ETV Bharat / state

విశాఖ స్టీల్​కు రూ.620 కోట్లు - కేంద్ర పన్నుల్లో పెరిగిన ఏపీ వాటా - budget funds to vizag steel plant - BUDGET FUNDS TO VIZAG STEEL PLANT

Central Budget Allocation Funds to Vizag Steel Plant : కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్​ ప్లాంట్​కు బడ్జెట్​లో రూ.620 కోట్లు కేటాయించింది. గతంతో పోలిస్తే రూ.63 కోట్లు కోత పెట్టింది. ఈ నేపథ్యంలోనే కేంద్ర పన్నుల్లో ఏపీకి రూ.50 వేల కోట్ల వాటా రానుంది. గత సంవత్సరం కంటే 12.92% అధికం.

visakha_steel_plant
visakha_steel_plant (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 24, 2024, 9:38 AM IST

Central Budget Allocation Funds to Vizag Steel Plant : సెంట్రల్​ గవర్నమెంట్​ విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌కు బడ్జెట్​ల్లో రూ.620 కోట్లు కేటాయించింది. గత బడ్జెట్‌తో పోలిస్తే 63 కోట్లు రూపాయలను కోతపెట్టింది.

  • ఏపీ పునర్విభజన చట్టం (state reorganisation act) ప్రకారం విశాఖలో ఏర్పాటు చేసిన ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోలియం ఎనర్జీకి రూ.168 కోట్లు కేటాయించింది. ఈసారి బడ్జెట్​లో రూ.78 కోట్లు పెంచింది.
  • విశాఖపట్నం పోర్టు ట్రస్ట్‌కు 150 కోట్లు రూపాయలను కేటాయించింది. గత సంవత్సరం బడ్జెట్​తో పోలిస్తే ఇది రూ.126 కోట్లు తక్కువ.
  • మౌలిక వసతుల కల్పనకు వివిధ విదేశీ ఆర్థిక సంస్థల ద్వారా ఏపీలోని పలు ప్రాజెక్టులకు నిధులు కేటాయించింది. ఏపీ గ్రామీణ రహదారుల ప్రాజెక్టుకు ఏఐఐబీ (AIIB) నుంచి 150 కోట్లు రూపాయలు, ఏపీ ఇరిగేషన్‌ అండ్‌ లైవ్లీహుడ్‌ ఇంప్రూవ్‌మెంట్‌ ప్రాజెక్టు (AP Irrigation and Livelihood Improvement Project) 2వ దశకు జపాన్‌ ప్రభుత్వం నుంచి 300 కోట్లు రూపాయలు, ఆంధ్రాస్‌ లెర్నింగ్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ ఆపరేషన్‌కు ఐబీఆర్‌డీ (IBRD) నుంచి రూ.300 కోట్లు, ఏపీ రహదారులు, వంతెనల పునర్నిర్మాణ ప్రాజెక్టుకు ఎన్‌డీబీ (NDB) నుంచి రూ.650 కోట్లు కేటాయించింది.
  • తెలంగాణ, ఏపీల్లోని గిరిజన విశ్వవిద్యాలయాలకు (Tribal Universities) ఈసారి ప్రత్యేకంగా కేటాయింపులు జరపలేదు. వాటి కేటాయింపులను సెంట్రల్‌ యూనివర్సిటీ గ్రాంట్లలో (Central University Grants) విలీనం చేశారు. ఇప్పటి నుంచి సెంట్రల్‌ యూనివర్సిటీల గ్రాంట్ల ద్వారానే గిరిజన వర్సిటీలకు నిధులు కేటాయిస్తుంది.

పోలవరం ప్రాజెక్ట్​పై తొలగిన నీలినీడలు - నిధులిచ్చి పూర్తి చేస్తామని కేంద్రం సృష్టం - Centre to Fully Finance Polavaram

కేంద్ర పన్నుల్లో (Central Tax) ఏపీకి ఈ ఆర్థిక సంవత్సరంలో (2024-25) రూ. 50,474.64 కోట్ల వాటా రానుంది. ఇది గత సంవత్సరం (2023-24) కంటే రూ. 5,776 కోట్లు (12.92%) అధికం. గత ఫిబ్రవరిలో పెట్టిన 49,364.61 కోట్ల రూపాయలతో పోలిస్తే ఇది రూ. 1,110 కోట్లు ఎక్కువ. 2024-25 ఆర్థిక సంవత్సరంలో అన్ని రాష్ట్రాలకు (All States) కలిపి కేంద్రం 12,47,211.28 కోట్ల రూపాయల వాటాను పంచనుంది. అందులో 4.047% ఏపీకి దక్కనుంది. ఆంధ్రప్రదేశ్​ రానున్న వాటాలో అత్యధికంగా ఆదాయపన్ను (Income Tax) నుంచి రూ. 17,455. 93 కోట్లు దక్కనుంది. ఆ తర్వాత కార్పొరేట్ ట్యాక్స్ (Corporate Tax) కింద రూ.15,156. 51 కోట్లు, సీజీఎస్టీ (CGST) రూ.15,079.39 కోట్లు, కస్టమ్స్ ట్యాక్స్​ రూ. 2,228.46 కోట్లు, ఎక్సైజ్ డ్యూటీ రూ. 469.73 కోట్లు, సర్వీస్ ట్యాక్స్ రూ. 1.66 కోట్లు, ఇతర పన్నులు, సుంకాల కింద రూ. 82.96 కోట్లు రానుంది.

కేంద్ర బడ్జెట్​లో రాష్ట్రానికి ప్రత్యేక పేరా - అమరావతికి రూ.15 వేల కోట్లు - AP Special Financial Assistance

కేంద్ర బడ్జెట్​లో చేయూత - మారిపోనున్న రాయలసీమ ముఖచిత్రం - Union Budget Funds to AP

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.