Chandrababu Letter to CS on Distribution of Pensions: పింఛన్ల పంపిణీలో జగన్ ఆడుతున్న రాజకీయ పైశాచిక క్రీడలో ప్రభుత్వ అధికారిగా ఉన్న సీఎస్ భాగస్వామిగా మారడం పక్షపాత వైఖరికి నిదర్శనమని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. పింఛన్ల పంపిణీలో ప్రభుత్వ తీరు వల్ల గత నెలలో 35 మంది చనిపోతే, ఇప్పుడు ఒక్కరోజే ఆరుగురు ప్రాణాలు కోల్పోయారని ఇందుకు ఏ1 జగన్ రెడ్డి, ఏ2 ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అని చంద్రబాబు ఆరోపించారు. పేదల ప్రాణాలతో రాజకీయం చేయాలనుకోవడం ఇకనైనా మానుకోవాలంటూ సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీలో ప్రజల ఇబ్బందులపై సీఎస్‌కు చంద్రబాబు లేఖ రాశారు.
తక్షణమే ప్రతి లబ్దిదారుడికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇంటింటికీ పెన్షన్లు అందించాలని డిమాండ్ చేశారు. పోలింగ్‌కు ముందు సామాజిక పెన్షన్ల లబ్దిదారుల్ని వేధించి అధికార పార్టీకి లబ్ది చేకూర్చేలా వ్యవహరించడం బాధాకరమన్నారు. బాధ్యత కలిగిన ప్రభుత్వ అధికారిగా ప్రజలకు మేలు చేయడం ఆలోచించకుండా ఒక రాజకీయ పార్టీకి కొమ్ము కాసేలా ప్రవర్తించండ అత్యంత దుర్మార్గమని చంద్రబాబు అన్నారు. వృద్దులు, దివ్యాంగులు, వితంతవులు, ఇతర పెన్షన్ దారులు ఇబ్బందులు పడకుండా పెన్షన్ పంపిణీ సకాలంలో జరిగేలా ఎన్నికల కమిషన్ ఆదేశాలిచ్చిందని గుర్తు చేశారు.
అక్కడ కేసీఆర్ ఓటమికి అదే కారణం- ఇక్కడ ఆందోళనలో జగన్ అండ్ కో! - Land Titling Act
ఆ ఉత్తర్వుల్ని తుంగలో తొక్కుతూ, గత నెలలో సచివాలయాల వద్ద బారులు తీరేలా చేసి 33 మంది ప్రాణాలు కోల్పోవడానికి కారణం అయ్యారని మండిపడ్డారు. ఈనెల కూడా లబ్ధిదారులను మండుటెండల్లో బ్యాంకుల చుట్టూ తిరిగేలా చేసి, నరకయాతనకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క రోజులో పెన్షన్ల పంపిణీ పూర్తిచేసేంత వ్యవస్థ గ్రామస్థాయిలో ఉన్నా, ఇళ్ల వద్ద ఇవ్వకుండా బ్యాంకు ఖాతాల్లో జమ చేశారని విమర్శించారు. రాజకీయంగా అధికార పార్టీ నాయకులు చేస్తున్న కుట్రలో భాగమై పెన్షన్ నగదును బ్యాంకుల్లో జమ చేయడం వల్ల వృద్ధులు ముప్పుతిప్పలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
రాజమహేంద్రవరంలో వైఎస్సార్సీపీకి వ్యతిరేకత - కూటమిదే హవా - Rajamahendravaram Constituency
చాలా కాలంగా బ్యాంకు ఖాతాల నిర్వహణ లేకపోవడంతో లక్షలాది ఖాతాలు ఫ్రీజ్ అయ్యాయని. మరోవైపు బ్యాంకులకు వెళ్లిన వారికి కేవైసీ పేరుతో ఆధార్, పాన్ తీసుకురమ్మని చెబుతున్నారని వాటి కోసం మండుటెండలో లబ్దిదారులు రోడ్లపై తిరగాల్సి వస్తోందని మండిపడ్డారు. సంక్షేమ పథకాలను ఎలాంటి ఇబ్బంది లేకుండా అందించాల్సింది పోయి బాధ్యతాయుత స్థానంలో ఉన్న మీరే ప్రజల్ని ఇబ్బందులకు గురి చేయడం అధికార పార్టీకి లాభం చేకూర్చాలనే అజెండాలో భాగమే అని ఆరోపించారు. రాష్ట్రంలో 43 నుంచి 47 డీగ్రీల మధ్య ఉష్ణోగతలు నమోదవుతున్నాయని ఇలాంటి సమయంలో వృద్ధులను బ్యాంకుల చుట్టూ తిప్పడం సబబు కాదని సీఎస్ రాసిన లేఖలో చంద్రబాబు తెలిపారు.