ETV Bharat / state

బుడమేరు ప్రళయం ఎఫెక్ట్ - వరద గుప్పిట్లో అల్లాడుతున్న జనం - Vijayawada Floods - VIJAYAWADA FLOODS

Vijayawada Floods 2024 : బుడమేరు విజయవాడలో ప్రళయం సృష్టించింది. చాలా ప్రాంతాలు ఇంకా వరద గుప్పిట్లోనే అల్లాడుతున్నాయి. మరోవైపు పలు ప్రాంతాలు సోమవారం కాస్త ఊపిరి పీల్చుకున్నాయి. నీటిమట్టం కొద్దిగా తగ్గడంతో వరద బాధితులు పెద్ద సంఖ్యలో బయటకొచ్చారు. కొందరు ఇతర ప్రాంతాల్లోని బంధువుల ఇళ్లకు వెళ్తుండగా మరికొందరు పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు. మిగిలిన వారు తాగునీరు, పాలు, ఆహారం తీసుకుని తిరిగి ఇళ్లకు వెళ్లిపోతున్నారు.

Vijayawada Floods  2024
Vijayawada Floods 2024 (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 3, 2024, 7:02 AM IST

Budameru Victims Problems : బుడమేరు ఉప్పొంగడంతో విజయవాడలోని పలు ప్రాంతాలు అతలాకుతలం అయ్యాయి. వాంబే కాలనీ వాసులు బయటకు వచ్చే మార్గం లేక రైలు పట్టాల మీదుగా నడుచుకుంటూ అవతలి వైపు ఉన్న అయోధ్యనగర్‌ కట్టకు చేరుకుంటున్నారు. చాలా మంది రబ్బరు ట్యూబ్‌లు తగిలించుకుని నీటిలో నడుచుకుంటూ వస్తున్నారు. దేవీనగర్‌ మెయిన్‌ రోడ్డుపై ఎన్నడూ లేని స్థాయిలో నడుము లోతు నీరు చేరింది. దీంతో పడవల ద్వారా రాకపోకలు సాగించాల్సి వచ్చింది.

రామకృష్ణాపురంలో రైలు పట్టాలు సమీపంలోని ప్రాంతమంతా నీట మునిగింది. బాధితులు ఇళ్ల నుంచి బయటకొచ్చి కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలు తీసుకెళ్తున్నారు. కండ్రిగ, జేఎన్​ఎన్​యూఆర్ఎం కాలనీ, వాంబేకాలనీ, రాజీవ్​నగర్‌ సోమవారం రాత్రికి కూడా ఏడు అడుగుల మేర నీటిలోనే ఉన్నాయి. రామవరప్పాడు రింగ్​రోడ్డు సమీపంలోని ఓ డెయిరీ ఫాం నిర్వహిస్తున్న తండ్రీకుమారులు వెంకటేశ్వరరావు, సందీప్‌ వరద ధాటికి కొట్టుకుపోయి మరణించారు.

Vijayawada Floods Updates : న్యూ రాజరాజేశ్వరి పేట పూర్తిగా వరద గుప్పిట్లోనే ఉంది. అన్ని ప్రాంతాల కంటే ఇక్కడ తీవ్రత అధికంగా ఉంది. అక్కడకు పడవుల్లో వెళ్లేందుకు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సైతం సాహసం చేయడం లేదు. దీంతో ఆ ప్రాంతాలోని ప్రజలు ఆహార, పానీయాలు అందడం లేదు. మిల్క్‌ ఫ్యాక్టరీ పూర్తిగా నీటిలోనే నానుతుంది. దీనికే సుమారు వంద కోట్ల నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు. చిట్టినగర్‌ నుంచి వైఎస్సార్ కాలనీ వరకు నీళ్లలోనే ఉంది.

ఆహారం కోసం ఎగబడిన ప్రజలు : రెండు రోజులుగా వరద ముంచెత్తడంతో జనం బయటకు రాలేక దాహం, ఆకలితో తీవ్ర అవస్థలు పడ్డారు. ప్రభుత్వం వరద బాధితులకు ఉప్మా, కిచిడీ, పాలు, రొట్టెలు, అన్నం, పెరుగన్నం, పులిహోర, మంచినీటి బాటిల్స్‌ అందించింది. స్వచ్ఛంద, ధార్మిక సంస్థలు సైతం పడవలపై సర్కార్ అందించిన ఆహారం, తాగునీరు కోసం ప్రధాన రోడ్లకు దగ్గరలో ఉన్న ముంపు బాధితులు ఎక్కువగా ఎగబడ్డారు.

"చాలా ఇబ్బంది పడుతున్నాం. బయటకు రావాలంటే భయంగా ఉంది. ఆహార పొట్లాలు ఇస్తున్నారని ఎక్కువ మంది రావడంతో తోపులాట జరుగుతుంది. ప్రభుత్వం మాకు కావల్సిన సరకులు, ఆహారాన్ని అందిస్తుంది. వీటిని ఇంకా మెరుగ్గా పంపిణీ చేయాలని కోరుతున్నాం." - బాధితులు

"వాంబే కాలనీలో కొన్ని ఇళ్లకు బోట్లు కూడా వెళ్లలేని పరిస్థితి ఉంది. సీఎం చంద్రబాబు కేంద్రంతో మాట్లాడారు. హెలికాప్టర్లను కేంద్రం పంపించింది. వాటి ద్వారా బాధితులకు ఆహారాన్ని అందిస్తున్నాం. వారికి కావాల్సిన ఆహారం, ఇతర వస్తువులను అందించేందుకు అధికార యంత్రాగం కృషి చేస్తుంది." - అనిత, హోం మంత్రి

Budameru Floods : వరద ముంపులో చిక్కుకున్న ప్రాంతాల్లో మంత్రులు, ఉన్నతాధికారులు పర్యటించారు. మంత్రులు అనిత, అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్‌, సంధ్యారాణి, డీజీపీ ద్వారకా తిరుమలరావు సహా ఇతర అధికారులు బాధితుల దగ్గరకు వెళ్లారు. తాగునీరు, భోజన సదుపాయాల గురించి ఆరా తీశారు. వరద గుప్పిట్లోనుంచి బయటకొస్తున్న వారిని పునరావాస కేంద్రాలకు సురక్షితంగా చేర్చే ఏర్పాట్లను పర్యవేక్షించారు. మరోవైపు సహాయ చర్యలపై కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నుంచి మంత్రి లోకేశ్ నిరంతరం సమీక్ష చేస్తున్నారు. వారికి ఆహార పొట్లాలను అందించే దిశగా అధికారులకు సూచనలు చేస్తున్నారు.

దటీజ్ చంద్రబాబు - అర్ధరాత్రి బోటులో పర్యటించి బాధితులకు భరోసా - Chandrababu Visit Vijayawada

మొద్దు నిద్ర వీడకుంటే ఎలా? - అధికారుల తీరుపై సీఎం చంద్రబాబు ఆగ్రహం - Chandrababu Reviews on Floods

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.