ETV Bharat / state

ఓట్ల లెక్కింపునకు రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత ఏర్పాట్లు - అల్లర్లు సృష్టిస్తే కఠిన చర్యలు - June 4th Counting Votes In Ap - JUNE 4TH COUNTING VOTES IN AP

Andhra Pradesh Election Counting Votes on June 4th: జూన్‌ 4న ఓట్ల లెక్కింపునకు రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. హింసకు తావులేండా కౌంటింగ్‌ ప్రక్రియ పూర్తియ్యేలా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వివరించారు. రాజకీయ పార్టీల నేతలు, కార్యకర్తలు అంతా పోలీసులకు సహకరించాలని అల్లర్లు సృష్టించడానికి ప్రయత్నిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Andhra Pradesh Election Counting Votes on June 4th
Andhra Pradesh Election Counting Votes on June 4th (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 2, 2024, 8:49 AM IST

కౌంటింగ్‌ పటిష్ట ఏర్పాట్లుపై ముఖేష్ కుమార్ మీనా సమీక్ష - అల్లర్లు సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక (ETV Bharat)

Andhra Pradesh Election Counting Votes on June 4th : రాష్ట్రంలో ఇప్పటివరకు ఎన్నికలను స్వేచ్ఛగా, న్యాయంగా, శాంతియుతంగా నిర్వహించడంలో కృషి చేసిన ప్రతి ఒక్కరినీ సీఈవో ముఖేష్ కుమార్ మీనా ధన్యవాదాలు తెలిపారు. దేశ వ్యాప్తంగా జరిగిన ఏడు విడతల సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ నేటితో ముగియడంతో అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, ఎస్పీలు, సీపీల కృషికి ప్రశంసలను తెలియజేస్తూ లేఖ రాశారు. ప్రస్తుతం ఓట్ల లెక్కింపు అనే క్లిష్టమైన దశకు ఎన్నికల ప్రక్రియ చేరుకున్న నేపథ్యంలో ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. తీవ్రమైన పోటీ కారణంగా భావోద్వేగాలు అదుపు తప్పే అవకాశం ఉందని, ఓట్ల లెక్కింపునకు ముందు, లెక్కింపు రోజున తరువాత అత్యంత శ్రద్ధతో శాంతిభద్రతల పరిస్థితిని నిర్వహించాల్సిన ఆవశ్యకతను గుర్తు చేశారు.

ఎన్నికల ఓట్ల లెక్కింపుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు - గొడవలకు దిగితే పీడీ యాక్ట్‌, జిల్లా బహిష్కరణే! - June 4th Counting Votes in ap

కౌంటింగ్ ప్రక్రియను సవాల్‌గా తీసుకున్నాం : కృష్ణా జిల్లాలో కట్టుదిట్టమైన భద్రత మధ్య జూన్ 4న ఓట్ల లెక్కింపు నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. ఓట్ల లెక్కింపులో శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి హెచ్చరించారు. కౌంటింగ్ మూసే వరకు పోలీస్ శాఖ అన్ని విధాలుగా అప్రమత్తంగా ఉంటుందని అన్నారు. కౌంటింగ్ వేళ చీరాల, బాపట్ల, రేపల్లె, అద్దంకి ప్రాంతాలపై గట్టి నిఘా ఏర్పాటు చేసినట్లు బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. పల్నాడు జిల్లాలో కౌంటింగ్ ప్రక్రియను సవాల్‌గా తీసుకున్నట్లు జిల్లా ఎస్పీ మలికా గార్గ్ చెప్పారు. కౌంటింగ్ రోజు ఒక్కకేసు నమోదైనా రౌడీషీట్ పెట్టడంలో వెనుకాడబోమని హెచ్చరించారు.

కౌంటింగ్ కేంద్రంలో అలజడి సృష్టిస్తే తక్షణమే అరెస్ట్ : సీఈఓ మీనా - CEO Inspected Vote Counting Center

రాజకీయ పార్టీలు, ప్రజలు అందరూ సహకరించాలి : విశాఖ ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్‌లో కౌంటింగ్ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ మల్లిఖార్జున చెప్పారు. మొత్తం 21 కౌంటింగ్ హాల్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కోనసీమ జిల్లాలో ఎన్నికల ప్రక్రియ సజావుగా పూర్తయ్యే విధంగా రాజకీయ పార్టీలు, ప్రజలు అందరూ సహకరించాలని ఏలూరు రేంజ్‌ ఎన్నికల ఇంఛార్జ్ రవి ప్రకాష్ విజ్ఞప్తి చేశారు. కౌంటింగ్ హాలులో ఓట్ల లెక్కింపు సజావుగా, సౌకర్యవంతంగా జరిగేలా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వైఎస్‌ఆర్‌ జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు చెప్పారు. కడపలో జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ విస్తృత పర్యటన చేశారు. జూన్ 4 న సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో బందోబస్తును పరిశీలించి పోలీస్ అధికారులకు పలు సూచనలు చేశారు.

కౌంటింగ్‌ రోజు అల్లర్లకు పాల్పడితే జిల్లా బహిష్కరణ : డీఎస్పీ షరీఫ్‌ - Kadapa DSP on Counting Process

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.