Car Washed Away in Flood Water : ఏపీలో భారీ వర్షాలతో వాగులు వంకలు పొంగుతున్నాయి. ఈ వర్షాలకు ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలో కారు వాగులో కొట్టుకుపోయింది. అశ్వారావుపేట నుంచి వేలేరుపాడు వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని కొట్టుకుపోయిన కారులో ఐదుగురు ఉన్నారని స్థానికులు తెలిపారు. కొద్దిదూరం వెళ్లాక కారు నుంచి బయటకు వచ్చి వాగులోని పొదల్లో ఆ ఐదుగురూ చిక్కుకున్నారు. వారిని రక్షించడానికి ఎన్డీఆర్‌ఎఫ్, గజ ఈతగాళ్లను రప్పించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు.
వాగు భారీగా పొంగుతుండటంతో సహాయ చర్యలకు ఆటంకం కలుగుతోంది. ఈ కారులో డ్రైవర్ రామారావుతో పాటు జ్యోతి(50), గడ్డం సాయిజ్యోతి(50) కారులో గడ్డం సాయికుమారి(30), గడ్డం కుందన కుమార్(11) గడ్డం జగదీష్ కుమార్(8) ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో వాగులోని పొదల నుంచి సురక్షితంగా ఓ బాలుడు బయటకు వచ్చాడు. మిగతా నలుగురినీ రక్షించేందుకు సహాయ చర్యలు ముమ్మరం చేశారు.
చంద్రబాబు ఆదేశాలు : వేలేరుపాడు మండలంలో వాగులో కారు కొట్టుకుపోయిన ఉదంతంపై సీఎంఓ ఆరా తీసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలపై సహాయక చర్యలపై జిల్లా కలెక్టరు, ఇతర అధికారుల చర్యలు తీసుకున్నారు. హెలికాప్టరు, ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలను పంపించే విషయమై నిశితంగా పర్యవేక్షించారు.
ప్రాణాలతో బయటపడ్డ ఐదుగురు : మొదట వాగులో చిక్కుకున్న ఐదుగురిలో పొదల నుంచి సురక్షితంగా ఓ బాలుడు బయటకు వచ్చాడు. మిగతా నలుగురినీ రక్షించేందుకు సహాయ చర్యలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో పొదల్లో చిక్కుకున్న మిగిలిన నలుగురు సైతం సురక్షితంగా బయట పడ్డారు. బాధితులను సురక్షితంగా గ్రామస్థులు, పోలీసులు ఒడ్డుకు తీసుకొచ్చారు.