Cabinet Meeting on Implementation of Two Guarantees : సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం(Cabinet Meeting) ప్రారంభమైంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తేదీల ఖరారుపై మంత్రివర్గంలో చర్చిస్తున్నారు. ఇప్పటికే వివిధ శాఖలు సమర్పించిన ప్రతిపాదనలపై సీఎం, ఉపముఖ్యమంత్రి, మంత్రులు సమీక్షలు నిర్వహించారు. ఐతే ప్రస్తుతం పూర్తిస్థాయికాకుండా మద్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టాలని సర్కార్ నిర్ణయించింది.
'విభజన చట్టం ప్రకారమే ప్రాజెక్టులు అప్పగించాం - బీఆర్ఎస్ చేసిన తప్పులను మాపై వేయాలని చూస్తున్నారు'
కేంద్రప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాక కేటాయింపులు అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాలని భావిస్తోంది. శాసనసభ బడ్జెట్ సమావేశాల తేదీలు, గవర్నర్ ప్రసంగాన్ని క్యాబినెట్ భేటీలో ఖరారుచేయనున్నారు. ఈనెల 8 నుంచి అసెంబ్లీసమావేశాలు జరపాలని భావిస్తున్నారు. ఈనెల 8న గవర్నర్ తమిళసై ప్రసంగంతో ఉభయసభలు ప్రారంభంకానున్నాయి.
మరుసటి రోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంపై చర్చ జరగనుంది. ఈనెల 10న ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈనెల 12 నుంచి ఐదురోజులపాటు బడ్జెట్ పద్దులపై చర్చ జరిగే అవకాశం ఉంది.రెండు కొత్తపథకాలపై మంత్రివర్గం చర్చిస్తోంది. 500కే గ్యాస్‌సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత్ విద్యుత్ పథకాలను త్వరలోనే అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు.
ఆ రెండుపథకాలకు నేడు కేబినెట్ ఆమోదించే అవకాశం ఉంది. గ్రూప్-1 పరీక్షపైనా మంత్రివర్గం చర్చిస్తోంది. గ్రూప్-1 లో సుమారు మరో 160 అదనపు పోస్టులు జోడించడం సహా. కోర్టు వివాదాలను అధిగమించేందుకు నియామక పరీక్షల్లో సమాంతర రిజర్వేషన్ విధానం అమలు చేసేందుకు మంత్రివర్గం చర్చలు జరిపారు. గ్యారెంటీల అమలు, కొత్త రేషన్ కార్డులు, మేడిగడ్డబ్యారేజీపై విచారణ, సాగునీటి ప్రాజెక్టులు తదితర కీలక అంశాలపై కేబినెట్‌లో చర్చించారు.
అంతకు ముందు సీఎం రేవంత్‌రెడ్డి కృష్ణా నదీ జలాల వివాదంపై మీడియా సమావేశం నిర్వహించారు. ఉమ్మడి పాలకుల కంటే కేసీఆర్ పాలనలో నదీ జలాల విషయంలో రాష్ట్రానికి ఎక్కువ అన్యాయం జరిగిందని దుయ్యబట్టారు. ప్రజాధనాన్ని పెద్దఎత్తున దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. త్వరలో జరగబోయే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో నీటిపారుదల రంగంపై శ్వేత పత్రం విడుదల చేస్తామని పేర్కొన్నారు.
నిజాం షుగర్స్ పునరుద్ధరణపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష - హాజరైన మంత్రులు శ్రీధర్ బాబు, దామోదర