Central Agress to transfer of defense Lands : హైదరాబాద్ మెహిదీపట్నంలో స్కైవాక్ నిర్మాణానికి రక్షణశాఖ భూములు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. మెహిదీపట్నంలోని 3 వేల 380 చదరపు గజాలను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించేందుకు రక్షణశాఖ ఆమోదం తెలిపింది. బదిలీ చేసిన భూములకు బదులుగా రక్షణశాఖకు 15 కోట్ల 15 లక్షల విలువైన మౌలిక వసతులను రాష్ట్రప్రభుత్వం(Telangana Govt) కల్పించాల్సి ఉంటుంది. మరికొంత భూమికి పదేళ్ల పాటు లైసెన్స్ రుసుం చెల్లించాలి. నాలుగు వారాల్లో భూములను రక్షణ శాఖ అప్పగిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.
భారత్ మాల, ఆర్ఆర్ఆర్ ప్రాజెక్ట్‌లపై సీఎం రేవంత్‌కు కిషన్ రెడ్డి లేఖ
త్వరలోనే స్కైవాక్ నిర్మాణం చేపట్టనున్నట్లు హెచ్‌ఎండీఏ వెల్లడించింది. మెహిదీపట్నం రైతుబజార్ వద్ద రక్షణశాఖ భూముల బదిలీ కొలిక్కి రాక స్కైవాక్ నిర్మాణ ప్రతిపాదనలు చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్నాయి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(CM Revanth reddy) ఈనెల 5న దిల్లీ వెళ్లినప్పుడు రక్షణశాఖ మంత్రిని కలిసి చర్చించడం సహా కేంద్రం సూచించినట్లుగా మార్పులకు అంగీకరించి సవరించిన ప్రతిపాదనలను కేంద్రానికి పంపారు. మెహిదీపట్నం స్కైవే నిర్మాణం వేగంగా చేయాలని సంబంధిత అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.
Indian Navy Radar Center at Damagudem, Vikarabad : మరోవైపు వికారాబాద్ జిల్లా దామగూడెంలో భారత నావికా దళం రాడార్ కేంద్రం(Radar Center) ఏర్పాటులో మరో కీలక ముందడుగు పడింది. దామగూడంలోని 1174 హెక్టార్ల అటవీ భూములను నావిక దళానికి రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో తూర్పు నావిక దళం, అటవీ, ఇతర శాఖల అధికారులు ఒప్పందాలపై సంతకాలు చేశారు. నౌకలు, జలాంతర్గాములతో సమన్వయం చేసే వీఎల్ఎఫ్ కమ్యూనికేషన్ కేంద్రాన్ని దామగూడంలో ఏర్పాటు చేసేందుకు కొన్నేళ్లుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.
సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
తమిళనాడులోని తిరునెల్వేలిలో ఐఎన్ఎస్ కట్టబొమ్మన్ రాడార్ కేంద్రం 1990 నుంచి సేవలు అందిస్తుండగా, రెండో స్టేషన్ దామగూడం అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేయాలని 2010లో నిర్ణయించారు. కేంద్రం అటవీ పర్యావరణ శాఖ 2014లో నేవీ ప్రతిపాదనలను ఆమోదించింది. అటవీ భూములను అప్పగించేందుకు సుమారు 155 కోట్ల రూపాయలను నేవీ చెల్లించింది. కోర్టు వివాదాలు, ఇతర కారణాల వల్ల భూకేటాయింపు ప్రక్రియ పూర్తి కాలేదు.
ఎట్టకేలకు ఇవాళ భూబదిలీపై ఒప్పందం జరిగింది. నేవీ స్టేషన్‌తో పాటు పాఠశాలలు, ఆస్పత్రులు, బ్యాంకులు, మార్కెట్లతో కూడిన టౌన్‌షిప్ నిర్మిస్తారు. సుమారు 600 మంది నేవీ సిబ్బంది సహా దాదాపు 3వేల మంది టౌన్‌షిప్ లో నివసిస్తారు. ప్రతిపాదిత భూముల్లోని ఆలయానికి సాధారణ ప్రజలను అనుమతించేందుకు నావిక దళం అంగీకరించింది. ప్రాజెక్టులో భాగంగా రిజర్వ్ ఫారెస్టు చుట్టూ 27 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మించనున్నారు. దామగూడం నేవీ రాడార్ కేంద్రం 2027 వరకు పూర్తవుతుందని అంచనా.
మరో ఏక్నాథ్ షిండేగా రేవంత్ మారినా ఆశ్చర్యం లేదు : కేటీఆర్