ETV Bharat / state

'గ్రూప్-2 మెయిన్స్‌ వాయిదా వేయండి' - అభ్యర్థుల విజ్ఞప్తికి ఏపీపీఎస్సీ పరిశీలన - CANDIDATES ASKING POSTPONE GROUP 2

గ్రూప్‌-2 పరీక్ష వాయిదా వేయాలని అభ్యర్థుల విజ్ఞప్తి - మరో 30 రోజులు గడువు పెంపు కోరుతూ ఏపీపీఎస్సీకి వినతి

candidates_asking_appsc_to_postpone_group2_mains_examination
candidates_asking_appsc_to_postpone_group2_mains_examination (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 6, 2024, 5:35 PM IST

Candidates Asking APPSC to Postpone Group-II Mains Examination : వచ్చే ఏడాది జనవరి 5న నిర్వహించబోయే గ్రూప్-2 మెయిన్స్ పరీక్షను వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు ఏపీపీఎస్సీని కోరుతున్నారు. సిలబస్ మార్పులు, పూర్తిస్థాయిలో సన్నద్ధత కోసం మరికొంత సమయం పెంచాలని విజ్ఞప్తి చేస్తున్నారు. నిరుద్యోగుల అభ్యర్థన, ఆందోళన దృష్ట్యా సానుకూల నిర్ణయం తీసుకోవాలని పలువురు ప్రజాప్రతినిధులు సైతం ఏపీపీఎస్సీ కి విజ్ఞప్తి చేశారు. గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష గడువు పెంపుపై సానుకూలంగా స్పందించిన ఏపీపీఎస్సీ, డీఎస్సీ తేదీల ప్రకటనలను బట్టి గ్రూప్-2 ప్రధాన పరీక్ష తేదీలపై నిర్ణయం తీసుకోనుంది.

ప్రభుత్వ కొలువు సాధించాలన్న లక్షల మంది నిరుద్యోగుల జీవిత కలను గత వైఎస్సార్సీపీ సర్కారు నీరుగార్చింది. ఖాళీ పోస్టులన్నీ భర్తీ చేస్తామని చెప్పి గద్దెనెక్కిన జగన్ కీలకమైన గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాల నియామకాలను పక్కన పెట్టారు. లక్షల మంది నిరుద్యోగులు రోడ్డెక్కి ఆందోళనలకు దిగడంతో గతేడాది డిసెంబర్ 7న హడావుడిగా 897 పోస్టుల భర్తీకి మాత్రమే గ్రూప్-2 నోటిఫికేషన్ జారీ చేసింది. సిలబస్‌లో మార్పులు చేసి అభ్యర్థులు పరీక్షకు సన్నద్ధమయ్యే సమయం ఇవ్వకుండా ఆగమేఘాలపై నియామక ప్రక్రియ చేపట్టింది. గ్రూప్‌-2కు 4లక్షల 83వేల 535 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షకు 4 లక్షల 4 వేల 37మంది హాజరయ్యారు. వారిలో 92వేల 250మంది మాత్రమే మెయిన్స్‌కు అర్హత సాధించారు.

గ్రూప్‌-2 మెయిన్స్ వాయిదా వేయాలంటూ విజ్ఞప్తులు - ఏపీపీఎస్సీ నిర్ణయంపై సందిగ్ధం - Appeals For Postpone Group 2 Mains

'ఈ ఏడాది జూలై 28న మెయిన్స్‌ పరీక్షలు జరగాల్సి ఉండగా అభ్యర్థుల విజ్ఞప్తితో కూటమి ప్రభుత్వం వాయిదా వేసింది. గౌతమ్‌ సవాంగ్‌ రాజీనామాతో ఏపీపీఎస్సీ ఛైర్‌ పర్సన్‌గా ఇటీవల రిటైర్డ్ ఐపీఎస్​ అధికారిణి ఎ.ఆర్.అనురాధ బాధ్యతలు చేపట్టారు. పెండింగ్‌లో ఉన్న నియామకాల భర్తీకి కార్యాచరణ రూపొందించి వచ్చే ఏడాది జనవరి 5న గ్రూప్‌-2 మెయిన్స్‌ నిర్వహించాలని నిర్ణయించారు. సన్నద్ధతకు 60 రోజుల వ్యవధి మాత్రమే ఉండటంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. మరోసారి వాయిదా వేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం.' - గ్రూప్-2 మెయిన్స్ అభ్యర్థులు

అభ్యర్థుల వినతి మేరకు గ్రూప్-2 ప్రధాన పరీక్షను వాయిదా వేయాలని ప్రజా ప్రతినిధులు సైతం ఏపీపీఎస్సీ ఛైర్ పర్సన్ అనురాధను కలసి వేర్వేరుగా విజ్ఞాపన పత్రాలిచ్చారు. మరో 30 రోజులు గడువు పెంచి ఫిబ్రవరిలో పరీక్ష నిర్వహించాలని కోరారు.

ముగిసిన గ్రూప్-2 ప్రిలిమినరీ పరీక్ష- ఫేక్‌ అడ్మిట్‌ కార్డుతో వచ్చిన వ్యక్తి అరెస్ట్

విద్యార్థులు, ప్రజాప్రతినిధుల నుంచి పెద్దఎత్తున విజ్ఞప్తులు వస్తున్నందున పరీక్ష తేదీ మార్చే అంశంపై ఏపీపీఎస్సీ . సానుకూల ధోరణితో సమాలోచనలు చేస్తున్నట్లు తెలిసింది. నిరుద్యోగులకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రూప్-2 ప్రధాన పరీక్షను మరోసారి వాయిదా వేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని ఏపీపీఎస్సీ వర్గాలు చెబుతున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.