ETV Bharat / state

తిరుపతిలో అలంకార ప్రాయంగా సీసీ కెమెరాలు- ముప్పులో భక్తుల భద్రత - తిరుపతిలో పనిచేయని సీసీ కెమెరాలు

CC Cameras Not Proper Working in Tirupati: తిరుపతిలో సీసీ కెమెరాలు అలంకార ప్రాయంగా మారాయి. నిఘావ్యవస్థ లేక అల్లరిమూకలు, దొంగలు రెచ్చిపోతున్నారు. దీంతో నిత్యం భక్తులతో రద్దీగా ఉండే ఆధ్యాత్మిక కేంద్రం తిరుపతిలో యాత్రికులు, ప్రజల భద్రత ప్రశ్నార్థకంగా మారింది.

CC_Cameras_Not_Proper_Working_in_Tirupati

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 22, 2024, 5:23 PM IST

తిరుపతిలో అలంకార ప్రాయంగా సీసీ కెమెరాలు

CC Cameras Not Proper Working in Tirupati: నిత్యం లక్షల మంది భక్తులతో రద్దీగా ఉండే ఆధ్యాత్మిక కేంద్రం తిరుపతిలో నిఘా వ్యవస్థ నిద్రాణ స్థితిలో ఉంది. నేరాలకు అడ్డుకట్ట వేసి నిందితులను పట్టించడంలో కీలక పాత్ర పోషించే సీసీ కెమెరాలు(CC cameras) అలంకారప్రాయంగా మారాయి. కొత్త కెమెరాలు ఏర్పాటు చేయకపోగా ఉన్నవాటిని కూడా అటకెక్కించారు. ఇదే అదనుగా అల్లరి మూకలు, దొంగలు(Thieves) రెచ్చిపోతున్నారు. ఆలయాలు(Temples), ప్రధాన రహదారులు(Main Roads), అతిథి గృహాల్లో(Guest Houses) భద్రతా చర్యలు లేక నగరవాసులు, యాత్రికుల భద్రత గాల్లో దీపంలా మారింది.

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బాలయ్య కుమార్తె

ఏడు కొండల వాడు కొలువైన తిరుమల ఆలయం(Tirumala Temple) ఓ వైపు, గోవిందరాజస్వామి(Govindarajaswamy), కపిలతీర్థం(Kapilatirtham), తిరుచానూరు పద్మావతి అమ్మవారి దేవస్థానం(Tiruchanur Padmavati Ammavari Devasthanam), శ్రీకాళహస్తి(Srikalahasti), కాణిపాకం(Kanipakam) వంటి ప్రసిద్ధ దేవాలయాలు మరోవైపు.

ఇవే కాదు ఏడు విశ్వవిద్యాలయాలు(Universities), ప్రపంచ ప్రఖ్యాత పరిశ్రమలు(Industries). ఇంత ప్రాముఖ్యత కలిగిన నగరంలో నిఘా వ్యవస్థ పటిష్ఠంగా ఉండాలి. కానీ పోలీసులు, అధికారుల నిర్లక్ష్యంతో శ్రీవారి భక్తులు, నగరవాసుల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. తిరుపతిని సురక్షిత నగరంగా తీర్చిదిద్దుతామన్న అధికారుల ప్రకటనలకు, వాస్తవాలకు పొంతన లేకుండా పోయింది. వందల సంఖ్యలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి భద్రతను పర్యవేక్షిస్తున్నామని చెబుతున్నా ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఉన్న నిఘా కెమెరాలు సైతం పని చేయట్లేదు.

శ్రీవారి సన్నిధిలో శ్రీలీల- కుటుంబసభ్యులతో హాజరైన అమ్మడు

తిరుపతి అర్బన్ పోలీస్ కమిషనరేట్(Tirupati Urban Police Commissionerate) 25 ఠాణాల పరిధిలో 852 కెమెరాలు ఏర్పాటు చేశారు. కానీ వాటిలో సగం కూడా పని చేయట్లేదు. 59 ప్రధాన కూడళ్లలో 324 సీసీ కెమెరాలున్నా ఫలితం లేదు. బస్టాండ్‌(Bus Stand) ప్రాంగణంలో ఉన్న 54 కెమెరాల్లో 40 పనిచేయడం లేదు. వీటితోపాటు హైవేల(Highways)పై పెట్రోలింగ్(Patrolling) కోసం ఏర్పాటు చేసిన 9 వాహనాలు(Vehicles) అక్కరకు రావడం లేదు. ఏదైనా ఘటన జరిగిన సందర్భాల్లో పోలీసులు(Police) హడావుడి చేస్తున్నారే తప్ప సాధారణ సమయాల్లో కనీసం భద్రతా చర్యలు తీసుకోవట్లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నిఘా వ్యవస్థ(Surveillance System)పై నిర్లక్ష్యం కళ్ల ముందే కనబడుతున్నా పోలీసు అధికారులు మాత్రం సీసీ కెమెరాలు బాగా పనిచేస్తున్నాయని సర్టిఫికేట్ ఇస్తున్నారు. అత్యాధునిక కెమెరాలతో సాంకేతిక పరిజ్ఞానం(Technical knowledge) వినియోగించి భద్రతా చర్యలు తీసుకుంటున్నామని గొప్పగా చెబుతున్నారు.

తిరుపతి టీడీఆర్ బాండ్లలో సగానికి పైగా అవినీతే - ఆ సొమ్మంతా కక్కిస్తాం: ఆనం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.