ETV Bharat / state

కంబోడియా జాబ్​ స్కాం : కీలక నిందితుడిని పట్టుకున్న సైబర్​ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు - Cambodia Jobs Scam news - CAMBODIA JOBS SCAM NEWS

Cambodia Jobs Scam : నిరుద్యోగ యువతనే లక్ష్యంగా కంబోడియాలో జాబ్​ స్కాం పేరుతో భారీ దందానే నడుస్తోంది. ఈ దందాలో భారత్​ యువతనే వారు ఎక్కువగా మోసం చేస్తున్నారు. ఏజెంట్లు ద్వారా యువతను ఉద్యోగం పేరుతో అక్కడకు పంపించి చిత్రహింసలకు గురవుతున్నారు. ఈ క్రమంలో అక్కడ పంపించే కీలక నిందితుడిని సైబర్​ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు అరెస్టు చేశారు.

Cambodia Jobs Scam Latest News
Cambodia Jobs Scam (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jul 13, 2024, 10:32 PM IST

Cambodia Jobs Scam Latest News : భారత్​కు చెందిన నిరుద్యోగ యువతను ఉద్యోగం పేరుతో కాంబోడియా దేశం పంపించి మోసాలు చేస్తున్న కీలక నిందితుడిని సైబర్​ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు అరెస్టు చేశారు. దిల్లీలో షాదాబ్​ అలాంను అరెస్టు చేసిన పోలీసులు నగరానికి తీసుకొచ్చి నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు 14 రోజుల జ్యుడీషియల్​ రిమాండ్​ విధించగా చంచల్​గూడ జైలుకు తరలించారు. సిరిసిల్లకు చెందిన బాధితుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేశారు.

గతంలో ఏజెంట్​ సాయి ప్రసాద్​, దిల్లీకి చెందిన మరో ఏజెంట్ అన్సారినీ సిరిసిల్ల పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో దుబాయిలో ఉంటూ చైనీయులకు సహకరిస్తున్న షాదాబ్​ను దిల్లీకి వచ్చినట్లు తెలుసుకున్న పోలీసులు అరెస్టు చేశారు. దుబాయిలో ఉంటున్న షాదాబ్​ కంబోడియా దేశంలో చైనీయుల కోసం పని చేస్తున్న దీపు అనే వ్యక్తికి ఏజెంట్​గా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. చాలా మంది యువతను ఇలానే మోసం చేసి కాంబోడియా పంపినట్లు తెలుసుకున్నారు. కాగా మే 16న సిరిసిల్ల పీఎస్​లో నమోదైన కేసును సైబర్​ సెక్యూరిటీ బ్యూరోకి బదిలీ అయింది.

Cambodia Job Frauds In Telangana : రెండు రోజుల క్రితం జగిత్యాల జిల్లా వెనుగుమట్లకు చెందిన యువకుడు ఉపాధి నిమిత్తం కోరుట్లకు చెందిన వంశీకృష్ణ అనే ఏజెంట్​ను సంప్రదించగా ఆయన అజర్​బైజాన్​లో కూలి పని ఇప్పిస్తానని చెప్పాడు. 2022 సెప్టెంబరులో బాధితుడు నుంచి వంశీకృష్ణ రూ.15 వేలు అడ్వాన్స్​ తీసుకున్నాడు. ఆ ఏడాది డిసెంబరులో రూ.2 లక్షలు చెల్లించిన పని కాకపోవడంతో డబ్బులు తిరిగి ఇవ్వాలని బాధితుడు ఒత్తిడి తీసుకువచ్చాడు.

ఆ క్రమంలో వంశీకృష్ణ బాధితుడికి కంబోడియాలో డేటా ఎంట్రీ ఆపరేటర్​గా ఉద్యోగం ఉందని గతేడాది ఆగస్టులో ఏజెంట్​ చెప్పాడు. దీంతో బాధితుడికి జెన్​ ఈ పేరు మీద ఆఫర్​ లెటర్​ వచ్చింది. అదే ఏడాది నవంబరు 7న బాధితుడు హైదరాబాద్​ నుంచి మలేషియా మీదుగా కంబోడియా చేరుకున్నాడు. అక్కడ తన పాస్​పోర్టును తీసుకుని ఓ చైనీయుడు ఇంటర్వ్యూ చేశాడు. పది నుంచి పన్నెండు రోజుల తర్వాత పదుల సంఖ్యలో కాల్​ సెంటర్లు నడుస్తున్న భారీ ప్రాంగణానికి తీసుకెళ్లినట్లు బాధితుడు పోలీసులతో జరిగింది చెప్పాడు.

ఆ తర్వాత అక్కడ ప్రతి నెల 600 అమెరికా డాలర్లు ఇస్తున్నారు. అవి సరిపోక అక్కడ హింసిస్తుండటంతో వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో వారిని అడగగా 3000 అమెరికన్​ డాలర్లు ఇవ్వాలని ఇస్తే వదిలేస్తామని చెప్పారు. దీంతో ఆ డబ్బును కట్టి భారత్​కు వచ్చి పోలీసులకు జరిగింది చెప్పాడు.

కంబోడియాలో ఉద్యోగం ఇప్పిస్తామంటున్నారా? - ఐతే జాగ్రత్తగా ఉండాల్సిందే బ్రదర్​!! - Cambodia Job Frauds In Telangana

విద్యార్థులకు ఉచిత విద్య, ఆహారం పేరిట రూ.300 కోట్ల స్కాం - ఎక్కడో తెలుసా? - ed raids on om company fraud

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.