ETV Bharat / state

దట్​ ఈజ్​ చంద్రబాబు- 'ఇక నుంచి మీకు చాలా పని ఉంటుంది' - Chandrababu Ended Curtain Rule

Chandrababu Ended Curtain Rule : సీఎంగా బాధ్యతలు చేపట్టిన రోజునే పరదాల పాలనకు చంద్రబాబు నాయుడు స్వస్తి పలికారు. ఓపెన్​ టాప్​ కారులో ప్రజలకు అభివాదం చేసుకుంటూ సచివాలయానికి వెళ్లారు. ప్రజల బాధలు తెలుసుకోవడమే తన కర్తవ్యమని అధికారులకు సృష్టం చేశారు. ఇకపై బారికేడ్లు పెట్టాల్సిన అవసరం లేదని అధికారులకు స్పష్టం చేశారు.

cbn_change_rules
cbn_change_rules (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 14, 2024, 7:29 AM IST

Updated : Jun 14, 2024, 8:41 AM IST

Chandrababu Ended Curtain Rule his Took Charge as CM : సీఎం అంటే ఒక అతీత శక్తి, ఎవరికీ కలిసేందుకు అవకాశం ఉండేది కాదు. జగన్‌ హయాంలో ఇలా ఉండేది పరిస్థితి. సీఎంగా బాధ్యతలు చేపట్టి ఒక్కరోజు కూడా పూర్తి కాకుండానే దాన్ని చంద్రబాబు మార్చేశారు. పరదాల పాలనకు స్వస్తి పలికి ప్రజాపాలనకు శ్రీకారం చుట్టారు. ప్రజలకు అభివాదం చేసుకుంటూ సచివాలయానికి వెళ్లారు. అక్కడ ఉద్యోగులతో సరదాగా మాట్లాడారు. తర్వాత కాన్వాయ్‌ ఆపి మరీ మీడియా ప్రతినిధులతో ముచ్చటించారు.

ప్రజా పాలనకు చంద్రబాబు శ్రీకారం- 'ఇక నుంచి మీకు చాలా పని ఉంటుంది' (ETV Bharat)

గత ఐదేళ్ల వైఎస్సార్సీపీ హయాంలో సీఎం ఎక్కడికెళ్లినా బారికేడ్లు రోడ్డుకు అడ్డంగా పెట్టి వాహనదారులను ఇబ్బంది పెట్టేవారు. దుకాణాలు మూయించి చిరువ్యాపారుల పొట్టకొట్టేవారు. జగన్‌ సచివాలయం, అసెంబ్లీకి వెళ్లే సమయంలోనూ బారికేడ్లు పెట్టి, వందలాది మంది పోలీసులు మొహరించి వలలు పట్టుకునేవారు. రాజధాని రైతుల నిరసన సీఎంకు కనపడకుండా ఉండేందుకు పరదాలు కట్టేవారు. ఈ సంప్రదాయాలన్నింటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్వస్తి పలికారు. రాజధాని రైతులు, ప్రజల మధ్య ఓపెన్‌ టాప్‌ ల్యాండ్‌ క్రూజర్‌ కారులో ఉండవల్లి నుంచి సచివాలయానికి పర్యటించారు. ప్రజల మద్దతుతోనే అధికారంలోకి వచ్చాం, వారి బాధలు తెలుసుకోవడమే తమ కర్తవ్యమని అధికారులకు చంద్రబాబు స్పష్టం చేశారు. ఇకపై బారికేడ్లు ఏర్పాటు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

పెద్దాయన వచ్చారు, పండుగ తెచ్చారు- సీఎం చంద్రబాబుకు రైతుల ఘనస్వాగతం - Farmers Grand Welcome to CBN

మాజీ సీఎం జగన్‌ సచివాలయానికి రాకుండా క్యాంపు కార్యాలయం నుంచి ఐదేళ్లు పాలన సాగించారు. ఉద్యోగులు కలిసేందుకు సరిగా సమయం సైతం ఇవ్వలేదు. దీంతో ఐదేళ్లుగా సచివాలయం వెలవెలబోయేది. ఇప్పడు చంద్రబాబు రాకతో సచివాలయం ప్రాంగణమంతా కళకళలాడింది. మందడం నుంచి సచివాలయం వరకు దారి పొడవునా ఉద్యోగ సంఘాల నాయకులు నాపా ప్రసాద్‌, రామకృష్ణ, మురళీకృష్ణ భారీ ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు ఉద్యోగులు బారులు తీరారు.

సీఎం కార్యాలయం ఉండే సచివాలయం మొదటి బ్లాక్‌ వద్ద రెడ్‌ కార్పెట్‌ వేసి ఘన స్వాగతం పలికారు. 'జై బాబు జైజై బాబు' అంటూ నినాదాలు చేస్తూ సందడి చేశారు. పుష్ప గుచ్ఛాలు అందించి అభినందనలు తెలిపారు. సెల్పీలు తీసుకునేందుకు ఉద్యోగులు పోటీ పడ్డారు. దీంతో దాదాపు ఐదేళ్ల తర్వాత సచివాలయంలో పండుగ వాతావరణం కనిపించింది.

సీఎంగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు - తొలిరోజే ఆ ఐదు సంతకాలు పూర్తి - CM Chandrababu Naidu

సీఎంగా బాధ్యతలు చేపట్టి ఐదు అంశాలపై సంతకాలు చేసిన తర్వాత చంద్రబాబు సచివాలయం మొదటి బ్లాక్‌ వద్ద మీడియా ప్రతినిధులను చూసి కాన్వాయ్‌ ఆపారు. సీనియర్‌ పాత్రికేయుల్ని పేరుపేరునా పలకరించారు. ఐదేళ్ల తర్వాత తాము సీఎంని కలిశామని, స్వేచ్ఛగా దగ్గరకొచ్చి మాట్లాడుతున్నామని కొందరు మీడియా ప్రతినిధులు చంద్రబాబుతో వ్యాఖ్యానించారు. రాష్ట్ర సచివాలయ వార్తలు కవర్‌ చేస్తున్నా ఈ అయిదు సంవత్సరాల్లో సీఎంను కలిసే అవసరం ఒకసారి కూడా రాలేదని తెలిపారు. 'ఇక నుంచి మీకు చాలా పని ఉంటుంది. పాలనలో సమూల మార్పును చూస్తారు. అన్నిచోట్ల మార్పు కనిపిస్తుంది' అని చంద్రబాబు విలేకర్లతో అన్నారు. గత ఐదేళ్లలో రాష్ట్ర సచివాలయంలో ఏమాత్రం అభివృద్ధి లేదని సీఎం చంద్రబాబు అన్నారు. ఇకపై అన్ని అంశాల్లోనూ మార్పు చూపిస్తామని వెల్లడించారు.

నేడు బాధ్యతలు స్వీకరించనున్న చంద్రబాబు - చరిత్రలో నిలిచిపోయేలా 5 సంతకాలు - Chandrababu Take Charge as CM

Last Updated : Jun 14, 2024, 8:41 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.