ETV Bharat / state

మరోసారి పెన్షనర్లను ఇబ్బంది పెట్టేందుకు జగన్ సర్కార్ పన్నాగం - చంద్రబాబు - chandrababu letter to ec on pension

Chandrababu Naidu Write Letter To EC On Pension : ఫించన్ల పంపిణీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ తీరుపై కేంద్ర ఎన్నికల సంఘానికి చంద్రబాబు లేఖ రాశారు. మే నెలలో ఒకటో తేదీన ఇంటివద్దనే పింఛన్లు అందించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. రాజకీయ ప్రయోజనాలు కోసం ఫించన్‌దారులను జగన్‌ సర్కార్‌ ఇ‌బ్బందులకు గురిచేస్తోందని పేర్కొన్నారు. ఏప్రిల్‌ నెలలో దాదాపు 30 మంది వరకు మరణించారని గుర్తుచేశారు. మేలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో మరోసారి వారిని ఇబ్బందులకు గురిచేసేందకు పన్నాగాలు పన్నినట్లు చంద్రబాబు ఆరోపించారు.

Chandrababu_Naidu_Write_Letter_To_EC_On_Pension

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 24, 2024, 10:02 PM IST

మరోసారి పెన్షనర్లను ఇబ్బంది పెట్టేందుకు జగన్ సర్కార్ పన్నాగం - కేంద్ర ఎన్నికల సంఘానికి చంద్రబాబు లేఖ

Chandrababu Naidu Write Letter To EC On Pension : రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీపై కేంద్ర ఎన్నికల సంఘానికి తెలుగుదేశం అధినేత చంద్రబాబు లేఖ రాశారు. మే నెల ఒకటో తేదీన పెన్షన్ల ఇంటింటి పంపిణీకి అవసరమై చర్యలు చేపట్టాలని లేఖలో డిమాండ్ చేశారు. గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామస్థాయి ఉద్యోగుల ద్వారా ఇంటివద్దే పెన్షన్ పంపిణీ చేసేలా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని కేంద్రం ఎన్నికల సంఘాన్ని కోరారు. రాష్ట్రంలో ఇంటింటికీ పింఛన్ల పంపిణీకి తగు ఏర్పాట్లు చేయాలని లేఖలో పేర్కొన్నారు.

CBN Writes to CEC on distribute Old Age Pensions : ప్రజాప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని పెన్షన్ల పంపిణీకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలన్నారు. వాలంటీర్లు లేని రాష్ట్రాల్లో కూడా ఇంటింటికీ పెన్షన్ల పంపిణీ జరుగుతుందని గతంలో హైకోర్టు కూడా వ్యాఖ్యానించిందని గుర్తుచేశారు. గ్రామ/వార్డు సచివాలయ సిబ్బందితో ఇంటింటికీ పెన్షన్ అందించడం సాధ్యమవుతుందని సీఎస్ నిర్వహించిన కాన్ఫరెన్స్ లో కలెక్టర్లు ఇదివరకే తెలిపారని చంద్రబాబు వివరించారు. లబ్ధిదారులందరికీ ఇంటి వద్దే పెన్షన్ అందించాలని గతంలో తాము చేసిన విన్నపాన్ని ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా పక్కనబెట్టిందని దుయ్యబట్టారు.

TDP Letter To EC Over Pension Distribution : గత నెలకు సంబంధించిన పెన్షన్ సొమ్ము ఒకటో తేదీన రావాల్సి ఉన్నా మూడవ తేదీ వరకు ప్రభుత్వం విడుదల చేయలేదని మండిపడ్డారు. పింఛన్ల కోసం మూడు రోజుల పాటు సచివాలయాల చుట్టూ తిరిగి ఎండదెబ్బకు 33 మంది వృద్ధులు మృతి చెందారని లేఖలో పేర్కొన్నారు. పెన్షన్ దారుల మరణాలను ప్రభుత్వం రాజకీయ లబ్ధికోసం ప్రతిపక్ష పార్టీలకు ఆపాదిస్తుందని తెలిపారు. మే నెలకు సంబంధించి పెన్షన్ పంపిణీకి సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో గతంలో చోటు చేసుకున్న పరిణామాలు పునరావృతం కాకుండా చూడాలన్నారు.

CBN Complaint to Election Commission : సజావుగా పెన్షన్ల పంపిణీ జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం, సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వాలన్నారు. రాష్ట్రంలో తీవ్రస్థాయిలో ఉన్న ఉష్ణోగ్రతల కారణంగా సచివాలయాల వద్ద పెన్షన్ దారులు నిరీక్షిస్తే లబ్దిదారుల ప్రాణాలకు ప్రమాదం ఏర్పడే అకాశం ఉందన్నారు. మానవతా దృక్పథంతో ఆలోచించి లబ్ధిదారుల ఇంటి వద్దకే ఒకటో తేదీన పెన్షన్ పంపిణీకి అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామస్థాయిలో ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నందును ఇంటింటికీ పెన్షన్ పంపిణీని రెండు రోజుల్లో పూర్తిచేసే అవకాశం ఉందన్నారు. ఇంటి వద్దనే పెన్షన్ పంపిణీ జరుగుతుందున్న సమాచారాన్ని లబ్ధిదారులకు చేరవేయాలని చంద్రబాబు లేఖలో కోరారు.

AP Elections 2024 : అయితే మే నెలలో పింఛను పంపిణీకి సొమ్ము అందుబాటులో ఉంటుందా? లేదా? అనే సందేహాలూ వ్యక్తమవుతున్నాయి. వివిధ పథకాలకు సంబంధించి సీఎం జగన్ ఫిబ్రవరి, మార్చి నెలల్లోనే రూ.8200 కోట్లకు బటన్ నొక్కినా ఇప్పటికీ ఖాతాల్లో జమకాలేదు. ఏప్రిల్ 30 నుంచి చేయూత, ఇతర పథకాల నిధులు లబ్దిదారుల ఖాతాల్లో పడతాయని సచివాలయ, వాలంటీర్ల గ్రూపుల్లో విస్తృత ప్రచారం జరుగుతోంది. వీటికోసం పింఛను చెల్లింపులు నిలిపేసే అవకాశం ఉందని, ఆ నెపాన్నీ తమపై నెట్టేసి తెలుగుదేశం పార్టీ వల్లనే పింఛను అందట్లేదని ప్రచారం చేస్తారని ప్రతిపక్షాలు పేర్కొంటున్నాయి.

వైఎస్సార్సీపీ ఫారమ్​-7 ఆగడాలు- అడ్డుకోవాలని ఈసీకి లేఖ

తక్కువ సమయంలో 50 శాతం లెక్కించొచ్చు : ఈసీకి చంద్రబాబు లేఖ

పింఛన్ల పంపిణీ అంశంపై రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు లేఖ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.