ETV Bharat / state

జగన్​ అహంకారి - విధ్వంసం, వినాశనమే తప్ప అభివృద్ధి చేతకాదు : చంద్రబాబు - CHANDRABABU PRAJA GALAM MEETING - CHANDRABABU PRAJA GALAM MEETING

CHANDRABABU PRAJA GALAM MEETING: జగన్ తన స్వార్థం కోసం రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. ఇప్పటికైనా ప్రజలంతా మేల్కొనకపోతే మరింత నష్టపోతామని హెచ్చరించారు. రాష్ట్రాభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వాన్ని గెలిపించాలని కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయనగరం జిల్లా శృంగవరపుకోట ప్రజాగళం సభలో ప్రసంగించారు.

CHANDRABABU PRAJA GALAM MEETING
CHANDRABABU PRAJA GALAM MEETING
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 23, 2024, 7:19 AM IST

రాష్ట్రంలో బందిపోటు పడ్డాడు - ప్రజలంతా మేల్కొనకపోతే మరింత నష్టపోతాం: చంద్రబాబు

CHANDRABABU PRAJA GALAM MEETING: ముఖ్యమంత్రి జగన్‌ అహంకారి అని, ఆయనకు విధ్వంసం, వినాశనం తప్ప అభివృద్ధి చేయడం చేతకాదని చంద్రబాబు మండిపడ్డారు. రాష్ట్రంలో బందిపోటు దొంగ పడ్డాడని, కాపాడుకోవడానికి వైసీపీను తరిమికొట్టాలన్నారు. ప్రజాగళం కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు విజయనగరం జిల్లాలో పర్యటించారు. శృంగవరపుకోటలో నిర్వహించిన బహిరంగసభలో ఆయన పాల్గొన్నారు. కూటమి పార్టీల శ్రేణులు పెద్దఎత్తున తరలివచ్చారు.

జగన్ హామీ జాబ్ క్యాలెండర్, డీఎస్సీ ఏమయ్యాయని నిలదీశారు. ఎస్‌ కోటను స్థానిక ఎమ్మెల్యే అవినీతి కోటగా మార్చారని చంద్రబాబు ధ్వజమెత్తారు. వైసీపీ ప్రభుత్వంలో ఎవరికీ రక్షణ లేదని, మహిళలకు అస్సలు రక్షణ లేదని అన్నారు. ఇందుకు నిదర్శనం, గుంటూరుజిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గానికి చెందిన కొవ్వురు లక్ష్మి అని తెలిపారు. వైసీపీ ప్రభుత్వ అన్యాయాలు, అక్రమాలపై ఆమె పోరాడిందని, దిల్లీకి వెళ్లి ఎంతో మంది ప్రముఖులను కలవడానికి ప్రయత్నం చేసిందని చెప్పారు.

ఎవరి అనుమతి లభించక పోవడంతో బొటన వేలు కొసుకుందని పేర్కొన్నారు. వైసీపీ అరాచక పాలన పోవాలని ఈ సాహసం చేసిందన్న చంద్రబాబు, అదేవిధంగా కర్నూలులో అబ్దుల్ కుటుంబం వైసీపీ ప్రభుత్వం పెట్టే బాధలు తట్టుకోలేక రైలు కింద పడి చనిపోయారని తెలిపారు. ఒక అరాచక శక్తి, ఒక దుర్మార్గుడు ఈ రాష్ట్రాన్ని ఏలుతున్నాడని, జగన్ ఒక అహంకారి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరైనా అన్యాయం జరిగింది అంటే వారిని బాధపెట్టడం, చివరికి హత్య చేస్తున్నారని, మండిపడ్డారు.

మద్య నిషేధం చేశాకే ఓటు అడుగుతానన్న జగన్‌- మాట నిలబెట్టుకున్నాడా?: చంద్రబాబు - Chandrababu fired at YCP

జగన్ ఒక బందిపోటు: అధికారంలోకి రాక ముందు, జగన్ అనేక హామీలు ఇచ్చాడని, అందులో ఒకటైన చేశాడా అని ప్రశ్నించారు. హామీలు సంగతి పక్కన పెడితే, వ్యవసాయం చచ్చిపోయిందని, రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ప్రజలకు ఒక సెంట్ భూమిచ్చాడని, ఆయన మాత్రం 500 కోట్లు ఖర్చుపెట్టి ఇళ్లను కట్టుకున్నాడని అన్నారు. పులివెందుల, హైదారాబాద్, బెంగుళూరు ఇలా అనేక చోట్ల ప్యాలెస్​లు ఉన్నాయని ఆరోపంచారు. అవి సరిపోలేదని విశాఖలో కూడా ప్యాలెస్ కట్టాడని, జగన్ ఒక బచ్చా కాదు, ఒక బందిపోటు అని మండిపడ్డారు. రాష్ట్రాన్ని దోచుకోవడానికి వచ్చిన ఒక బందిపోటని విమర్శించారు.

ఈ రాష్ట్రంలో చట్టం లేదని, న్యాయం లేదని విమర్శించారు. అంతేకాకుండా రాష్ట్రమంతా గంజాయి, డ్రగ్స్, చీప్ లిక్కర్ మయమైపోయిందని ధ్వజమెత్తారు. ఒక వ్యక్తి తన స్వార్థం కోసం రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నాడని మండిపడ్డారు. విశాఖను ఒక ఐటి హబ్​గా తాను తయారు చేస్తే, జగన్ మాత్రం ఒక గంజాయి హబ్​గా తయారు చేశాడని అన్నారు. దేశంలో ఎక్కడ గంజాయి దొరికినా, అది విశాఖ నుంచి సరఫరా అవుతుంటే చాలా బాధాకరంగా ఉందన్నారు. ఎక్కడ చూసినా భూ మాఫీయా, సెటల్ మెంట్లు కనిపిస్తున్నాయని, ఒక రాక్షస మాఫీయా వచ్చి విశాఖను నాశనం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తే, విశాఖ మరో పులివెందులలాగా మారిపోతుందని చంద్రబాబు అన్నారు.

కురుక్షేత్ర యుద్ధంలో ధర్మానిదే విజయం - వైసీపీను చిత్తుగా ఓడించడం కూటమికే సాధ్యం: చంద్రబాబు - CHANDRABABU PRAJA GALAM MEETING

జగన్ రాష్ట్రానికి పట్టిన క్యాన్సర్ గడ్డ: వైసీపీ పాలనలో రాష్ట్రంలో మొత్తం దోపిడీ మయం అయిపోయిందని మండిపడ్డారు. లాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే చట్టాన్ని తీసుకొచ్చారని, దాని ద్వారా ఉన్న భూమిని కూడా కొట్టేయడానికి ప్లాన్ చేస్తున్నారని ఆరోపించారు. పట్టాదారు పుస్తకం పైనా జగన్​ తన బొమ్మ వేసుకుంటున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరికి పొలంలో వేసే సర్వే రాళ్లపైనా ఆయన బొమ్మ వేసుకుంటున్నాడని, జగన్ రాష్ట్రానికి పట్టిన క్యాన్సర్ గడ్డ అని చంద్రబాబు ధ్వజమెత్తారు.

రాష్ట్రంలోని వ్యవస్థలంన్నిటిని జగన్ నాశనం చేశాడన్న చంద్రబాబు, అందుకే తాను, పవన్, బీజేపీ కలిశామన్నారు. ఈ కలయిక తమ కోసం కాదని, ఈ రాష్ట్ర ప్రగతి కోసమని తెలిపారు. ప్రజాగళం సభలో పాల్గొన్న విశాఖ లోక్‌సభ కూటమి అభ్యర్థి శ్రీభరత్, శృంగవరపుకోట అసెంబ్లీ అభ్యర్థి లలితకుమారి వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను తూర్పారబట్టారు.

సీఎం పదవి నాకు బాధ్యత- జగన్‌కు వ్యాపారం: చంద్రబాబు - CHANDRABABU PRAJA GALAM MEETING

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.