Chandrababu Raa Kadali Raa Public Meeting : వైఎస్సార్సీపీ ప్రభుత్వ అరాచకాలను ఎండగట్టేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు ఈరోజు (శనివారం) అనంతపురం జిల్లాలో "రా కదలి రా" బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఇప్పటికే టీడీపీ నేతలు బహిరంగసభకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో రా కదలిరా పేరుతో ఒక బహిరంగసభ నిర్వహించాలని టీడీపీ అధిష్టానం నిర్ణయించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా ఉరవకొండలో నిర్వహించనున్న బహిరంగసభలో పార్టీ అధినేత చంద్రబాబు నాయడు పాల్గొని ప్రసంగిస్తారు.
రాష్ట్రాన్ని కాపాడటం కోసమే.. జగన్‌పై పోరాటం: చంద్రబాబు
సుమారుగా పది ఎకరాల విస్తీర్ణంలో చేపట్టిన బహిరంగసభ ఏర్పాట్లును జిల్లా అధ్యక్షుడు కాలవ శ్రీనివాసులు, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్, పరిశీలకులు హనుమంతురావు తదితరులు శుక్రవారం పర్యవేక్షించారు. బహిరంగవేదిక, గ్యాలరీ, వాహనాల పార్కింగ్, హెలీప్యాడ్ తదితరపనులను పరిశీలించారు. ఈ సభలో ఉరవకొండ నియోజకవర్గంతో పాటు చుట్టుపక్కల నియోజకవర్గాల నుంచి కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనే అవకాశముందని నేతలు వెల్లడించారు.
TDP Chief Chandrbabu Public Meeting in Anantapur District : ఈ సభకు అనంతపురం పార్లమెంటు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలు, టీడీపీ కార్యకర్తలు పెద్దఎత్తున హాజరయ్యేలా అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. చంద్రబాబు శనివారం ఉదయం పీలేరులో రా కదలి రా సభ ముగించుకొని, మధ్యాహ్నం 3.40 గంటలకు ఉరవకొండకు చేరుకుంటారు. ఇందుకోసం ఉరవకొండ మండలం లత్తవరం వద్ద టీడీపీ నేతలు హెలీప్యాడ్‌ను ఏర్పాటు చేశారు. అనంతరం సాయంత్రం నాలుగు గంటలకు రా కదలిరా బహిరంగ సభ ప్రారంభం కానుంది.
రాష్ట్రం దుర్మార్గుడి చేతిలో ఉంది - సైకో జగన్‌ను చిత్తుగా ఓడిస్తేనే భవిష్యత్: చంద్రబాబు
నాలుగున్నరేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో సీఎం జగన్ మోహన్ రెడ్డి చేసిన అరాచకాలను ఈ సభ ముఖంగా చంద్రబాబు నాయుడు ప్రజలకు వెల్లడించనున్నారు. కరవుపీడితమైన అనంతపురం జిల్లాలో నీటి పారుదల రంగానికి జగన్ మోహన్ రెడ్డి చేసిన ద్రోహం వంటి అంశాలను టీడీపీ అధినేత ప్రజలకు వివరించనున్నారు. సభ ముగిశాక సాయంత్రం ఆరు గంటలకు అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గంలోని టీడీపీ నేతలతో అధినేత సమావేశం నిర్వహించనున్నారు.
ఈ భేటీలో జిల్లాలో అభ్యర్థుల ఎంపిక విషయంలో కొందరు నేతలతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి వారి అభిప్రాయాలు తీసుకోనున్నారు. బహిరంగ సభ, ఇతర సమావేశాల అనంతరం చంద్రబాబు నాయుడు రాత్రి ఉరవకొండలోనే బస చేస్తారు. ఉరవకొండ పర్యటన అనంతరం ఆదివారం ఉదయం పది గంటలకు హెలీకాప్టర్‌లో నెల్లూరు జిల్లాకు చంద్రబాబు వెళ్లానున్నారు. ఈమేరకు టీడీపీ నేతలు చంద్రబాబు పర్యటన షెడ్యూల్‌ను ఖరారు చేశారు.
Chandrababu Fires on CM Jagan: జగన్ పనైపోయింది.. దేవుడు కూడా కాపాడలేరు: చంద్రబాబు