున ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని క్లాప్​ డ్రైవర్లు హెచ్చారించారు.

Clap Vehicle Labour Protest In Front Of YCP Office వైసీపీ కార్యాలయం ఎదుట చెత్త తరలించే వాహనాలు.. వేతనాలు చెల్లించాలంటు కార్మికుల ఆందోళన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.