BRS Ugadi Celebrations at Telangana Bhavan : తెలుగువారి నూతన ఏడాదిలో అందరికీ మంచి జరగాలని, శాంతి, సౌభాగ్యం, మత సామరస్యంతో ఉండాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆకాంక్షించారు. శ్రీక్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలను తెలంగాణ భవన్లో ఘనంగా ఏర్పాటు చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన వేద పండితులు (Vedic Scholars), పంచాంగ పఠనం చేశారు. క్రోధి సంవత్సరంలో మంచి, చెడు మిశ్రమంగా కనిపిస్తున్నాయని, వర్షాలు సమృద్ధిగా పడి పాడిపంటలు చక్కగా పండుతాయని తెలిపారు.
తూర్పు, ఈశాన్య దేశాల్లో భూకంపాలు సంభవిస్తాయని, ఉత్తరాఖండ్ ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడతాయని పేర్కొన్నారు. పరిశోధనలు దిగ్విజయమై, దేశానికి యశస్సు కలుగుతుందని, బంగారం వంటి వ్యాపారం బాగా జరుగుతుందని తెలిపారు. ప్రపంచం అంతటా ఆర్థిక మాంద్యం నెలకొంటుందన్న వేద పండితులు, మత కల్లోలాలు (Religious Riots), వైషమ్యాలు వచ్చే అవకాశం ఉందని అన్నారు. పాలక పక్షానికి కొంత కష్టసాధ్యంగా కనిపిస్తోందని, ప్రతిపక్షంలో ఉన్న వాళ్లు కష్టపడితే మంచి ఫలితాలు వస్తాయని చెప్పారు.
BRS Ugadi Celebrations 2024 : పట్టుదలతో కార్యాన్ని సాధిద్దామనుకునే వారు యోగ్యులు అవుతారని అన్నారు. కొన్ని రోజుల పాటు సాంకేతిక పరిజ్ఞానానికి అడ్డుపడుతుందని, సెల్ ఫోన్లు లాంటివి సరిగ్గా పని చేయవని అన్నారు. కర్కాటక రాశికి చెందిన గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ (BRS Chief KCR) ఆదాయ వ్యయాలు చాలా సంతోషకరంగా ఉన్నాయని, చేపట్టే వ్యవహారాల్లో విజయం సాధించే అవకాశం ఉందని పంచాంగ కర్త తెలిపారు. ఎత్తుగడలకు ప్రజామోదం లభిస్తుందని, విజయవంతం అవుతారని పేర్కొన్నారు.
KTR Extends Ugadi Wishes to Telugu People : ఆరోగ్య పరంగా కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని, ప్రయాణాలు జాగ్రత్తగా చేయాలని సూచించారు. మకర రాశికి చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ఆదాయ, వ్యయాలు (Revenue Expenditure) సమానంగా ఉన్నాయని, ఈ ఏడాది మంచి ప్రభావం కనిపిస్తోందని చెప్పారు. నిలకడగా, పట్టుదలతో పని చేయాలని, మాటను కట్టడి చేసుకొని, మృదువుగా మాట్లాడాలని సూచించారు. దొంగల వల్ల కొంత నష్టం జరిగే అవకాశం ఉందని తెలిపారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖః సంతోషాలతో ఉండాలన్న కేటీఆర్, వర్షాలు బాగా పడి పంటలు బాగా పండాలని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు.
"ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ శ్రీక్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రాజకీయాలు ఎప్పుడూ ఉంటాయి. కానీ పండుగ పూట రాజకీయాలు మాట్లాడకూడదు. ఈ ఏడాది అందరికీ మంచి జరగాలని, మొత్తంగా శాంతి సామరస్యాలతో ఎలాంటి మతకల్లోలాలు కానీ, అనవసరపు బాధలు కానీ ప్రజలకు కలగకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను." - కేటీఆర్, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు
ఉగాది స్పెషల్ - ఈ టాలీవుడ్ మూవీస్ నయా పోస్టర్స్‌ను చూశారా ? - Ugadhi Special Cinema Posters