ETV Bharat / state

జీడి రైతుల గోడు పట్టదా జగన్- నాటి హామీలు ఏమయ్యాయి సారూ? - Cashew Farmers Problems in AP - CASHEW FARMERS PROBLEMS IN AP

Cashew Farmers Problems in AP: ఏరు దాటేవరకూ ఓడ మల్లన్న, ఏరు దాటాక బోడి మల్లన్న అన్నట్లుంది సీఎం జగన్‌ వ్యవహారం. అధికారం దక్కించుకోవడం కోసం విచ్చలవిడిగా హామీలిచ్చి సీఎం అయ్యాక అన్నీ గాలికొదిలేశారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని జీడి రైతుల దుస్థితే దీనికి నిదర్శనం. రైతులను ఆదుకునేందుకు కొత్త చర్యలేవీ తీసుకోకపోగా గత ప్రభుత్వాలు అందించిన పథకాలకు మంగళం పాడారు.

Cashew_Farmers_Problems_in_AP
Cashew_Farmers_Problems_in_AP
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 15, 2024, 9:49 AM IST

Updated : Apr 15, 2024, 12:06 PM IST

Cashew Farmers Problems in AP: ఉద్యాన పంటల రైతులు నష్టపోకుండా చూడాలని 2021 ఆగస్టులో ఉద్యాన పంటలు, వ్యవసాయంపై నిర్వహించిన సమీక్షలో సీఎం జగన్‌ ఆదేశాలిచ్చారు. దాని కోసం ప్రణాళికలు అమలు చేయాలని, పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని అధికారులకు సూచించారు. కానీ ఆ మాటలన్నీ నీటి మూటలుగానే మిగిలిపోయాయి. దీంతో పార్వతీపురం మన్యం జిల్లాలో జీడి పంటే జీవనాధారంగా బతుకుతున్న వేలాది మంది రైతులు ఐదేళ్లుగా తీవ్ర నష్టాలతో సతమతమవుతున్నారు.

మన్యం జిల్లాలో సుమారు 60 వేల ఎకరాల్లో జీడి తోటలు ఉన్నాయి. ఏటా 12 వేల క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చేది. 2019-20లో జీడి పంటకు టీ-దోమ సోకటంతో ఐటీడీఏ(I.T.D.A.) పరిధిలోని ఐదు మండలాల్లో సుమారు 15వేల ఎకరాల్లో రైతులు దిగుబడి కోల్పోయారు. 2020-21లో తెగుళ్ల కారణంగా తీవ్ర నష్టం వాటిల్లింది. 2021-22లో సుమారు 14వేల ఎకరాల్లో పంట పోయింది. 2022-23లో 40శాతం వరకు తోటలకు తెగుళ్లు సోకి దిగుబడి రాలేదు. ఈ ఏడాది దట్టమైన మంచు కారణంగా తొలిపూత చాలా వరకు రాలిపోయింది. రెండోదశ పూత వచ్చినా నిలబడక పిందెలు రాలిపోయాయి. అయిదేళ్లుగా జీడి రైతులు నష్టపోతున్నా ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు.

ప్రతిపక్షనేతపై రాళ్లేస్తే అలా, సీఎంపై అయితే ఇలా- భద్రతా వైఫల్యం గురించి ఎందుకు మాట్లాడరు? - YSRCP leaders ON YS JAGAN INCIDENT

గతంలో తెలుగుదేశం ప్రభుత్వం రాయితీపై పురుగు మందులు, స్ప్రేయర్లు ఇచ్చేది. దీంతో పూత నిలబడి, దిగుబడులు వచ్చేవి. ఐదేళ్ల నుంచి వైసీపీ సర్కార్‌ ఏమాత్రం సాయం అందించకపోవడంతో ఏటా తెగుళ్లు సోకి సగం పంట కూడా రావటం లేదు. మరోవైపు పంట కొనుగోళ్లపైనా ప్రభుత్వం దృష్టి సారించడం లేదు. దీంతో రైతులు దళారులకు తెగనమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొంది. ప్రభుత్వ నిర్లక్ష్యం, దళారుల ధనదాహానికి మధ్య నలిగిపోయి తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు వాపోతున్నారు.

జీడి పిక్కలను సేకరించి ప్రాసెసింగ్ చేసేందుకు గుమ్మలక్ష్మీపురం, కురుపాం, సీతంపేట, సాలూరు, మక్కువ ప్రాంతాల్లో ఐదేళ్ల క్రితం ప్రాసెసింగ్‌ కేంద్రాలను నిర్మించి విలువైన పరికరాలు ఏర్పాటు చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక వాటిని విస్మరించటంతో అన్నీ వృథాగా మారాయి. గుమ్మలక్ష్మీపురం మండలం ఎల్విన్ పేటలో అత్యాధునిక పరికరాలతో జీడి ప్రాసెసింగ్ కేంద్రం ఏర్పాటుకు భవనాలు పరిశీలించినా ముందడుగు పడలేదు. ఆదుకుంటామని అధికారంలోకి వచ్చి తమను నట్టేట ముంచిన సీఎం జగన్‌ను మరోసారి నమ్మే పరిస్థితి లేదని జీడి రైతులు స్పష్టం చేస్తున్నారు.

జీడీ రైతుల గోడు పట్టదా జగన్- నాటి హామీలు ఏమయ్యాయి సారూ?

జోరుగా కూటమి నేతల ప్రచారాలు- అధికార పార్టీ నుంచి తెలుగుదేశంలోకి భారీగా చేరికలు - Election Campaign Full Swing in AP

Last Updated : Apr 15, 2024, 12:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.