BRS approach High Court on Danam issue : దానం నాగేందర్ అనర్హత పిటిషన్ వ్యవహారంలో బీఆర్ఎస్(BRS) హైకోర్టును ఆశ్రయించింది. బీఆర్ఎస్ తరఫున గెలిచి కాంగ్రెస్‌లో చేరిన దానంపై, అనర్హత వేటు వేయాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సభాపతి గడ్డం ప్రసాద్ వద్ద ఇప్పటికే అనర్హత పిటిషన్ దాఖలు చేసినట్లు పేర్కొన్న బీఆర్ఎస్, సభాపతి ఇంకా స్పందించడం లేదని ఫిర్యాదులో తెలిపింది. దానంపై త్వరగా చర్యలు తీసుకోవాలని సభాపతిని ఆదేశించాలని పిటిషన్లో పేర్కొంది. ఇప్పటికే సికింద్రాబాద్ లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్థిగా దానం నాగేందర్ పేరును ప్రకటించిందని బీఆర్ఎస్ పేర్కొంది.
KTR on Danam Nagender : గులాబీ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ కండువా కప్పుకున్న ఖైరాతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై(Danam Nagender), వేటు వేయాలని బీఆర్ఎస్ నేతలు ఇప్పటికే సభాపతిని కోరిన విషయం తెలిసిందే. ఇటీవల ఇదే విషయంపై భారత్ రాష్ట్ర సమితి కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్(KTR) స్పందించారు. తమ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై హస్తం పార్టీ లోక్‌సభ అభ్యర్థిగా ప్రకటించిన దానం నాగేందర్ వ్యవహారంలో, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆదివారం వరకు నిర్ణయం తీసుకోవాలని, లేని పక్షంలో హైకోర్టును ఆశ్రయిస్తామని ఆయన స్పష్టం చేశారు.
అనర్హతా పిటిషన్లను మూడు నెలల్లో తేల్చాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని కేటీఆర్ గుర్తు చేశారు. దానం నాగేందర్‌పై ఇప్పటికే అనర్హతా పిటిషన్ వేయడంతో పాటు అనుబంధ అఫిడవిట్ కూడా దాఖలు చేసినట్లు వివరించారు. దానం నాగేందర్, కడియం శ్రీహరిల శాసనసభ్యత్వాలు రద్దవుతాయని, అలాగే ఉపఎన్నికలు రావడం ఖాయమని అన్నారు. ఒక పార్టీలో ఎన్నికై మరో పార్టీలో చేరిన వారిని రాళ్లతో కొట్టాలని గతంలో రేవంత్‌రెడ్డి అన్నారని, ఇప్పుడు ఇతర పార్టీల వారిని చేర్చుకుంటున్న ఎవరిని రాళ్లతో కొట్టాలన్న మందకృష్ణ మాదిగ ప్రశ్నకు సమాధానం చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. తాజాగా స్పీకర్ నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో భారత రాష్ట్రసమితి, దానం నాగేందర్ అనర్హత పిటిషన్‌పై హైకోర్టును ఆశ్రయించింది.
ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు హైకోర్టు నోటీసులు - HC Issued Notices To MLA Danam
బీఆర్ఎస్కు మరో షాక్ - కాంగ్రెస్ గూటికి ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే దానం నాగేందర్