ETV Bharat / state

దశాబ్ది ఉత్సవాల వేళ బీఆర్ఎస్​కు తీపికబురు - మహబూబ్​నగర్ ఎమ్మెల్సీ ఉపఎన్నికలో గులాబీ అభ్యర్థి విజయం - BRS Wins Mahabubnagar MLC By Poll - BRS WINS MAHABUBNAGAR MLC BY POLL

BRS Wins Mahabubnagar MLC By Poll 2024 : మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ విజయం సాధించింది. కాంగ్రెస్‌ అభ్యర్థి మన్నె జీవన్‌రెడ్డిపై బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్‌కుమార్‌రెడ్డి 109 ఓట్ల తేడాతో గెలుపొందారు. మార్చి 28న పోలింగ్‌ నిర్వహించగా నేడు ఓట్ల లెక్కింపు చేపట్టారు.

Brs Candidate Naveen Reddy won
BRS candidate Wins Mahabubnagar MLC By Poll (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 2, 2024, 12:31 PM IST

BRS candidate Wins Mahabubnagar MLC By Poll 2024 : మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్‌కుమార్‌ రెడ్డి ఘన విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి మన్నె జీవన్‌ రెడ్డిపై 109 ఓట్ల తేడాతో గెలుపొందారు. దీంతో అక్కడ బీఆర్ఎస్ నాయకులు సంబురాలు చేసుకుంటున్నారు. నిరాశ చెందిన కాంగ్రెస్ అభ్యర్థి మన్నె జీవన్‌రెడ్డి లెక్కింపు మధ్యలోనే బయటకు వెళ్లిపోయారు. ఈ ఎమ్మెల్సీ స్థానం పరిధిలో మొత్తం 1,439 మంది ఓటర్లు ఉండగా 1,437 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 1437 ఓట్లలో 21 చెల్లనివిగా గుర్తించారు.

మిగిలిన 1416 ఓట్లలో బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్‌కుమార్‌రెడ్డికి 762, కాంగ్రెస్ అభ్యర్థి మన్నె జీవన్‌రెడ్డికి 653, స్వతంత్ర అభ్యర్థికి ఒక్క ఓటు వచ్చాయి. దీంతో 109 ఓట్ల ఆదిక్యంతో నవీన్ కుమార్ రెడ్డి విజయం సాధించినట్లయింది. ఫలితాలను రిటర్నింగ్ అధికారి అధికారికంగా వెల్లడించారు. ఎమ్మెల్సీ ఎన్నికలో గెలుపొందిన నవీన్ కుమార్ రెడ్డికి మాజీ మంత్రి హరీశ్​రావు ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ గెలుపుకు కృషి చేసిన బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులకు, నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేశారు.

కొనసాగుతున్న మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్సీ ఎన్నిక ఓట్ల లెక్కింపు - సాయంత్రం తేలనున్న అభ్యర్థుల భవితవ్యం - Mahabubnagar MLC Vote Counting

KTR On BRS Wins MLC By Poll 2024 : రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్న వేళ మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు సాధించడం హర్షణీయమని బీఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి విజయం సాధించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. విజయం సాధించిన నవీన్ కుమార్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన ఆయన బీఆర్ఎస్ గెలుపు మారుతున్న తెలంగాణ రాజకీయ ముఖచిత్రంలో కీలక మలుపుగా అభివర్ణించారు. పార్టీ విజయం కోసం పనిచేసిన ప్రతి ఒక్క నాయకునికి, ఎమ్మెల్యేలకు, మాజీ ఎమ్మెల్యేలకు ముఖ్యంగా మహబూబ్​నగర్ జిల్లా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ధన్యవాదాలు చెప్పారు.

ముఖ్యమంత్రి సొంత జిల్లాలోని ఎమ్మెల్సీ స్థానం గెలుచుకోవడం చాలా సంతోషకరమన్న కేటీఆర్ ఈ గెలుపు తమపై బాధ్యత మరింత పెంచిందని పేర్కొన్నారు. ఈ విజయం మరిన్ని విజయాలకు దారితీస్తుందని విశ్వసిస్తున్నట్లు ఆకాంక్షించారు. భవిష్యత్తులోనూ మరిన్ని విజయాలు సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. అధికార పార్టీ ప్రలోభాలకు నిలువున పాతరేసిన ఎన్నిక ఇది అని తెలిపారు. ఆరు నెలల్లోనే కాంగ్రెస్ పాలనా వైఫల్యాలను ఎత్తిచూపిన ఫలితమిదని చెప్పారు. నాడైనా నేడైనా ఏనాడైనా తెలంగాణ ఇంటి పార్టీ బీఆర్ఎస్ మాత్రమేనని పేర్కొన్నారు.

నాలుగో తేదీన అసలైన ఫలితాలు​ వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతా : కేటీఆర్ - KTR On EXIT Polls 2024

మహబూబ్​నగర్ ఎమ్మెల్సీ ఉపఎన్నికలో బీఆర్ఎస్ ఘన విజయం - నవీన్​ రెడ్డికి హరీశ్ రావు అభినందనలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.