ETV Bharat / state

వరద ప్రాంతాల్లో మూగజీవుల ఆకలి కేకలు - పశుగ్రాసం సరఫరా చేయాలని రైతుల విజ్ఞప్తి - Flood Areas No Food in Cattles - FLOOD AREAS NO FOOD IN CATTLES

Flood Areas No Food in Cattles : కృష్ణా వరద ప్రభావిత ప్రాంతాల్లో మూగజీవాలు ఆకలితో అలమటిస్తున్నాయి. ఉమ్మడి గుంటూరు జిల్లాలో వరద దాటికి గడ్డివాములు కొట్టుకుపోవడంతో పొలాల్లో పశుగ్రాసం లేక అల్లాడుతున్నాయి. పొలాల్లోకి తీసుకెళ్లి మేపుదామన్నా బురద కారణంగా వెళ్లే పరిస్థితి లేదు. వరద తగ్గుముఖం పట్టిన తర్వాత ప్రభుత్వం పశువులకు మేత అందించేలా ప్రణాళికలు రూపొందించింది.

Flood Areas No Food in Cattles
Flood Areas No Food in Cattles (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 6, 2024, 10:16 AM IST

Cattles Condition Worse in Flood Affected Areas : కృష్ణా వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ప్రభుత్వ చొరవతో నాలుగు రోజులుగా బాధితులకు ఆహారం అందుతుంది. అయితే గేదెలు, గొర్రెలు, మేకలు వంటి మూగజీవాలు మాత్రం ఆకలితో అలమటిస్తున్నాయి. గడ్డివాములు కొట్టుకుపోవటం, పొలాల్లో వరద ప్రవహించడంతో పశుగ్రాసం లేక అల్లాడుతున్నాయి. ప్రభుత్వం గ్రామాలకు మేతను సరఫరా చేసినా ఇంకా పంపిణీ కాకపోవడంతో ఇబ్బందులు వస్తున్నాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో మూగజీవాల మౌనరోధనపై ప్రత్యేక కథనం.

వరద ప్రాంతాల్లో మూగజీవుల ఆకలి కేకలు - పశుగ్రాసం సరఫరా చేయాలని రైతుల విజ్ఞప్తి (ETV Bharat)

దాణా లేక అల్లాడుతున్న పశువులు : ప్రకృతి విపత్తుల వలన ప్రజలతో పాటు పశువులూ బాధితులుగా మారాయి. మనుషులైతే నోరు తెరిచి అడిగి కడుపు నింపుకుంటారు. కానీ మూగజీవాల పరిస్థితి అందుకు భిన్నం. వరద ముంచెత్తడంతో మేత లేక పశువులు ఆకలితో అల్లాడుతున్నాయి. ఉమ్మడి గుంటూరు జిల్లా లంక గ్రామాలు నీట మునగటంతో పశువుల్ని ఎత్తైన ప్రాంతాలకు తరలించారు. కొన్ని గ్రామాల్లో వరద ఉద్ధృతికి గేదెలు, ఆవులు, మేకలు, గొర్రెలు, కోళ్లు కొట్టుకుపోయాయి. సురక్షిత ప్రాంతాలకు తరలించిన పశువులు జీవించే ఉన్నా దాణా లేకపోవటంతో ఆకలితో నకనకలాడుతున్నాయి.

వరద నష్టంపై నేడు కేంద్రానికి నివేదిక పంపుతాం: సీఎం చంద్రబాబు - Chandrababu on Floods Damage in AP

పశువులకు మేత అందించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు : గ్రామాల్లో నిల్వ చేసుకున్న పశుగ్రాసం వరద ఉద్ధృతికి కొట్టుకుపోయింది. మరికొన్ని చోట్ల తడిచిపోయింది. పొలాల్లోకి తీసుకెళ్లి మేపుదామన్నా బురద కారణంగా వెళ్లే పరిస్థితి లేదు. దీంతో వరద తగ్గినా లంక గ్రామాల్లో ప్రజలు పశువుల మేత కోసం అల్లాడుతున్నారు. కొందరు తెలిసిన వారి నుంచి ఒకటీ రెండు కట్టలు తెచ్చి పశువులకు వేస్తున్నారు. ఇతర ప్రాంతాల్లోనూ వర్షాల కారణంగా గడ్డి తడిచిపోయింది. ఈ పరిస్థితిల్లో పశువుల మేతకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నట్లు యజమానులు వాపోతున్నారు. వరద తగ్గుముఖం పట్టిన తర్వాత ప్రభుత్వం తరపున పశువులకు మేత అందించేలా ప్రణాళికలు రూపొందించింది.

దాణా సరఫరాకు అధికారుల చర్యలు : సంపూర్ణ సమీకృత దాణా ప్యాకెట్లు ఇప్పుడిప్పుడే వరద ప్రభావిత ప్రాంతాలకు చేరుకుంటున్నాయి. వాటిని పశువుల యజమానులకు అందించేందుకు పశుసంవర్ధక శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఏయే గ్రామాల్లో ఎన్ని పశువులు ఉన్నాయో వివరాలు సేకరించారు. 25 కిలోల ప్యాకెట్ ఒక పశువుకు నాలుగైదు రోజుల పాటు ఆహారంగా సరిపోతుంది. గ్రామాల్లో సాధారణ పరిస్థితులు ఏర్పడిన తర్వాత మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి పశువులకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. కొన్ని ప్రైవేటు కంపెనీలు పశువుల దాణా కూడా తయారు చేస్తాయి. వాటిని తక్కువ పరిమాణంలో పశువులకు ఇచ్చినా ఎక్కువ బలాన్నిస్తాయి. అలాంటి దాణా కొనుగోలు చేసి సరఫరా చేసేందుకు కూడా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

కార్ల ఖర్చు 'తడిసి' మోపెడు - ఆందోళనలో వాహనదారులు - Cars Damage in Flood Disaster

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.