BSNL Sell Properties in AP : టెలికాం రంగంలో ఒకప్పుడు భారత్ సంచార్ నిగం లిమిటెడ్ (బీఎస్‌ఎన్‌ఎల్) వెలుగు వెలిగింది. కానీ ఇప్పుడు ఆ సంస్థకి చెందిన ఖాళీ స్థలాలు విక్రయించేందుకు, భవనాలు అద్దెకిచ్చేందుకు సిద్ధమైంది. దేశవ్యాప్తంగా స్థలాలు, ఖాళీ భవనాలను బీఎస్‌ఎన్‌ఎల్ గుర్తించి నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి ఒక చోట ఖాళీ స్థలం, మిగతా చోట్ల 470 భవనాలు ఉన్నాయి.
5జీ సేవలు అందించేందుకు బీఎస్‌ఎన్‌ఎల్ సిద్ధమవుతోంది. ఇందుకోసం భారీగా పెట్టుబడులు అవసరం. మొదటగా నిరుయోగంగా ఉన్న తమ సంస్థ స్థలాలు విక్రయించడం ద్వారా కొన్ని వనరులు సమకూర్చుకోవాలని భారత్ సంచార్ నిగం లిమిటెడ్ భావిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లా తుని బ్యాంకు కాలనీలోగల 1.65 ఎకరాల స్థలాన్ని అమ్మకానికి ఉంచారు. దీని ప్రాథమిక విలువ రూ.12.94 కోట్లుగా నిర్ణయించారు. ఈ క్రమంలో ఆసక్తి వ్యక్తీకరణ బిడ్లు ఆహ్వానించారు. వివిధ జిల్లాల్లోగల 470 బీఎస్‌ఎన్‌ఎల్ భవనాల్లో ఉన్న ఖాళీ స్థలాన్ని అద్దెకు ఇవ్వనున్నారు. వీటిలో కొన్ని ఫ్లోర్లు, గదులు ఖాళీగా ఉన్నట్లు గుర్తించి నోటిఫికేషనన్ జారీ చేశారు.
5G సేవలను ఎప్పుడు ప్రారంభించొచ్చు?: ది హిందూ నివేదిక ప్రకారం వచ్చే సంవత్సంర సంక్రాంతి నాటికి బీఎస్ఎన్ఎల్ తన 5జీ సేవలను ప్రారంభించొచ్చు. దీనిపై కృష్ణా జిల్లా బీఎస్ఎన్ఎల్ ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ (పీజీఎం) ఎల్. శ్రీను మాట్లాడుతూ 4జీ సేవలను తదుపరి స్థాయికి అప్‌గ్రేడ్ చేసి నాణ్యమైన సేవలను అందించేందుకు భారత్ సంచార్ నిగం లిమిటెడ్ ఏర్పాట్లు చేస్తోందని చెప్పారు. దీనిలో భాగంగా టవర్లు, ఇతర పరికరాలను కంపెనీ అప్‌గ్రేడ్ చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ప్రస్తుతం భారత్ సంచార్ నిగం లిమిటెడ్ దేశవ్యాప్తంగా 4జీ సైట్‌లను ఇన్‌స్టాల్ చేస్తోంది. ఇవి 2025 నాటికి 5జీకి అప్‌గ్రేడ్ కానున్నట్లు తెలుస్తోంది. మరోవైపు బీఎస్ఎన్ఎల్ 2025 మధ్య నాటికి లక్ష సైట్‌లను ఇన్‌స్టాల్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. వాటిలో ఇప్పటివరకు మొత్తం 39,000ల సైట్‌లు ఇన్‌స్టాల్ చేశారు. దీంతో దేశంలో స్వదేశీ 4జీ, 5జీ రెండింటినీ అమలు చేసిన మొదటి ఆపరేటర్‌గా బీఎస్ఎన్ఎల్ నిలువనుంది. అయితే ప్రస్తుతం ఈ సర్వీస్ టెస్టింగ్ స్టేజ్‌లోనే ఉంది.
'ఫస్ట్ ఇన్ ఇండియా'- కొత్త సర్వీస్ తెచ్చిన BSNL- వారికి 500 లైవ్‌టీవీ ఛానల్స్ ఫ్రీ!
బీఎస్‌ఎన్‌ఎల్ కస్టమర్లకు సూపర్ ఆఫర్- వారికి 24GB డేటా ఫ్రీ..! - BSNL Anniversary Offers