ETV Bharat / state

'ఛత్తీస్‌గఢ్‌ నుంచి కరెంటు కొనుగోలు ఒప్పందం - రాష్ట్రానికి అక్షరాలా రూ.6 వేల కోట్లు నష్టం' - Huge loss purchase of electricity - HUGE LOSS PURCHASE OF ELECTRICITY

Huge Loss Purchase of Electricity from Chhattisgarh : ఛత్తీస్‌గఢ్‌ నుంచి కరెంటు కొనుగోలు వల్ల రాష్ట్రానికి భారీ నష్టం వాటిల్లిందని విద్యుత్‌ పంపిణీ సంస్థలు తెలిపాయి. ఒక్కో యూనిట్‌ను రూ.3.90లకే కొనేందుకు ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వంతో తెలంగాణ సర్కారు ఒప్పందం చేసుకుందని మాజీ సీఎం కేసీఆర్‌ ఇటీవల జ్యుడీషియల్‌ కమిషన్‌ ఛైర్మన్‌ జస్టిస్‌ నరసింహారెడ్డికి రాసిన లేఖలో పేర్కొన్నారు. ఒక్కో యూనిట్‌ కరెంటు రావడానికి ఖర్చు రూ.5.64లకు చేరడంతో నష్టం వాటిల్లినట్లు పేర్కొన్నాయి.

Huge Loss Purchase of Electricity from Chhattisgarh
Telangana suffers due to purchase of Electricity (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 18, 2024, 9:47 AM IST

Huge Loss Purchase of Electricity from Chhattisgarh : ఛత్తీస్‌గఢ్‌ నుంచి గత ప్రభుత్వం కరెంట్​ కొనుగోలు ఒప్పందం వల్ల రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లిందని తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌ పంపిణీ సంస్థ(డిస్కం) తెలిపాయి. బహిరంగ మార్కెట్​లో తక్కువగా విద్యుత్​ లభిస్తున్నందున అంతకుమించి నగదును ఛత్తీస్‌గఢ్‌కు చెల్లించాల్సి వచ్చిందని జ్యుడీషియల్‌ కమిషన్‌కు వివరించాయి. ఒక్కో యూనిట్​ విద్యుత్​ను కొనుగోలు చేసేందుకు రూ.3.90లకే ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వంతో తెలంగాణ సర్కారు ‘విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం’(పీపీఏ) చేసుకుందని మాజీ సీఎం కేసీఆర్‌ ఇటీవల జ్యుడీషియల్‌ కమిషన్‌ ఛైర్మన్‌ జస్టిస్‌ నరసింహారెడ్డికి రాసిన లేఖలో పేర్కొన్నారు.

ఈఆర్‌సీ ఆమోదం తెలిపిన తర్వాత దానిపై అభ్యంతరాలుంటే ‘విద్యుత్‌ అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌’కు, ఆ తర్వాత సుప్రీంకోర్టుకు మాత్రమే వెళ్లాల్సి ఉంటుందని కేసీఆర్ సూచించారు. విచారణ జరిపే అధికారం జ్యుడిషియల్‌ కమిషన్‌కు ఉండదని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఛత్తీస్‌గఢ్‌తో జరిగిన పీపీఏ, తదనంతర పరిణామాలపై అటు ప్రభుత్వానికి, ఇటు జ్యుడిషియల్‌ కమిషన్‌కు డిస్కంలు సమగ్ర సమాచారాన్ని అందజేశాయి. ఛత్తీస్‌గఢ్‌ నుంచి ఒక్కో యూనిట్‌ కరెంటు రావడానికి అయిన ఖర్చు రూ.5.64లకు చేరడంతో నష్టం వాటిల్లినట్లు పేర్కొన్నాయి.

నష్టం ఎలాగంటే?: ఒప్పందం ప్రకారం ఒక్కో యూనిట్‌ కొనుగోలు ధర రూ.3.90 మాత్రమే అని కేసీఆర్‌ తెలిపారు. కానీ, 2017 నుంచి 2022 వరకు కొనుగోలు చేసిన 17,996 మిలియన్‌ యూనిట్లకు ఛత్తీస్‌గఢ్‌కు రాష్ట్ర డిస్కంలు రూ.7,719 కోట్లు చెల్లించాయి. ఇంకా రూ.1,081 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని డిస్కంలు పేర్కొన్నాయి. దీనికి అదనంగా కరెంటు సరఫరా లైన్‌ ఛార్జీలకు రూ.1,362 కోట్లు చెల్లించాలి. ఇవన్నీ లెక్కిస్తే ఒక్కో యూనిట్‌ ఖర్చు రూ.5.64 అయిందని డిస్కంలు తెలపాయి. ఒప్పందం ప్రకారం రూ.3.90 చొప్పున చెల్లించాల్సిన ధరతో పోలిస్తే దాదాపు రూ.3,110 కోట్ల అదనపు భారం పడిందని వెల్లడించాయి. బకాయిలపై రెండు రాష్ట్రాల విద్యుత్‌ సంస్థల మధ్య వివాదం ఇంకా తేలలేదు. రూ.1,081 కోట్ల బకాయిలున్నట్లు తెలంగాణ డిస్కంలు చెప్తే, రూ.1,715 కోట్లు ఇవ్వాలని ఛత్తీస్‌గఢ్‌ విద్యుత్తు సంస్థలు పేర్కొన్నాయి. ఈ నగదును తెలంగాణ డిస్కంల నుంచి ఇప్పించాలని ‘విద్యుత్‌ అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌’లో పిటిషన్‌ కూడా దాఖలు చేశాయి.

డిస్కంలకు రూ. 8,925 కోట్లు.. ఉత్తర్వులు విడుదల చేసిన ఇంధనశాఖ

Telangana purchase Power Chhattisgarh : 2017లో ఛత్తీస్‌గఢ్‌ నుంచి తెలంగాణకు కరెంటు సరఫరా ప్రారంభమైంది. పీపీఏలో పేర్కొన్న 1000 మెగావాట్లు ఎప్పుడూ పూర్తిగా సరఫరా అవ్వలేదు. బకాయిల చెల్లింపుల వివాదంతో 2022 ఏప్రిల్‌ నుంచి సరఫరా ఆగిపోయింది. ఒప్పందం ప్రకారం 2017 నుంచి 2022 మధ్య కాలంలో పూర్తిస్థాయిలో కరెంటు రాకపోవడం వల్ల రూ.2,083 కోట్లు చెల్లించి బహిరంగ మార్కెట్లో కొనాల్సి వచ్చిందని రాష్ట్ర డిస్కంలు వెల్లడించాయి. ఛత్తీస్‌గఢ్‌ నుంచి కరెంటు తెచ్చుకునేందుకు పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ (పీజీసీఐఎల్‌)తో వెయ్యి మెగావాట్ల సరఫరాకు లైన్‌ కారిడార్‌ను అద్దెకు తీసుకునేందుకు తెలంగాణ డిస్కంలు రిజర్వు చేసుకోవాల్సి వచ్చిందని రాష్ట్ర విద్యుత్​ పంపిణీ సంస్థలు తెలిపాయి. ఈ అద్దె భారం కూడా విద్యుత్తు సంస్థలపై పడిందని వెల్లడించాయి.

Telangana Huge Loss Due to Power purchase : లైన్‌ బుకింగ్‌ ఒప్పందం ప్రకారం కరెంటు తెచ్చుకున్నా, తెచ్చుకోకపోయినా పీజీసీఐఎల్‌కు ఛార్జీలు కట్టాల్సిందేనని పేర్కొన్నాయి. ఈ లెక్కన కరెంటు రాకున్నా రూ.638 కోట్ల అదనపు ఛార్జీలు కట్టామని వివరించాయి. దీనికి తోడు మరో 1000 మెగావాట్ల సరఫరాకు అడ్వాన్సుగా కారిడార్‌ను గత ప్రభుత్వం రిజర్వు చేసిందని తెలిపాయి. ఛత్తీస్‌గఢ్‌ నుంచి అదనంగా మరో 1,000 మెగావాట్ల విద్యుత్​ లభించే అవకాశం లేకపోవడంతో ఈ కారిడార్‌ను ఆ తర్వాత రద్దు చేసుకుందని గుర్తు చేశాయి. ఈలోగా జరగాల్సిన నష్టం జరిగిందని, ముందుగా రిజర్వు చేసుకున్నందు వల్ల పరిహారం కింద రూ.261 కోట్లు కట్టాలని డిస్కంలకు పీజీసీఐఎల్‌ నోటీసులు జారీ చేశాయని వెల్లడించాయి. కారిడార్‌ రిజర్వు ఒప్పందం హడావుడిగా చేసుకోవటం వల్లే ఈ అదనపు చెల్లింపుల సమస్య వచ్చిందని జ్యుడిషియల్‌ కమిషన్‌కు డిస్కంలు తెలిపాయి.

TG Discom Explanation on Power Purchase: ఛత్తీస్‌గఢ్‌ కరెంటు కొనుగోలులో ఎలాంటి లొసుగులు లేవని, అంతా పారదర్శకంగా జరిగిందని, పైగా ఆ పీపీఏను ‘రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి’(ఈఆర్‌సీ) ఆమోదించిందని కేసీఆర్‌ తన లేఖలో పేర్కొన్నారు. అయితే ఛత్తీస్‌గఢ్‌ కరెంటు కొనుగోలు ఒప్పందానికి ఇంతవరకూ తెలంగాణ ఈఆర్‌సీ తుది ఆమోదముద్ర వేయలేదని విద్యుత్‌ పంపిణీ సంస్థలు తెలిపాయి. తొలుత చేసుకున్న పీపీఏపై తెలంగాణ ఈఆర్‌సీ మధ్యంతర ఉత్తర్వు మాత్రమే జారీ చేసిందని డిస్కంలు చెబుతున్నాయి. ఈ చెల్లింపులతో డిస్కంలకు రూ.6 వేల కోట్ల నష్టం వాటిల్లిందని డిస్కంలు పేర్కొన్నాయి.

Electricity Charges: నెలకు రూ.1000 కోట్లు లోటు.. కరెంటు ఛార్జీలు పెంచక తప్పదు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.