Chain snatching to pay off debt : అతడు చిరు వ్యాపారి. ఆమె అతడి దగ్గర చిరుద్యోగి. ఇద్దరిదీ తక్కువ ఆదాయమే. కానీ అవసరాలు మించిపోవడంతో అప్పులు చేశారు. అప్పులిచ్చిన వాళ్ల ఒత్తిడి పెరగటంతో తిరిగి చెల్లించలేక చిక్కుల్లో పడ్డారు. పరువు పోతోందన్న బాధతో ఏవిధంగానైనా డబ్బు సంపాదించి తీర్చేయాలనుకున్నారు. కానీ, సంపాదన మార్గం కనిపించకపోవడంతో చోరీకి పాల్పడ్డారు. చోరీకి కొత్త కావడంతో ముచ్చటగా మూడుగంటల్లోనే పోలీసులకు దొరికిపోయి ఆరుగంటల్లో అరెస్టయ్యారు. అనంతపురం జిల్లా ఎస్పీ అన్బురాజన్ తెలిపిన వివరాలివీ.
యువరాజ్ సింగ్ ఇంట్లో చోరీ - నగలు, డబ్బు మాయం
అనంతపురం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రెండో రోడ్డు ఎంఎంహెచ్ అపార్టుమెంటులో గోర యశ్వంత్, జొన్న శ్రావణి వేర్వేరు నివాసాల్లో ఉంటున్నారు. యశ్వంత్ కు చెందిన మొబైల్ దుకాణంలో శ్రావణి పనిచేస్తోంది. వీళ్లిద్దరు అధికంగా అప్పులు చేయటంతో తిరిగి చెల్లింపుల కోసం అప్పులిచ్చిన వారి నుంచి వత్తిడి పెరిగింది. సీన్ కట్ చేస్తే.
గంగూలీ ఇంట్లో ఫోన్ చోరీ - డేటాపై దాదా ఆందోళన
రోజూ దుకాణానికి వెళ్లొచ్చే క్రమంలో తాము నివాసం ఉంటున్న అపార్టుమెంటు గ్రౌండ్ ఫ్లోర్ లో అనారోగ్యంతో మంచానికే పరిమితమైన ఓ వృద్ధురాలిని శ్రావణి గమనించింది. ఆ వృద్ధురాలు ఇంటి బయట పడుకొని ఉంటోంది. ఆమె మెడలో బంగారం ఉన్న విషయాన్ని గుర్తించి, ఎలాగైనా కొట్టేయాలని శ్రావణి పథకం వేసింది. ఈ విషయాన్ని యశ్వంత్ కు చెప్పడంతో ఇద్దరూ కలిసి మహిళ మెడలో గొలుసు కొట్టేయడానికి పథక రచన చేశారు.
రెచ్చిపోయిన దొంగలు- కస్టమర్స్‌లా జువెల్లరీ షాప్‌లోకి చొరబడి యజమానిపై దాడి!
ఈ నేపథ్యంలో మధ్యాహ్న వేళ అపార్టుమెంటులో అందరూ విశ్రాంతి తీసుకునే సమయంలో ప్లాన్ అమలు చేసి దొరికిపోయారు. వృద్ధురాలు ఒక్కరే వెలుపల పడుకొని ఉన్నారని శ్రావణి యశ్వంత్‌కు సమాచారం ఇచ్చింది. బురఖా ధరించి అపార్టుమెంట్ పై అంతస్తులోని తన ఇంటినుంచి లిఫ్ట్ లో కిందకు వచ్చిన యశ్వంత్.. ఒంటరిగా పడుకొని ఉన్న మహిళ మెడలో గొలుసు కొట్టేశాడు. వృద్ధురాలు, పైగా ఆమె పక్షవాతంతో బాధపడుతుండడంతో వెంటనే స్పందించలేకపోయింది. దీంతో యశ్వంత్ గొలుసు లాగేసుకొని మెట్ల దారి నుంచి వేగంగా తన నివాసంలోకి వెళ్లిపోయాడు.
అంతా సవ్యంగా జరిగిపోయిందనుకున్నారు కానీ, చోరీ తతంగమంతా సీసీ కెమెరాలో నమోదయ్యిందని మర్చిపోయారు. బాధిత కుటుంబం నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు ముందుగా సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలించారు. ఘటన జరిగిన ఆరు గంటల్లో గొలుసు చోరీ చేసిన యశ్వంత్‌ను పట్టుకొని, అతడికి సహకరించిన శ్రావణిని సైతం అరెస్టు చేశారు. వారి నుంచి 3.60 లక్షల రూపాయల విలువైన ఆరు తులాల బంగారు నగలు స్వాధీనం చేసుకున్నారు.
డైరెక్టర్ ఇంట్లో చోరీ - నేషనల్ అవార్డులను కూడా ఎత్తుకెళ్లిన దొంగలు