ETV Bharat / state

షాద్​నగర్ థర్డ్​ డిగ్రీ​ ఘటన - డీఐ సహా నలుగురు కానిస్టేబుళ్లపై మొదటి కేసు - Case Filed On Shadnagar Police

author img

By ETV Bharat Telangana Team

Published : Aug 16, 2024, 7:10 AM IST

Shadnagar Incident Latest Update : షాద్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో దళిత మహిళపై థర్డ్‌ డిగ్రీ ప్రయోగించిన వ్యవహారంలో పోలీసులపై మొదటి కేసు నమోదైంది. సస్పెన్షన్‌లో ఉన్న షాద్‌నగర్‌ డీఐ రామిరెడ్డి, నలుగురు కానిస్టేబుళ్లపై కేసు నమోదు చేశారు. ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం, ఉద్దేశపూర్వకంగా హింస, మారణాయుధాలతో దాడి తదితర సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. బాధితురాలు ఈ నెల 11 న ఫిర్యాదు చేయగా, అదే రోజు కేసు నమోదైంది.

Case Filed On Shadnagar Police
Shadnagar Incident Latest Update (ETV Bharat)

Case Registered Against Police in Shadnagar incident : రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో దళిత మహిళపై పోలీసులు థర్డ్‌ డిగ్రీ ప్రయోగించిన వ్యవహారంలో ఇన్‌స్పెక్టర్‌ సహా నలుగురు కానిస్టేబుళ్లపై కేసు నమోదైంది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులపై కేసులు నమోదయ్యాయి. అంతకముందు ఈ ఘటనలో డిటెక్టివ్‌ సీఐ రామిరెడ్డితో పాటు కానిస్టేబుళ్లను ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేశారు.

చోరీ కేసులో దళిత మహిళ సునీతను పీఎస్‌కు పిలిపించి తీవ్రంగా కొట్టినట్లు వచ్చి ఆరోపణల నేపథ్యంలో ఏసీపీ రంగస్వామి ఘటనపై విచారణ జరిపారు. అనంతరం నివేదికను సైబరాబాద్‌ సీపీకి సమర్పించగా, నివేదిక ఆధారంగా డీఐతో పాటు ఉన్న కానిస్టేబుళ్లను సస్పెండ్ చేస్తూ సీపీ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.

అసలు ఏం జరిగిందంటే? : జులై 30న షాద్‌నగర్‌ సీఐ రామిరెడ్డి నలుగురు పోలీసులు దళిత మహిళ, ఆమె భర్తను స్టేషన్‌కు తీసుకెళ్లారు. నాగేందర్‌ అనే వ్యక్తి ఇంట్లో చోరీకి సంబంధించి విచారించేందుకని తీసుకెళ్లిన పోలీసులు తొలుత ఆమె భర్తను కొట్టారు. ఆ తర్వాత దళిత మహిళ దుస్తులు తొలగించి భర్త నిక్కరు తొడిగి లాఠీతో దాడి చేశారు. ఇద్దరు పోలీసులు తొడభాగంపై కాళ్లతో తొక్కుతుండగా, ఛాతీభాగంలో రబ్బరుతో కొట్టారు. ఈ విషయం ఎవరికైనా చెబితే పెట్రోలు పోసి తగలబెడతామని పోలీసులు బెదిరించారు. రాత్రి 2 గంటల వరకూ స్పృహ తప్పేలా హింసించారు.

Shadnagar Incident Update : మహిళ కుమారుడిని సైతం పోలీసులు కొట్టారు. ఆ తర్వాత ఫిర్యాదుదారు నాగేందర్‌ కారులోనే బాధితులను ఇంటికి పంపించారంటూ బాధితులు ఈనెల 11న పోలీసులకు ఫిర్యాదు చేయగా, అదే రోజు కేసు నమోదైంది. ప్రాణహాని ఉందని, తగిన రక్షణ కల్పించాలని బాధితులు విజ్ఞప్తి చేశారు. దళిత మహిళపై దాడి వ్యవహారంపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌లో పిటిషన్‌ దాఖలైంది.

న్యాయవాది, సమతా సైనిక్‌ దళ్‌ న్యాయ సలహాదారు డాక్టర్‌ బీ కార్తీక్‌ నవయన్‌ ఎన్‌హెచ్‌ఆర్‌సీలో గురువారం ఫిర్యాదు చేశారు. సునీతపై దాడికి పాల్పడ్డ డీఐ రామిరెడ్డి నలుగురు కానిస్టేబుళ్లను సర్వీసు నుంచి తొలగించాలని, అరెస్టు చేసి శిక్షించాలని పిటిషన్‌లో కోరారు. కేసు సీబీఐకి అప్పగించి దర్యాప్తు నిష్పక్షపాతంగా జరిగేలా చూడాలని, ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం కింద బాధితురాలికి పరిహారంతో ఉపాధి కల్పించాలని విజ్ఞప్తి చేశారు. దాడి వ్యవహారంలో కేసు నమోదు కాగా, నిష్పక్షపాత విచారణ చేసి న్యాయం చేయాలని బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు.

దళిత మహిళపై దాడిని ఖండించిన సీఎం రేవంత్ రెడ్డి - సమగ్ర విచారణకు ఆదేశం - SHADNAGAR DALIT WOMAN TORTURE CASE

ఖాకీల కర్కశత్వం - దొంగతనం ఆరోపణలతో ఎస్సీ మహిళపై విచక్షణరహితంగా దాడి - Police Crushed Accused Woman

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.