Central Government Approves Second Rail Route Via Basara : మహారాష్ట్రలోని ముథ్కెడ్ నుంచి ఆదిలాబాద్‌లోని బాసర మీదుగా ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలోని డోన్ వరకు రెండో రైల్వే లైన్ మంజూరైంది. ఈ రైల్వై లైన్ ఏర్పాటుకు అవసరమైన భూసేకరణకు ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. మహారాష్ట్రలోని ముథ్కెడ్ నుంచి బాసర మీదుగా నిజామాబాద్ వరకు సంబంధింత అధికారులు అవసరమైన భూమిని సేకరించారు. కాగా నిజామాబాద్ నుంచి కర్నూల్ జిల్లా డోన్ వరకు భూసేకరణ చేయాల్సి ఉంది.
బాసర మీదుగా రెండో లైన్ పూర్తయితే జిల్లా వాసులకు రైలు సౌకర్యం మెరుగుపడనుంది. గతేడాది సాధారణంగా ఉన్న రైల్వే లైన్‌ను విద్యుత్తు లైన్‌గా మార్చారు. దీంతో ప్రస్తుతం బాసర మీదుగా సుమారు 50 రైళ్లు రాకపోకలు చేస్తున్నాయి. డబుల్ లైన్ పూర్తయితే మాత్రం సంఖ్య పెరగడంతో పాటు ప్రయాణం సులభతరం అవుతుంది. బాసర మీదుగా నడిచే రైలు ఆగడంతో బాసరకు వచ్చే భక్తుల సంఖ్య కూడా రెండింతలు పెరుగుతోందని అధికారులు భావిస్తున్నారు. మేడ్చల్ నుంచి ఒకే లైన్ ఉండటంతో క్రాసింగ్ ప్రయాణం కారణంగా ఆలస్యం అవుతుంది. ఇది పూర్తయితే దర్శనానికి వచ్చే భక్తులు తిరుగు ప్రయాణంలోనూ ఎలాంచి సమస్యలు ఎదుర్కొరు.
ఆదిలాబాద్ టూ ఆర్మూర్ రైల్వేలైన్ కోసం ఏళ్లుగా పోరాటం - ఇకనైన ఆ జిల్లా వాసుల కల నెరవేరేనా ?
అందుకోసం మరో బ్రిడ్జి నిర్మాణం : డబ్లింగ్ లైన్ ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.5వేల కోట్లు మంజూరు చేసింది. అవసరంమైన భూమి సేకరణకు సంబంధిత రెవెన్యూ అధికారులు ఇప్పటికే సర్వే పూర్తి చేసి కొన్నిచోట్లు భూ సేకరణ చేశారు. సర్వే పూర్తయిన చోట అభ్యంతరాలు ఉంటే సంబంధిత అధికారులు నోటిఫికేషన్ సైతం జారీ చేశారు. బాసర గోదావరి నదిపై ఇప్పటికే మూడు వంతెనలు ఉన్నాయి. డబ్లింగ్ కోసం మరో బ్రిడ్జ్ నిర్మించాల్సి ఉంది.
"రెండో లైన్ ఏర్పాటుకు బాసరలో భూసర్వేతో పాటు భూసేకరణ కూడా చేశాం. భూ సేకరణ అయిన ప్రదేశాల్లో రైతుల అభిప్రాయాలను స్వీకరించడానికి నోటిఫికేషన్ విడుదల చేశాం. సంబంధిత రైతులకు సమాచారం అందించి సమావేశం ఏర్పాటు చేసి వారి అభిప్రాయాలు తీసుకుంటాం." - కోమల్‌రెడ్డి, ఆర్డీఓ భైంసా
ఈ రైలుకు ఓనర్ సంపూరన్ సింగ్ - అతను ఒక రైతు! - ఈ విషయం మీకు తెలుసా?
ఆదిలాబాద్ టు పటాన్‌చెరు వద్దు, ఆర్మూర్ టు ఆదిలాబాదే ముద్దు - రైల్వే లైన్ కోసం జిల్లా ప్రజల పోరుబాట