ETV Bharat / state

ఐటీ పరిశ్రమల భూములను తాకట్టు పెడితే పెట్టుబడులు ఎలా వస్తాయి? : కేటీఆర్ - KTR on Hyderabad it Lands - KTR ON HYDERABAD IT LANDS

KTR Latest Tweets : కాంగ్రెెస్ వైఫల్యాలను బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఎప్పటికప్పుడు ఎండగడుతూనే ఉన్నారు. తాజాగా హైదరాబాద్​లో ఐటీ, అనుబంధ పరిశ్రమలు కేటాయించడానికి ఉద్దేశించిన భూమిని కాంగ్రెస్ ప్రభుత్వం తాకట్టు పెట్టాలని చూస్తోందని ఆయన ఆరోపించారు.

KTR on Hyderabad it Lands
KTR on Hyderabad it Lands (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 15, 2024, 10:32 AM IST

KTR on Hyderabad it Lands : హైదరాబాద్​లో ఐటీ, అనుబంధ పరిశ్రమలకు కేటాయించడానికి ఉద్దేశించిన భూమిని రేవంత్ సర్కార్ ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీలకు తాకట్టు పెట్టాలని చూస్తోందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. సుమారు 400 ఎకరాల భూమిని తాకట్టు పెట్టి రూ.10 వేల కోట్ల రుణాన్ని తీసుకోవడానికి ప్రభుత్వం యత్నిస్తోందని ట్విట్టర్ వేదికగా తెలిపారు. నగరం చుట్టుపక్కల ఐటీ, అనుబంధ రంగాల పరిశ్రమలు వచ్చి, తెలంగాణ యువతకు ఉద్యోగాల కల్పన జరగాలి కానీ, ఈ భూములు తాకట్టు పెడితే కొత్త పరిశ్రమలు ఎలా వస్తాయని ప్రశ్నించారు. ఈ ప్రతిపాదన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం విరమించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చుట్టూ తిరిగి ఇప్పుడు ఇలా : మరోవైపు ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టి పార్టీలో చేర్చుకుని, ఇప్పుడు తమవారని చెప్పుకోలేని కాంగ్రెస్ పరిస్థితిని చూస్తే జాలేస్తోందని కేటీఆర్ అన్నారు. ఎమ్మెల్యేల వివాదంపై మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు చేసిన కామెంట్స్​పై ఆయన మండిపడ్డారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇళ్ల చుట్టూ తిరిగి వారికి కాంగ్రెస్ కండువాలు కప్పి, ఇప్పుడు వారు వారు వివాదం పెట్టుకుంటే మాకేంటి సంబంధం అనటం సరికాదన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇళ్ల చుట్టు తిరిగి వారికి కాంగ్రెస్ కండువాలు కప్పిన వారు ఎవరని, ఇంత నీతిమాలిన రాజకీయం ఎందుకని ప్రశ్నించారు. మీరు మీ అతి తెలివితో హైకోర్టును మోసం చేద్దాం అనుకుంటున్నారు కానీ, ప్రజలు అన్నీ గమనిస్తున్నారని ట్విట్టర్​లో పోస్ట్ చేశారు.

బ్లాక్ లిస్టులో పెట్టాల్సిన మేఘా సంస్థకు పనులు ఎలా ఇస్తారు - కేటీఆర్ - KTR SLAMS CM REVANTH

గురుకులాలను పూర్తిగా మరిచింది : కాంగ్రెస్ ప్రభుత్వం గురుకులాలపై చిన్నచూపు చూస్తోందని మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్​ వేదికగా ట్వీట్ చేశారు. ఒకటో తేదీన జీతాలు అని ఇవ్వటం లేదని, సమయానికి ఇవ్వకపోతే వాళ్ల కుటుంబాలు గడిచేదేలా అని ప్రశ్నించారు. గురుకులాల్లో విద్యార్థుల ఆరోగ్యానికి రక్షణ లేదు, వారి ప్రాణాలకు భరోసా లేదని, ఇప్పుడు జీతాలు సమయానికి ఇవ్వకుండా గురుకుల ఉద్యోగుల కుటుంబాలు రోడ్డున పడేస్తారా అంటూ మండిపడ్డారు. విద్యా సంవత్సరం ప్రారంభమై మూడు నెలలు గడిచినా ఏనాడైనా విద్యా శాఖ మీద రివ్యూ చేశారా? అని ప్రశ్నించారు. సకాలంలో వేతనాలు రాకపోతే గురుకుల ఉద్యోగులకు నెల గడిచేది ఎలా అంటూ అడిగారు.

"ప్రజల గొంతుకే నిజమైన ప్రజాస్వామ్యం. కానీ జవాబుదారీతనం లేని అధికారం కాదు. బుల్​ డోజర్ల ద్వారా ఇళ్లను కూల్చడం, అసమ్మతిని అణచివేయడం, జర్నలిస్టులపై దాడులు, ప్రశ్నించే గొంతులను అణచివేయడం, ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం, ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై దాడులు చేయడం. ఇదేనా ప్రజాస్వామ్యం అంటే? ఇది ప్రజాస్వామ్యం కాదు, ఇది నిరంకుశత్వం, గూండాయిజం, అరాచకం." - కేటీఆర్, మాజీ మంత్రి

ప్రజాస్వామ్యం జవాబుదారీతనం ఆధారంగానే వర్ధిల్లుతుంది కానీ, దౌర్జన్యం పరంగా కాదని కేటీఆర్ అన్నారు. ప్రజాస్వామ్యం, ప్రజల హక్కుల గురించి నిత్యం చెప్పే రాహుల్ గాంధీ మాటలను అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం సందర్భంగా గుర్తు చేయాలనుకుంటున్నానని తెలిపారు. కానీ, తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి దానిని తుంగలో తొక్కితే రాహుల్ గాంధీ కళ్లు మూసుకున్నారని విమర్శించారు.

తమ ఎమ్మెల్యేలను గెలిపించలేదని హైదరాబాద్‌ ప్రజల మీద రేవంత్ పగబట్టారు : కేటీఆర్ - KTR Slams On Congress Govt

'ఇందిరమ్మ రాజ్యం అంటూ - ఆనాటి ఎమర్జెన్సీ రోజులను అమలు చేస్తున్నారు' - KTR on BRS Leaders House Arrest

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.