Buttermilk to RTC Employees : గ్రేటర్ పరిధిలో మొత్తం 2,814 బస్సులను తిప్పుతున్నారు. మహాలక్ష్మి- మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులోకి వచ్చిన తర్వాత గ్రేటర్‌లో ప్రతిరోజూ 19 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. నిత్యం గ్రేటర్ పరిధిలో 7.55 లక్షల కిలోమీటర్లు ఆర్టీసీ బస్సులు ప్రయాణిస్తున్నాయి. అసలే ఎండలు మండిపోతున్నాయి. దీనికితోడు ట్రాఫిక్ ఇబ్బందులతో ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు సతమతమవుతున్నారు.
కార్గో లాజిస్టిక్స్‌పై దృష్టి సారించిన టీఎస్‌ఆర్టీసీ - అత్యాధునిక సేవలు విస్తరించేలా ప్రణాళికలు
ఒకపక్క ఎండ వేడిమితో ఆర్టీసీ పైకప్పు వేడెక్కుతుంటే, మరోపక్క ఇంజిన్ వేడితో డ్రైవర్లు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని గమనించిన టీఎస్‌ఆర్టీసీ(TSRTC) యాజమాన్యం వేసవికాలం ప్రారంభం అయినప్పటి నుంచి పూర్తయ్యే వరకు ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు, హెల్పర్లు, మెకానిక్‌లకు ప్రతి డిపోలో మజ్జిగ పంపిణీ చేయాలని నిర్ణయించింది. ప్రతిరోజు ఉదయమే మజ్జిగ పంపిణీ ప్రారంభం అవుతుందని, సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుందని ఆర్టీసీ అధికారులు పేర్కొంటున్నారు.
Buttermilk for TSRTC Employees : ఎండాకాలంలో ఉష్ణోగ్రతలు భారీగా పెరిగిపోతున్నాయి. ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు. మహాలక్ష్మి పథకం అందుబాటులోకి వచ్చిన తర్వాత భారీ సంఖ్యలో మహిళలు ప్రయాణిస్తున్నారు. అందుకే ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు అన్ని డిపోల్లో మంచినీళ్లు అందుబాటులో ఉంచుతున్నారు. మంచినీళ్లతో పాటు మజ్జిగను కూడా ఉచితంగా అందించాలని ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. దీంతో సిబ్బందికి కాస్త ఉపశమనం కలుగుతుందని యాజమాన్యం భావిస్తోంది.
గ్రేటర్ పరిధిలో సుమారు ఎనిమిదిన్నర గంటలకు పైగా ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు విధులు నిర్వహిస్తున్నారు. వారికి ఉపశమనం కల్గించేందుకు మజ్జిగను పంపిణీ చేస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. అది తమ సిబ్బందికి ఉత్సాహాన్ని కలిగిస్తుందని అంచనా వేస్తున్నారు. ఆర్టీసీ సిబ్బందికి అందరికి డిపోల వారీగా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. బీపీ, షుగర్ వంటి వాటిని చెక్ చేస్తున్నారు. ఇతరత్ర వైద్య సమస్యలు ఉన్నవారిని ఆసుపత్రికి పంపించి చికిత్స చేయిస్తున్నారు.
దీంతో వ్యాధుల బారిన పడిన వారిని ముందే గుర్తిస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. వివిధ వైద్య సమస్యలు ఉన్న వారిని విభాగాలుగా విభజించి వారికి మందులు అందిస్తున్నారు. అంతేకాదు డిపోల్లో కూడా వైద్య సిబ్బంది సూచనలు సలహాలు ఇస్తున్నారు. సమయానికి మందులు వేసుకోవాలని సూచిస్తున్నారు. వేసవికాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను గేట్ మీటింగ్ సమయంలో వివరిస్తున్నారు. వడగాలుల నుంచి సంరక్షించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. తద్వారా తమ సిబ్బందికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నామని ఆర్టీసీ అధికారులు వివరిస్తున్నారు.
టీఎస్‌ఆర్టీసీకి జాతీయస్థాయి అవార్డులు - ఈనెల 15న దిల్లీలో ప్రదానం