ETV Bharat / state

గోదాములో పీడీఎస్ రైస్ మాయం! - మాజీ మంత్రి పేర్నినాని భార్యపై కేసు - CASE FILED ON PERNI NANI WIFE

రేషన్‌ బియ్యం అక్రమాలపై పేర్ని నాని సతీమణి జయసుధపై కేసు - బందరు పీఎస్‌లో పౌరసరఫరాలశాఖ అధికారి కోటిరెడ్డి ఫిర్యాదు

Case_Filed_on_Perni_Nani_Wife
Case Filed on Perni Nani Wife (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 11, 2024, 3:07 PM IST

Case Filed on YSRCP Leader Perni Nani Wife : రేషన్ బియ్యంలో అక్రమాలకు పాల్పడ్డారంటూ మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత పేర్ని నాని సతీమణి జయసుధపై పోలీసులు కేసు నమోదు చేశారు. జయసుధపై సివిల్ సప్లయ్ కార్పొరేషన్ కృష్ణా జిల్లా అసిస్టెంట్ మేనేజర్ కోటిరెడ్డి ఫిర్యాదు మేరకు బందరు తాలుకా పోలీసులు కేసు నమోదు చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మంత్రి పేర్ని నాని తన సతీమణి జయసుధ పేరిట బందరు మండలం పొట్లపాలెంలో గోడౌన్​ను నిర్మించారు. సివిల్ పౌరసరఫరాలశాఖకు బఫర్ గోడౌన్​గా అద్దెకు ఇచ్చారు. పది రోజుల క్రితం వార్షిక తనిఖీల్లో భాగంగా పౌరసరఫరాలశాఖ అధికారులు తనిఖీ చేయగా బియ్యం నిల్వల్లో తీవ్ర వ్యత్యాసాన్ని గుర్తించారు.

185 టన్నుల పీడీఎస్‌ బియ్యం మాయమైనట్టు గుర్తించామని ఫిర్యాదుదారుడు కోటిరెడ్డి తెలిపారు. పేర్ని నాని సతీమణి జయసుధతో పాటు గోడౌన్ మేనేజర్ మానస తేజపై కూడా ఫిర్యాదు చేశారు. వేబ్రిడ్జి సరిగ్గా పని చేయడం లేదని పేర్ని నాని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. వేబ్రిడ్జి సరిగ్గా పని చేయకపోవడం వల్ల షార్టేజీ వచ్చిందని పౌరసరఫరాలశాఖ అధికారులకు పేర్ని నాని సతీమణి జయసుధ లేఖ రాశారు. షార్టేజీకి సంబంధించిన ధాన్యం విలువ ప్రభుత్వానికి చెల్లిస్తామని జయసుధ లేఖలో పేర్కొన్నారు.

'పేర్ని నాని రెట్టింపు జరిమానా కట్టాలి- క్రిమినల్​ చర్యలు ఎదుర్కోవాలి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.