CM Chandrababu Thanks to PM Modi and Central Minsiters : విశాఖ స్టీల్ ప్లాంట్ నిర్వహణకు ఎప్పుడు ఇబ్బంది వచ్చినా ఆదుకున్నది ఎన్డీయే ప్రభుత్వమేనని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఇది 'విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు' నినాదంతో తెలుగుజాతి సాధించుకున్న పరిశ్రమ అని తెలిపారు. స్టీల్ ప్లాంట్‌కు కేంద్రం భారీ ప్యాకేజీకి ప్రకటించడంతో ప్రధాని మోదీ, నిర్మలా సీతారామాన్, కుమారస్వామిలకు ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందనలు తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఎంతో పట్టుదలతో కష్టపడి రూ.11,440 కోట్లు సాధించామన్నారు. విశాఖ ఉక్కును బలమైన సంస్థగా ముందుకు తీసుకెళ్లేందుకు కలసికట్టుగా కృషి చేస్తామని వెల్లడించారు.
సమర్ధుడైన సీఈఓను నియామకం ద్వారా అన్ని సమస్యలు పరిష్కారం కావాలని ఆకాంక్షించారు. గడిచిన 7 నెలల్లో అసాధ్యమైన పనులెన్నో సాధించుకుంటూ వస్తున్నామన్నారు. అమరావతి ఏకైక రాజధాని గా తేల్చడంతో నిధులు తెచ్చి పుననిర్మాణం చేపట్టామని చంద్రబాబు తెలిపారు. పోలవరానికి నిధులు సాధించాం, డయాఫ్రమ్ వాల్ కు శంకుస్థాపన చేస్తున్నామని వివరించారు. విశాఖ రైల్వే జోన్‌కు అవసరమైన భూమిని సమీకరించి జోన్‌ను సాధించామని గుర్తు చేశారు. 7 నెలల్లో 4లక్షల కోట్ల పెట్టుబడులు సాధించామని వివరించారు. మిట్టల్ పరిశ్రమ, విశాఖ స్టీల్ ప్లాంట్ ద్వారా విశాఖ-అనకాపల్లి కలిసి స్టీల్ నగరంగా అవతరిస్తుందని అభిప్రాయపడ్డారు.
వేల కుటుంబాల్లో ఆశలు రేకెత్తించింది : స్టీల్‌ప్లాంటుకు కేంద్రం భారీ ప్యాకేజీ ప్రకటించడం చాలా సంతోషం అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఉక్కు పరిశ్రమను నిలబెట్టాలన్న ప్రధాని నిబద్ధతకు ఇదే నిదర్శనమన్నారు. ప్యాకేజీ కేవలం సంఖ్య కాదు వేల కుటుంబాల్లో ఆశలు రేకెత్తించిందని తెలిపారు. ఆత్మనిర్భర్ భారత్ కల సాకార క్రమంలో స్టీల్ ప్లాంటు ఒకటన్నారు. ఏపీ అభివృద్ధి పట్ల మోదీ నిబద్ధతకు రాష్ట్ర ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. అలాగే నిర్మలా సీతారామన్, కుమారస్వామికి ధన్యవాదాలు తెలిపారు.
చంద్రబాబు కష్టాన్ని దగ్గరగా చూశా : ఉక్కు రెక్కలతో ఆయుధాలు ధరించి, ఆంధ్రప్రదేశ్ కొత్త శిఖరాలకు ఎదుగుతుందని లక్షలాది జీవితాలను మంచిగా మారుస్తుందని మంత్రి లోకేశ్ అన్నారు. కూటమి ప్రభుత్వంలో ఫలితాలు కనిపిస్తున్నాయని తెలిపారు. కేంద్రం ప్రకటించిన రూ.11,440 కోట్ల ప్యాకేజీతో వైజాగ్ స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణ జరుగుతుందన్నారు. నష్టాల్లో ఉన్న ఉక్కు కర్మాగారాన్ని మూతపడకుండా కాపాడేందుకు సీఎం చంద్రబాబు ఎలా కృషి చేశారో తాను చాలా దగ్గరగా చూశానని లోకేశ్ స్పష్టం చేశారు. వికసిత్ భారత్ - వికసిత్ ఏపీలో భాగంగా దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తూనే లక్షలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పించే ప్లాంట్ కు పెద్దపీట వేసినందుకు ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. మద్దతుగా నిలిచిన ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్, మంత్రి కుమారస్వామికి కృతజ్ఞతలు చెప్పారు.
Andhra Pradesh today stands vindicated for voting NDA to power. The state's pride and crown jewel, the Vizag Steel Plant, will be revived and revitalized with a special package of Rs 11,440 crore, approved by Hon'ble Prime Minister Sri @narendramodi Ji.
— Lokesh Nara (@naralokesh) January 17, 2025
Watching from close… pic.twitter.com/iR91ThkRuf
విశాఖ స్టీల్ ప్లాంట్‌కు రూ. 11,440 కోట్లు - కేంద్రం అధికారిక ప్రకటన
విశాఖ ఉక్కు పరిశ్రమకు కేంద్రం రివైవల్ ప్యాకేజీ ప్రకటించడం పట్ల మంత్రి కొల్లు రవీంద్ర హర్షం వ్యక్తం చేశారు. గత పాలకులు విశాఖ ఉక్కుని నాశనం చేసేందుకు కుట్రలు చేశారని మండిపడ్డారు. స్టీల్ ప్లాంట్ ఆస్తుల్ని కబ్జా చేసేందుకు పోస్కో కంపెనీతో చీకటి ఒప్పందాలు చేసుకున్నారని ఆరోపించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ మొత్తాన్ని నాశనం చేసేందుకు కుట్రలు చేసినట్లు మాజీ సీఎస్ బయటపెట్టారన్నారు. కూటమి అధికారంలోకి రాగానే విశాఖ కేంద్రంగా 2 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు శ్రీకారం చుట్టామని తెలిపారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేంద్రం 11,440 కోట్లు కేటాయించినందుకు సంతోషంగా ఉందని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. విశాఖ ఉక్కు పరిరక్షణకు తాను గతంలో ఎమ్మెల్యే పదవికి చేసిన రాజీనామా ఫలించిందన్నారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వానికి మోదీ సహకారం పూర్తిస్థాయిలో అందుతుందనడానికి స్టీల్ ప్లాంట్ కి లభించిన ప్యాకేజీయే నిదర్శనం అని అన్నారు. జగన్ హయాంలో ప్లాంట్ గురించి ఏమాత్రం పట్టించుకోలేదని విమర్శించారు.
మంత్రులు, ఎంపీల మధ్య ఇంకా మరింత సమన్వయం చేసుకుని కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులపై ప్రత్యేక దృష్టి సారిస్తామని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు స్పష్టం చేశారు. స్టీల్ ప్లాంట్ పునరుద్దరణ కోసం కేంద్రం సహాయం చేయటాన్ని స్వాగతిస్తున్నామన్నారు.
నిషేధిత భూములపై మంత్రివర్గ ఉపసంఘం - కేబినెట్ నిర్ణయాలివే
విశాఖ ఉక్కు పరిశ్రమకు కేంద్రం 11,440 కోట్ల రూపాయల ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించడంతో ఎమ్మెల్యే గణబాబు సంబరాలు చేసుకున్నారు. కార్యకర్తలతో కలిసి బాణసంచా కాలుస్తూ సందడి చేశారు. తెలుగు ప్రజల తరఫున ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. వెంటిలేటర్‌పై ఉన్న స్టీల్ ప్లాంట్‌ని కూటమి సర్కార్ ఆక్సిజన్ ఇచ్చి నిలబెట్టిందన్నారు.
మరోసారి రెచ్చిపోయిన బీటెక్ రవి వర్గీయులు - ఎమ్మెల్సీ అనుచరుడిపై దాడి