Central Minister Rajnath Singh criticized CM Jagan: వైఎస్సార్ కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం ఎర్రగుంట్లలో బీజేపీ నిర్వహించిన సమావేశం కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ పాల్గొన్నారు. జగన్ సొంతజిల్లాలో శాంతిభద్రతలు సరిగా లేవని ఆరోపించారు. ఏపీ నుంచి డబుల్ ఇంజిన్ సర్కార్ మొదలవుతోందని ధీమా వ్యక్తం చేశారు.
ఒకే దేశం ఒకే ఎన్నిక మోడీ ప్రభుత్వం లక్ష్యం: ముఖ్యమంత్రి జగన్ సొంత జిల్లాలో లా అండ్ ఆర్డర్ సరిగా లేదని కేంద్ర హోం శాఖ మంత్రి రాధా సింగ్ అన్నారు. వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలోని ఎర్రగుంట్ల లో పార్టీ కార్యకర్తల సమావేశంలో రాజ్నాథ్ పాల్గొన్నారు జమ్మలమడుగు అసెంబ్లీ బీజేపీ అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి, కడప టీడీపీ అభ్యర్థి భూపేష్ రెడ్డి సమావేశానికి హాజరయ్యారు. ఏపీ నుంచి డబుల్ ఇంజిన్ సర్కార్ మొదలవుతోందని కేంద్ర మంత్రి అన్నారు. ఏపీ ప్రగతిలో మోడీ పాత్ర కీలకం అని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ప్రధాన మంత్రి పివి నరసింహ రావు కి సైతం భారత రత్న ఇచ్చిన ఘనత మోడీ ప్రభుత్వానికి చెందుతుందని వ్యాఖ్యానించారు. ఒకే దేశం ఒకే ఎన్నిక మోడీ ప్రభుత్వం లక్ష్యం అన్నారు. పదేళ్ల తర్వాత చిన్న పిల్లలకి కూడా గుర్తు లేకుండా పోయే పార్టీ కాంగ్రెస్ అని రాజనాథ్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ ని దేశంలో లేకుండా చేయాల్సిన బాధ్యత ప్రజలదే అన్నారు. ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం 25 లక్షల ఇల్లు మంజూరు చేస్తే కేవలం ఇళ్ల స్థలాలు ఇచ్చి చేతులు దులుపుకున్న వ్యక్తి ముఖ్యమంత్రి సీఎం జగన్ అని విమర్శించారు.
కర్నూలు జిల్లా ఆదోని భహిరంగ సభలో: అనంతరం కర్నూలు జిల్లా ఆదోనిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాజ్‌నాథ్‌సింగ్, అదోనిలో ఎన్డీయే కూటమి బీజేపీ అభ్యర్థి పార్థసారధి కోసం ప్రచారం చేశారు. కంట్రోల్ రూం నుంచి భీమస్ కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం భీమస్ కూడలిలో ఏర్పాటు చేసిన సభలో రాజ్‌నాథ్‌సింగ్ మాట్లాడారు. రాష్ట్రంలో ల్యాండ్, సాండ్, వైన్ మాఫియా పాలిస్తోందని ఆరోపించారు. వీటిని సీఎం జగన్ పెంచి పోషిస్తున్నారని ఎద్దేవా చేశారు. దేశంలో, రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ తోనే అభివృద్ధి సాధ్యమన్నారు. డాక్టర్ పార్థసారధిని తానే బీజేపీలోకి తీసుకొచ్చానని తెలిపారు. ఆయనను గెలిపిస్తే ఆదోని అభివృద్ధికి నిధులు ఇప్పించే బాధ్యత తీసుకుంటానన్నారు. అవినీతి, అక్రమాలకు పాల్పడే ప్రభుత్వాన్ని ఇంటికి పంపేందుకే ఎన్డీఏ జతకట్టిందని తెలిపారు. వైసీపీ ప్రభుత్వాన్ని తరిమికొట్టే రోజులు దగ్గర పడ్డాయని ఎద్దేవా చేశారు.
రాజ్‌నాథ్‌సింగ్‌తో కాపు రామచంద్రారెడ్డి భేటీ - బీజేపీలో చేరేనా !