Bridge Structure Dilapidated in 3Years at Nellore District : వైఎస్సార్సీపీ పాలనలో నిర్మించిన ఓ చప్టా మూడేళ్లకే మూలకు చేరింది. భారీగా పగుళ్ల వచ్చి ఎప్పుడు కూలిపోతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఎంతో పోరాడి సాధించుకున్న చప్టా మూడేళ్లకే శిథిలావస్థకు చేరడంతో గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మూడేళ్లకే శిథిలావస్థకు : జగన్ హయాంలో నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో నిర్మించిన చప్టా దుస్థితి అధ్వానంగా తయారైంది. వరదల్లో బొగ్గేరు పొంగిందంటే మూడు మండలాలోని గ్రామాల ప్రజల రాకపోకలకు అంతరాయం కలుగుతుంది. నారంపేట - మహిమలూరు గ్రామాల మధ్య బొగ్గేరుపై చేసిన నిర్మాణం మూడేళ్లు కూడా నిండకుండానే పగుళ్లు ఇచ్చింది. కాంక్రీట్ చప్టా రెండుగా పగిలిపోయింది. పంచాయతీరాజ్, రోడ్లు భవనాల శాఖ పర్యవేక్షణలో వైఎస్సార్సీపీ గుత్తేదారు నాగమోహన్ రెడ్డి పనులు చేశారు. సుమారు రూ. 3 కోట్లతో వంతెన, తారు రోడ్డును నిర్మించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంతో పోరాడి మరి సాధించుకున్న చప్టా నాసిరకంగా పనులతో మూడేళ్లకే కుంగిపోవడంతో స్థానికులు మండిపడుతున్నారు.
దస్త్రాలకే పరిమితమైన బుడమేరు వంతెన- ఇంకా మోక్షం ఎప్పుడో? - Bridge Construction works delay
నాసిరకంగా నిర్మించిన గుత్తేదారు : బొగ్గేరు వరదలు వస్తే దెబ్బతిన్న చప్టా కొట్టుకుపోయే పరిస్థితి నెలకొంది. ఎక్కువ లోతు తీయకుండా పిల్లర్లు వేయడంతో వంతెన కుంగి నెర్రెలు వాలింది. అనేక గ్రామాలకు ఈ మార్గమే ప్రధాన దారి కావడంతో గ్రామాలు ఆందోళన చెందుతున్నారు. త్వరగా కొత్తది నిర్మించాలని కోరుతున్నారు. నాసిరకంగా నిర్మాణం చేసిన వైఎస్సార్సీపీ కాంట్రాక్టర్‌ను బ్లాక్ లిస్ట్‌లో పెట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
హంద్రీ వంతెనపై భారీ గొయ్యి - వాహనదారులు ఆందోళన - Handri bridge
బొగ్గేరుకు వరదలు వస్తే చప్టా కొట్టుకుపోతుంది. మేము రాకపోకలు సాగించడానికి అదనపు ప్రయాణం చేయాలి. కాంట్రాక్టర్ లోపం కారణంగా చప్టా నిర్మాణం కూలిపోయింది. ప్రజా ధనం దుర్వినియోగం అయ్యింది. కాంట్రాక్టర్ లైసెన్స్‌ను రద్దు చేయాలి. చప్టా నిర్మాణం మళ్లీ చేపట్టాలని కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకుంటున్నాం- స్థానికులు