ETV Bharat / state

జగన్ చేసేవి శవ రాజకీయాలు - నావి ప్రజా రాజకీయాలు: చంద్రబాబు - Bapatla Prajagalam Sabha - BAPATLA PRAJAGALAM SABHA

Bapatla Prajagalam Sabha: బాపట్ల జిల్లా రేపల్లె ప్రజాగళం సభలో పాల్గొన్న తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు వైసీపీ పై నిప్పులు చెరిగారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సూపర్‌ సిక్స్‌ పథకాల ద్వారా మహిళల అభ్యున్నతికి కృషి చేస్తామని భరోసానిచ్చారు. విద్యావంతులు కావాలో, రౌడీలు కావాలో ప్రజలు తేల్చుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

Bapatla Prajagalam Sabha
Bapatla Prajagalam Sabha
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 13, 2024, 9:35 AM IST

Bapatla Prajagalam Sabha: వైసీపీ పాలనలో పోలవరాన్ని గోదావరిలో కలిపేశారని, సహజ వనరులను దోచేయడమే కాకుండా అమరావతి రాజధానినీ నాశనం చేశారని తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. బాపట్ల జిల్లా రేపల్లెలో నిర్వహించిన ప్రజాగళం సభలో పాల్గొన్న ఆయన, ప్రజావేదిక కూల్చివేతతో జగన్‌ పాలన ప్రారంభించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

జగన్ చేసేవి శవ రాజకీయాలు - నావి ప్రజా రాజకీయాలు: చంద్రబాబు

నవరత్నాలకు తేడా తెలుసుకోవాలి : బాపట్ల జిల్లా రేపల్లె ప్రజాగళం సభలో చంద్రబాబు పాల్గొనగా, జనం పెద్దఎత్తన తరలివచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సూపర్‌ సిక్స్‌ పథకాల ద్వారా మహిళల అభ్యున్నతికి కృషి చేస్తామని చంద్రబాబు ఈసంద్భంగా భరోసానిచ్చారు. వీటితో పాటు మరో నాలుగు పాయింట్లను కలపాలని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ సూచించగా అంగీకరించినట్లు వివరించారు. సూపర్‌ సిక్స్‌ పథకాలకు, వైసీపీ నవరత్నాలకు ప్రజలు తేడా తెలుసుకోవాలని చంద్రబాబు (Chandrababu) పిలుపునిచ్చారు.
ఇక దబిడి దిబిడే - ఎన్నికల ప్రచార క్షేత్రంలోకి బాలకృష్ణ - Balakrishna Election campaign

సూపర్ సిక్స్ ద్వారా ఆడబిడ్డ నిధి : తెలుగుదేశం మహిళలకు ప్రాధాన్యత ఇస్తుందని చంద్రబాబు పెర్కొన్నారు. మహిళల కోసం అనేక పథకాలను తీసుకువచ్చినట్లు తెలిపారు. సూపర్ సిక్స్ ద్వారా ఆడబిడ్డ నిధిని ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇంట్లో ఎందరు ఆడపిల్లలు ఉన్నా ఒక్కరికి 1500 చొప్పున ప్రతి నెల నగదు ఇవ్వనున్నట్లు తెలిపారు. రెండో పథకం తల్లి వందనం పేరుతో ప్రతి కుటుంబంలోని పిల్లలకు వారి ఒక్కొక్కరికీ 15000 వేల చొప్పున నగదు జమ చేస్తామని హామీ ఇచ్చారు. జగన్‌ టికెట్లు ఇచ్చిన వాళ్లలో జేబు దొంగలు, భూకబ్జాదారులు, ఇసుక మాఫియా, ఎర్రచందనం స్మగ్లర్లు, నమ్మక ద్రోహులే ఉన్నారని చంద్రబాబు దుయ్యబట్టారు. విద్యావంతులు కావాలో, రౌడీలు కావాలో ప్రజలు తేల్చుకోవాలన్నారు.

జగన్ చేసేవి శవ రాజకీయాలు : గత తెలుగుదేశం హయాంలో ఒక్కసారైనా కరెంట్ ఛార్జీలు పెరిగాయా? అనేది గుర్తుచేసుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. పేదలకు అన్నం పెట్టే అన్న క్యాంటీన్లు ఏం తప్పు చేశాయని ప్రశ్నించారు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక బీసీలకు చెందిన 30 పథకాలు రద్దు చేశారని చంద్రబాబు దుయ్యబట్టారు. జగన్ చేసేవి శవ రాజకీయాలు, తనవి ప్రజా రాజకీయాలని విమర్శించారు. తెలుగుదేశం హయాంలో ఎవరైనా తప్పు చేస్తే కఠిన శిక్షలు పడ్డాయని గుర్తు చేశారు. ఒక్క ఛాన్స్ అని వచ్చి ప్రజలను జగన్‌ మోసం చేశారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో తాను పదవిని బాధ్యతగా తీసుకుని పనిచేశానని, కానీ పదవిని సొంత వ్యాపారాలకు వాడుకునే వ్యక్తి సీఎం జగన్‌ అంటూ ఎద్దేవా చేశారు.
మరో సారి ఉమ్మడి ప్రచారం చేయనున్న చంద్రబాబు, పవన్ - కార్యకర్తల్లో ఫుల్ జోష్ - CBN Pawan Election Campaigning

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.