ETV Bharat / state

భారీ వర్షాలకు కూలిపోయిన బ్రిడ్జిలు - నిలిచిన రాకపోకలు - Bridge washed away by rains in tg - BRIDGE WASHED AWAY BY RAINS IN TG

Bridges Washed Away in Telangana : రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపు లేకుండా రెండు రోజులుగా వర్షం కురిసింది. ఈ భారీ వర్షాలకు కొన్ని జిల్లాల్లో ఏకంగా బ్రిడ్జిలే కొట్టుకుపోయాయి. దీంతో ఆ ప్రాంతాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.

Bridges Washed Away in Telangana
Bridges Washed Away in Telangana (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 2, 2024, 3:22 PM IST

Updated : Sep 2, 2024, 4:54 PM IST

Bridges Washed Away by Heavy Rains : రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పలు ప్రాంతాల్లోని బ్రిడ్జిలు కొట్టుకుపోయాయి. మహబూబాబాద్​ జిల్లాలో కురిసిన కుంభవృష్టికి అపార నష్టం జరిగింది. ఏకధాటిగా కురిసిన భారీ వర్షానికి వాగులు పొంగి పొర్లాయి. ములకలపల్లి-ఖమ్మం జిల్లా సరిహద్దులోని ఆకేరు వాగుపై ఉన్న బ్రిడ్జి కొట్టుకుపోయింది. దశాబ్దాల క్రితం నిర్మించిన ఈ వంతెన ద్వారా ఖమ్మం-మహబూబాబాద్​ జిల్లాల మధ్య రాకపోకలు కొనసాగేవి. వంతెన కొట్టుకుపోవడంతో ఈరెండు జిల్లాల మధ్య రాకపోకలు స్తంభించిపోయాయి.

వంతెన కొట్టుకుపోవడంతో రెండు రోజుల నుంచి వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు చిన్నగూడూరు మండల కేంద్రం శివారులో ఆకేరు వాగు వరద నీటికి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో బ్రిడ్జి వద్ద ఉన్న బీటీ రోడ్డు కోతకు గురైంది. దీంతో మహబూబాబాద్​ మరిపెడ మండలానికి రాకపోకలు నిలిచిపోయాయి.

కూలిన మేళ్ల చెరువు బ్రిడ్జి : సూర్యాపేట జిల్లాలో మేళ్ల చెరువు మండలం కందిబండ వద్ద ప్రధాన రహదారిపై ఉన్న బ్రిడ్జి కూలిపోయింది. చెరువుకు గండి పడి వరద నీరు పెరగడంతో బ్రిడ్జి కూలగా పోలీసు యంత్రాంగం అప్రమత్తం అయింది. వరద తాకిడి పెరిగి బ్రిడ్జి మీద నుంచి నీళ్లు రావడంతో పాత బ్రిడ్జి కావడం వల్ల బ్రిడ్జి కూలిపోయిందని స్థానికులు చెబుతున్నారు. దీంతో మేళ్లచెరువు నుంచి కోదాడ వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది.

లో లెవెల్​ వంతెన కూలిపోవడంతో రాకపోకలు బంద్​ : మరోవైపు కుమురం భీం ఆసిఫాబాద్​ జిల్లా మండలకేంద్రంలోని మాలన్​ గొంది గ్రామ పంచాయతీ పరిధిలోని లో లెవెల్​ వంతెన కొట్టుకుపోయింది. లో లెవల్​ వంతెన కొట్టుకుపోవడంతో బయటి ప్రపంచంతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. ఆదివాసీలు అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా పాలనాధికారి సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితులను పరిశీలించారు. జాగ్రత్త వహించాలని గ్రామస్థులకు సూచించారు. లో లెవెల్​ వంతెన వద్ద పోలీసు పహారా ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

'మమ్మల్ని ఎవరూ పట్టించుకోవడం లేదు' - మున్నేరు వంతెనపై వరద బాధితుల ఆందోళన - Flood victims at Munneru bridge

ప్రయాణికులకు ముఖ్య గమనిక - వర్షాల కారణంగా 86 రైళ్లు, 650కి పైగా ఆర్టీసీ బస్సులు రద్దు - 86 Trains Cancelled

Last Updated : Sep 2, 2024, 4:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.