ETV Bharat / state

టీడీపీ సానుభూతిపరుల ఓట్ల తొలగింపునకు కుట్ర - 8మందిపై కేసు నమోదు - TDP Sympathisers votes delete

Case Registered on YSRCP Leaders due To Vote Deletion of TDP Sympathisers: టీడీపీ సానుభూతిపరులైన 42మంది ఓట్లను తొలిగించాలంటూ ఫాం 7 దరఖాస్తు చేసిన 8మంది వైఎస్సార్సీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. వైయస్సార్ జిల్లాలో టీడీపీ నేత కుటుంబంతో పాటు బంధువుల ఓట్ల తొలగింపునకు తప్పుడు సమాచారంతో ఫాం 7 దరఖాస్తు చేశారని, వీరిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయటంతో విచారణ చేపట్టంతో దర్యాప్తులో దోషులుగా తేలారు. దీంతో వీరిపై కేసు నమోదైంది.

Case_Registered_on_YSRCP_Leaders_due_To_Vote_Deletion_of_TDP_Sympathisers

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 27, 2024, 2:49 PM IST

Case Registered on YSRCP Leaders due To Vote Deletion of TDP Sympathisers: రాష్ట్రవ్యాప్తంగా దొంగ ఓట్లు (vote) నమోదు, టీడీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగింపు కోకొల్లలుగా వెలుగులోకి వస్తున్నాయి. విశాఖపట్నం, గుంటూరుతో పాటు పలు జిల్లాలో వందల సంఖ్యలో ఓట్ల అక్రమాలు జరుగుతున్నాయి. తాజాగా తిరుపతి ఉపఎన్నికల్లో జరిగిన అక్రమాల్లో కేంద్ర ఎన్నికల సంఘం కలెక్టర్, ఇద్దరు సీఐ, ఎసై, కానిస్టేబుల్​పై వేటు వేసింది. అధికార పార్టీ దాహానికి కింద స్థాయి అధికారులు (Officers) బలైపోతున్నారు.

అంతా వాళ్లే చేశారు ! - తప్పుడు ఫాం-7లు దరఖాస్తు చేసి అడ్డంగా దొరికిపోయిన వైసీపీ నాయకులు

Complaint About Vote Deletion to Election Commission: తాజాగా టీడీపీకి చెందిన 42 మంది ఓట్లను తొలగించాలంటూ ఫాం-7 (Form7) కింద తప్పుడు సమాచారంతో దరఖాస్తు (Apply) చేసిన 8 మంది వైఎస్సార్సీపీ నేతలపై (YSRCP Leaders) పోలీసులు కేసు నమోదు చేశారు. వైయస్సార్ జిల్లా ఎర్రగుంట్ల మండలం ఇల్లూరు గ్రామానికి చెందిన బంగారు మునిరెడ్డి కుటుంబంతో పాటు బంధువుల ఓట్లను తొలగించాలని స్థానిక సర్పంచ్ కృష్ణారెడ్డి, ఆయన కుమారుడు దస్తగిరిరెడ్డితో పాటు మరో ఆరుగురు కలిసి రెవెన్యూ అధికారులకు ఫాం-7 కింద దరఖాస్తులు అందజేశారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ నేత (tdp leader) బంగారు మునిరెడ్డి ఎన్నికల సంఘానికి (EC) ఫిర్యాదు చేశారు.

విశాఖ పశ్చిమలో ప్రతిపక్షాల ఓట్లు తొలగించేందుకు వైఎస్సార్సీపీ యత్నం!

బాధితుడు బంగారు మునిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం వ్యవసాయ కుటుంబానికి చెందిన మా అందరికీ ఒక్క ఓటే ఉందని, ఎక్కడికి వలసపోయే పరిస్థితి లేదని వివరించారు. అక్రమంగా (Illegal) మా ఓటుతో పాటు బంధువుల ఓట్లన్నీ తొలగించడానికి కుట్ర జరుగుతోందని మునిరెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన ఎన్నికల సంఘం జిల్లా యంత్రాగాన్ని విచారణకు ఆదేశించింది. తప్పుడు సమాచారంతోనే దరఖాస్తులు చేశారని, ప్రత్యర్థుల కుట్ల తొలగింపునకు కుట్రపూరితంగానే ప్రయత్నించారని అధికారుల విచారణలో తేలింది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు తహసీల్దార్ సౌజన్యలక్ష్మి, సర్పంచ్​ కృష్ణారెడ్డితో పాటు కుమారుడు దస్తగిరి రెడ్డి, పలువురు హస్తం ఉన్నట్లుగా కలమల్ల పోలీస్ స్టేషన్​లో సోమవారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఓట్ల వ్యవహారంలో ఏదైనా సమస్య ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయొద్దంటూ పోలీసులు మునిరెడ్డికి విన్నవించుకున్నారు. పోలీసులపై నమ్మకం లేకపోవటం వల్లే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశానని టీడీపీ నేత సమాధానం ఇచ్చారు.

ఉరవకొండలో చిత్రవిచిత్రంగా ఓటర్ల జాబితా - ఒకే ఇంటి నంబరుపై అనేక ఓట్లు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.