ETV Bharat / state

నిర్ణయాల్లో స్పీడ్ పెంచిన చంద్రబాబు - కలెక్టర్ల సదస్సు ఒక్కరోజుకే పరిమితం - Chandrababu Mark Rule in AP - CHANDRABABU MARK RULE IN AP

Chandrababu Mark Rule in AP : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1995 నాటి సీఎంను మళ్లి చూస్తారన్న ముఖ్యమంత్రి చంద్రబాబు అందుకు తగ్గట్లుగానే పాలనలో కొత్త శకానికి నాంది పలుకుతున్నారు. నిర్ణయాల్లో వేగం పెంచారు. మారిన తన వ్యవహారశైలిని చాటేందుకు రెండు రోజుల కలెక్టర్ల సదస్సును ఒక్కరోజుకే పరిమితం చేశారు. గంటల కొద్దీ చర్చలు శని, ఆదివారాల్లో అధికారులతో సమావేశాలు వంటి వాటికి చెక్ పెట్టి ప్రజలను కలిసి వారి వినతుల పరిష్కారినికే ప్రాధాన్యం ఇస్తున్నారు.

Chandrababu Mark in Governance System
Chandrababu Mark in Governance System (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 5, 2024, 7:13 AM IST

Chandrababu Mark in Governance System : 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో కలెక్టర్ల సదస్సు అంటే 2రోజుల పాటు జరిగేది. వివిధ శాఖలకు సంబంధించిన అంశాలపై పదుల సంఖ్యలో స్లైడ్స్‌ తయారు చేసేవారు. చంద్రబాబు వాటిపై గంటల కొద్దీ సుదీర్ఘంగా అర్ధరాత్రి వరకు చర్చించేవారు. కానీ ఇప్పుడు ఆయన పని విధానం మారింది. సమీక్షలు తగ్గించారు. వాటి సమయాన్నీ కుదించారు. కలెక్టర్ల సదస్సును ఒక్క రోజుకే పరిమితం చేశారు. ఒక్కో శాఖకు సంబంధించి మూడు, నాలుగు స్లైడ్స్‌ మించకూడదని స్పష్టం చేశారు. పాలనలోనూ చంద్రబాబు ప్రత్యేక శైలితో ముందుకు సాగుతున్నారు.

నిర్ణయాల్లో వేగం పెంచిన ముఖ్యమంత్రి : నిర్దేశిత సమయంలోనే చంద్రబాబు సమీక్షలు ముగిస్తున్నారు. సూటిగా, సమస్యకు పరిష్కారం చూపేలా నిర్ణయాలు ప్రకటిస్తున్నారు. సాధ్యమైనంత ఎక్కువగా ప్రజలను కలిసేందుకు ప్రాధాన్యమిస్తున్నారు. శని, ఆదివారాల్లో ప్రభుత్వ అధికారులతో సమీక్షలు, సమావేశాలను రద్దు చేశారు. శనివారం పార్టీ కార్యాలయానికి వెళ్లి ప్రజావినతులు స్వీకరిస్తున్నారు. రోజుకో మంత్రి, పార్టీ నాయకుడి ద్వారా వినతులు తీసుకుని పరిష్కరించే కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ప్రజలను కలిసి వారి సమస్యల పరిష్కారినికే ప్రాధాన్యం : పింఛన్ల పంపిణీతోపాటు వివిధ కార్యక్రమాల ద్వారా ప్రజల్ని కలుసుకుని వారి సమస్యల పరిష్కారానికి చంద్రబాబు ప్రాధాన్యమిస్తున్నారు. విద్య, అనారోగ్య సమస్యలపై వచ్చే వారికి. తక్షణమే ఆర్థిక సాయం మంజూరు చేస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలకు సమయమిస్తూ వారి అభిప్రాయాలు ముఖ్యమంత్రి తీసుకుంటున్నారు.

"ఇక స్పీడ్‌ పెంచడం తప్ప వెనక్కిపోయేది ఉండదు. 1995 నాటి ముఖ్యమంత్రిని చూస్తారు. చరిత్ర గుర్తు పెట్టుకోవాలని, నువ్వు కూడా అప్పట్లో కుర్రాడివని, నీకు కూడా ఐడియా లేదు హైదరాబాద్‌ నుంచి బయల్దేరుతున్నానంటే రాష్ట్రం మొత్తం రెడ్‌ అలర్ట్‌ ఉండేది. ఇప్పుడు అంతలా ఉండదు కానీ, తప్పు చేస్తే మాత్రం ఎవర్నీ వదిలిపెట్టను. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు అందరూ దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి." - చంద్రబాబు, ముఖ్యమంత్రి

CBN Mark Rule in AP : ఏదైనా శాఖకు సంబంధించి పత్రికలు, ప్రసార మాధ్యమాల్లో వార్తలు, కథనాలు వచ్చినా వైఎస్సార్సీపీ ప్రభుత్వం పట్టించుకున్న పరిస్థితి లేదు. దీన్ని పూర్తిగా మార్చాలని, మీడియాలో వచ్చే వార్తలపై స్పందించాలని, అధికారులను జవాబుదారీ చేయాలని చంద్రబాబు నిర్ణయించారు. సీఎంవో నుంచి మండలస్థాయి అధికారుల వరకు అందరినీ అప్రమత్తం చేసేలా ప్రత్యేక విధానం సిద్ధం చేస్తున్నారు.

రాష్ట్రంలో ఎక్కడేం జరిగినా సీఎంఓ తక్షణమే స్పందించి సంబంధిత అధికారులను అప్రమత్తం చేసే విధానం తెచ్చేందుకు సంకల్పించారు. ప్రమాదం, దుర్ఘటన, విపత్తు సమయాల్లో అధికారుల ప్రతిస్పందన ఎలా ఉందని ట్రాక్‌ చేసే వ్యవస్థను రూపొందిస్తున్నారు. 1995 మోడల్‌ పాలనకు ఆధునిక సాంకేతికత జోడించే కార్యాచరణ సిద్ధం చేశారు. సచివాలయంలో ఈరోజు నిర్వహించే జిల్లా కలెక్టర్ల సదస్సు దీనికి వేదిక కానుంది. ప్రభుత్వ ప్రాధాన్యాలపై చంద్రబాబు వారికి దిశానిర్దేశం చేయనున్నారు. పాలనలో వేగం పెంచేందుకు ఆయన సూచనలు ఇవ్వనున్నారు.

CM Chandrababu Review Meeting Collectors Today : కలెక్టర్ల సదస్సు ఈరోజు ఉదయం 10 గంటలకు జరగనుంది. వివిధ శాఖలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష చేయనున్నారు. సాయంత్రం ఎస్పీలతో శాంతి భద్రతలపై ఆయన సమీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకూ వరుసగా సీఎం సమీక్షిస్తారు. కలెక్టర్ల సదస్సులో ప్రారంభోపన్యాసం సీసీఎల్ఏ జయలక్ష్మి, సీఎస్ నీరబ్​కుమార్ ప్రసాద్ చేయనున్నారు. అనంతరం కలెక్టర్లను ఉద్దేశించి రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, ప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడనున్నారు.

శాఖలపై వరుసగా సమీక్షించనున్న చంద్రబాబు : ముందుగా వ్యవసాయ, అనుబంధ రంగాలు, అక్వా, అటవీ శాఖలపై చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు. తదుపరి గనులు, నీటివనరులు, పరిశ్రమలు, రవాణా, విద్యుత్, పెట్టుబడులు మౌలిక సదుపాయాల కల్పనపై సీఎం సమీక్షిస్తారు. భోజన విరామం తర్వాత పాఠశాల, ఉన్నత విద్య, నైపుణ్యాభివృద్ది, సంక్షేమ శాఖలు, పౌర సరఫరాల శాఖ, వైద్యారోగ్య, పురపాలక శాఖలపై, చివరగా రెవెన్యూ, ఎక్సైజ్ శాఖలు, శాంతి భద్రతలపై ముఖ్యమంత్రి సమీక్ష చేయనున్నారు. మరోవైపు కలెక్టర్ల సదస్సుకు పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ప్రతి మండలంలోనూ భూకుంభకోణం - కబ్జాదారులపై చర్యలు తప్పవన్న చంద్రబాబు - CBN Praja Darbar in NTR Bhavan

చేసిన మంచిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లండి- మంత్రులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం - Chandrababu Direction to Ministers

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.