ETV Bharat / state

రాష్ట్రంలో ఏ జిల్లాలోనూ ప్రణాళికా సంఘాలు ఏర్పాటు కాలేదు : కాగ్​ - CAG

CAG Report on 74th Amendment Act Audit : రాష్ట్రంలో ఏ జిల్లాలోనూ ప్రణాళికా సంఘాలు ఏర్పాటు కాలేదని, అందుకు తగిన ముసాయిదాను అభివృద్ధి చేయలేదని కాగ్​ తన నివేదికలో తెలిపింది. రాష్ట్రంలోని పట్టణ ప్రాంత స్థానిక సంస్థలపై ఆడిట్​ చేసి నివేదికను సమర్పించింది.

CAG Report
CAG Report on 74th Amendment Act Audit
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 15, 2024, 5:14 PM IST

CAG Report on 74th Amendment Act Audit : రాష్ట్రంలోని ఏ జిల్లాలోనూ ప్రణాళికా సంఘాలు ఏర్పాటు కాలేదని స్థానిక అవసరాలు, ఉమ్మడి ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకునేందుకు ఏకీకృత ముసాయిదా అభివృద్ధి ప్రణాళికలను తయారు చేయలేదని కంప్ట్రోలర్​ అండ్​ ఆడిటర్​ జనరల్​(కాగ్​) తన నివేదికలో పేర్కొంది. రాష్ట్రంలో 74వ రాజ్యాంగ సవరణ చట్టంపై 2021 మార్చి నాటికి ఆడిట్(CAG Audit)​ సమీక్ష చేసి నివేదిక సమర్పించింది. రాజ్యాంగ సవరణ ప్రకారం పట్టణ ప్రాంత స్థానిక సంస్థలకు విధుల బదిలీని ఉదహరించినప్పటికీ చాలా వరకు విధులను రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖలు, అనుబంధ సంస్థల ద్వారానే నిర్వహిస్తోందని పేర్కొంది.

అధికారాలను సర్కార్​ వద్దే అంటిపెట్టుకున్నందున పట్టణ స్థానిక సంస్థలకు పొరుగు సేవల సిబ్బంది తప్ప, రెగ్యులర్​ సిబ్బంది ఆవశ్యకత అంచనా, నియామకానికి ఎలాంటి అధికారాలు లేవని కాగ్​(CAG) తెలిపింది. రాష్ట్రంలో మంజూరైన 8752 పోస్టులకు గానూ అందులో 45 శాతం పోస్టులు 3,900 ఖాళీగా ఉన్నాయని ఫలితంగా సేవలు అందించేందుకు పొరుగు సేవల సిబ్బందిపైనే ఎక్కువగా ఆధారపడాల్సి వచ్చిందని కాగ్​ పేర్కొంది.

కాళేశ్వరం వ్యయం భారీగా పెరిగినా - ప్రయోజనాల్లో మాత్రం అదనపు పెరుగుదల లేదు : కాగ్ నివేదిక

CAG Report Urban Local Bodies : వరంగల్​ మినహా ఎక్కడా నీటి మీటర్లు అమర్చలేదని, అక్కడ కూడా ఒక శాతం మాత్రమే పని చేశారని కాగ్​ తెలిపింది. నీటి ఆడిటింగ్​ లేదని, ఘన వ్యర్థాల నిర్వహణ సరిగ్గా లేదని పేర్కొంది. రాష్ట్ర ఆర్థిక సంఘం(Telangana Finance Commission) గ్రాంట్లకు ప్రతిగా 2017-18 నుంచి 2019-20 మధ్య కాలంలో నిధుల విడుదల 50 శాతం నుంచి 85 శాతం వరకు తగ్గడం పట్టణ ప్రాంత ఆర్థిక స్థితిని ప్రభావితం చేసిందని కాగ్​ వ్యాఖ్యానించింది. 2015-16 నుంచి 2019-20 మధ్యకాలంలో 14వ ఆర్థిక సంఘం గ్రాంట్లు కూడా రూ.647 కోట్లు తగ్గినట్లు పేర్కొంది. 2019-20 నుంచి 2020-21 మధ్యకాలంలో ఆస్తుల బదిలీపై వసూలు చేసిన స్టాంపు డ్యూటీపై సర్​ఛార్జీ మొత్తం రూ.1822 కోట్లను స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖ పట్టణ ప్రాంత స్థానిక సంస్థలకు బదిలీ చేయలేదని తెలిపింది.

ప్రతి పురపాలక సేవపై ధరను అంచనా వేయాలి : పట్టణాల్లో ఆస్తిపన్ను, నీటి పన్నుల బకాయిలు పేరుకుపోతున్నాయని వాస్తవ రాబడి కంటే చేస్తున్న ఖర్చు అధికంగా ఉందని కాగ్​ వివరించింది. సేవలు సమర్థంగా అందించేందుకు వీలుగా ఆదాయ వనరులు, అవసరాలను వాస్తవికంగా అంచనాకు వీలుగా ప్రతి పురపాలక సేవపై ధరను అంచనా వేయాల్సిన అవసరం ఉందని కాగ్​ తన నివేదికలో సూచించింది.

అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లోనూ పగుళ్లు.. కాగ్‌ నివేదికలో సంచలన విషయాలు

ఆదాయం పెరిగినా రెవెన్యూ మిగులు సాధించడంలో రాష్ట్రం విఫలం - కాగ్​ రిపోర్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.