ETV Bharat / state

శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ పరిధిలో చిరుత కలకలం - రంగంలోకి దిగిన అటవీ శాఖ అధికారులు - CHEETAH AT SHAMSHABAD AIRPORT - CHEETAH AT SHAMSHABAD AIRPORT

Cheetah At Shamshabad Airport in Hyderabad : ఈ మధ్య కాలంలో అడవుల్లో తిరగాల్సిన చిరుతలు జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి. తాజాగా శంషాబాద్‌ విమానాశ్రయం సమీపంలో చిరుత సంచారం చేస్తూ కనిపించింది. దాంతో అధికారులు అప్రమత్తమై దాన్ని పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దాంతో పాటు మరో రెండు పిల్లలు ఉన్నట్లు సమాచారం.

Cheetah Near Shamshabad Airport
Cheetah Jumped Airport Fencing
author img

By ETV Bharat Telangana Team

Published : Apr 28, 2024, 5:40 PM IST

Cheetah At Shamshabad Airport in Hyderabad : అడవిలో ఉండాల్సిన క్రూరమైన జంతువుల్లో జనావాసంలోకి ఒక్కోసారి అదుపు తప్పి వస్తుంటాయి. ఇలా వచ్చిన ప్రతిసారి స్థానికులు భయాందోళన చెందుతారు. ఒక్కోసారి ప్రాణాలు పోయే పరిస్థితి ఏర్పడుతుంది. తాజాగా రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్‌ విమానశ్రయంలో చిరుత పులి సంచరిస్తూ కలకలం సృష్టిస్తోంది. ఆదివారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో శంషాబాద్‌ మున్సిపాలిటీ పరిధిలోని గొల్లపల్లి వద్ద ఎయిర్‌పోర్టు ప్రహరీ నుంచి చిరుత దూకినట్లు అధికారులు గుర్తించారు. దాంతో పాటు మరో రెండు పిల్లలు కూడా ఉన్నట్లు తెలుసుకున్నారు.

Cheetah Jumped Hyderabad Airport Fencing : విమానశ్రయం ప్రహరీ దూకుతుండగా ఫెన్సింగ్‌ వైర్లకు చిరుత తగలడంతో ఎయిర్‌పోర్టు కంట్రోల్‌ రూమ్‌లో అలారం మోగింది. అనంతరం భద్రతా అధికారులు అప్రమత్తమయ్యారు. సీసీ కెమెరాలను పరిశీలించగా చిరుత సంచరిస్తున్నట్లు నిర్ధారించుకున్నారు. వెంటనే అటవీ శాఖ అధికారులకు జరిగిన విషయాన్ని తెలియజేశారు. అటవీ శాఖ అధికారులు విమానాశ్రయానికి చేరుకుని చిరుతను బంధించేందుకు ప్రయాత్నాలు చేస్తున్నారు. ట్రాప్‌ కెమెరా, బోన్లు ఏర్పాటు చేశారు. స్థానికులు చిరుత సంచార విషయాన్ని తెలుసుకుని భయభ్రాంతులు చెందుతున్నారు.

నార్కట్​పల్లిలో పులి సంచారం - అబద్ధమని తేల్చిన అటవీ శాఖ

3 సంవత్సరాలు క్రితం ఇలానే : దాదాపు మూడేళ్ల క్రితం 2019 నవంబరు 27న శంషాబాద్‌ ఎయిర్ పోర్టు గోడ దూకి చిరుత వెళ్లిన ఘటన జరిగింది. ఆ సమయంలో సీసీటీవీ కెమెరాల్లో సంచరిస్తున్నట్లు రికార్డయింది. ఎయిర్ పోర్ట్ గోడ దూకి పెద్ద గోల్కొండ, బహదూర్ గూడ వైపు చిరుత వెళ్తున్నట్లుగా వీడియోలో కనిపించింది. దానిని పట్టుకోడానికి అటవీ శాఖ అధికారులు బోన్లు ఏర్పాటు చేసి ప్రయత్నించారు.

రెండు గంటల పాటు అధికారులు చిరుత కోసం గాలించారు. అనంతరం అది చిరుత కాదని తేలడంతో ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. చివరికి సీసీ కెమెరాల్లో చిక్కింది చిరుత పులి కాదు అడవి పిల్లి అని అధికారులు నిర్ధారించారు. ప్రస్తుతం కూడా చిరుతపులి వ్యవహారం తీవ్ర అలజడి సృష్టిస్తోంది. అది అసలు చిరుతేనా? లేక గతంలో మాదిరి అడవి పిల్లా? అనేది ఇంకా తెలియాల్సి ఉంది.

మాజీ క్రికెటర్‌పై చిరుత దాడి - కాపాడిన శునకం - Cricketer Attacked by Leoparad

చిన్నారి లక్షితపై దాడిచేసిన చిరుతను గుర్తించిన అటవీ అధికారులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.