ETV Bharat / state

కౌరవ మూకను మే 13న అన్ని వర్గాలు ఏకమై తరిమికొట్టాలి : చంద్రబాబు - YCP Leader Misbehavior of Women

Chandrababu Naidu Twitter YCP Leader Misbehavior of Muslim Women : ముస్లిం మహిళపై వైసీపీ నాయకుడి అసభ్య ప్రవర్తనపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనారిటీ మహిళ బురఖాను తొలగించే స్థాయికి వైసీపీ నేతల అహంకారం చేరిందని మండిపడ్డారు.

chandrababu
chandrababu
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 6, 2024, 1:25 PM IST

కౌరవ మూకను మే 13న అన్ని వర్గాలు ఏకమై తరిమికొట్టాలి : చంద్రబాబు

Chandrababu Naidu Twitter YCP Leader Misbehavior of Muslim Women : వైసీపీ నేతల అహంకారం, దౌర్జన్యాలు మైనారిటీ మహిళ బురఖానూ తొలగించే స్థాయికి చేరిందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. నంద్యాల జిల్లా నందికొట్కూరులో వైసీపీ నాయకుడు, మున్సిపల్‌ కో- ఆప్షన్‌ సభ్యుడు శ్రీనివాసరెడ్డి ఓ మైనారిటీ సోదరి పట్ల అనుచితంగా వ్యవహరించడం దారుణమన్నారు. ప్రశ్నించిన బాధితులపైనే తిరిగి దాడి చేయడం అరాచక పాలనకు నిదర్శనమన్నారు. మత ఆచారాలను, మహిళల మనోభావాలకు గౌరవించని కౌరవ మూకను మే 13న అన్ని వర్గాలు ఏకమై తరమికొట్టాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఈ సంఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​, పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు ఖండించారు. పవిత్రమైన రంజాన్​ మాసంలో ముస్లింలపై దాడులు చేయడం సిగ్గుచేటని వారు మండిపడ్డారు.

బైక్ అడ్డంగా పెట్టావంటూ దళిత యువకుడిపై వైసీపీ వర్గీయులు దాడి - YCP Leaders Attack

Nandyala District : నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని ఓ ముస్లిం మహిళపై వైసీపీ నాయకుడు, పురపాలక సంఘం కో-ఆప్షన్ సభ్యుడు శ్రీనివాసరెడ్డి అసభ్యకరంగా ప్రవర్తించిన సంఘటనపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం బడే రాత్ సందర్భంగా నమాజుకు వెళ్తున్న ఓ ముస్లిం మహిళ బురఖాకు తొలగించి శ్రీనివాసరెడ్డి చూశారు. ఈ సంఘటనతో ఆ మహిళ వెంటనే ఇంటికి తిరిగి వెళ్లి తన భర్తకు, కుమారుడికి ఈ విషయాన్ని తెలిపింది. శ్రీనివాసరెడ్డి శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డికి ముఖ్య అనుచరుడు. బాధితురాలి భర్త, కుమారుడి స్థానికులతో కలిసి శ్రీనివాసరెడ్డి ఇంటికి వెళ్లి ప్రశ్నించారు. దీంతో కోపోద్రిక్తులైన శ్రీనివాసరెడ్డి దంపతులు 'మమ్మల్నే ప్రశ్నిస్తారా' అంటూ బాధితులను చెప్పుతో కొట్టారు.

వైఎస్సార్సీపీ నాయకుల దాష్టీకం-టీడీపీ నాయకుల కారుపై దాడి - YCP Leaders Attacked TDP Car

ఈ విషయం బాధితుల బంధువులకు, మిత్రులకు చెప్పడంతో వారంతా కలిసి శుక్రవారం రాత్రి శ్రీనివాసరెడ్డి ఇంటిపై దాడి చేశారు. అక్కడ ఉన్న కారు అద్దాలను పగలకొట్టారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధిత కుటుంబ సభ్యులు సుమారు 300 మందికి పైగా ఉండటంతో పోలీసులు వారిని అదుపు చేయడం కష్టమైంది. వెంటనే వారు వైసీపీ నాయకుడైన శ్రీనివాస రెడ్డిని అక్కడి నుంచి పోలీస్ స్టేషన్​కు తరలించారు. ఈ విషయం తెలుసుకొన్న బాధిత కుటుంబ సభ్యులు పోలీసు స్టేషన్​కు చేరుకొని రహదారిపై బైఠాయించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు శ్రీనివాసరెడ్డిపై కేసు నమోదు చేశారు. అనంతరం ఎఫ్ఐఆర్ (FIR) పత్రాన్ని వారికి చూపించడంతో ధర్నా విరమించి వెనుదిరిగారు. ఈ విషయం తెలుసుకున్న తెలుగుదేశం నాయకులు బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. వైసీపీ ప్రభుత్వంలో మైనారిటీలపై ఇలాంటి దాడులు మామూలైపోయాయని ఆరోపించారు. ముస్లింలకు టీడీపీ పార్టీ అండగా ఉంటుందని భరోసాను ఇచ్చారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.