ETV Bharat / state

ఫలించిన అధికారుల శ్రమ - ప్రకాశం బ్యారేజీ వద్ద మూడో పడవ వెలికితీత - Prakasam Barrage Boat Incident - PRAKASAM BARRAGE BOAT INCIDENT

Prakasam Barrage Boat Incident Updates : ఎట్టకేలకు ప్రకాశం బ్యారేజీ వద్ద మూడో బోటును ఇంజనీర్లు తొలగించారు. గేట్ల వద్ద అడ్డుగా ఉన్న మూడు పడవలను ఇంజినీర్లు, అధికారులు శతవిధాలుగా ప్రయత్నించి వెలికి తీశారు.

Prakasam Barrage Boat Incident
Prakasam Barrage Boat Incident (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 21, 2024, 1:44 PM IST

Third Boat Removed in Prakasam Barrage : ప్రకాశం బ్యారేజీ వద్ద అడ్డుపడి మునిగిన మూడో బోటును అధికారులు ఎట్టకేలకు తొలగించారు. ఇనుప గడ్డర్లతో 2 పడవలను అనుసంధానించి అడ్డుపడిన బోటును బయటకు తీశారు. చైన్‌ పుల్లర్లతో ఎత్తి బ్యారేజీ ఎగువకు తరలించారు. 40 టన్నుల బరువున్న ఈ పడవ బ్యారేజీ 69వ గేట్ వద్ద ఢీకొని అడ్డుగా మారింది. దీన్ని ప్రస్తుతం ఇంజినీర్లు పున్నమి ఘాట్‌ వద్దకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. బెకెం ఇన్‌ఫ్రా సంస్థ ఇంజినీర్లు, అధికారులు ఇప్పటివరకు ప్రకాశం బ్యారేజీ వద్ద అడ్డుపడిన 3 భారీ పడవలను వెలికితీశారు.

కాగా ఈనెల 1న భారీ ప్రవాహానికి ఎగువ నుంచి కొట్టుకువచ్చిన 5 బోట్లు బ్యారేజీ గేట్లను బలంగా ఢీకొట్టాయి. దీంతో 67, 69, 70 గేట్ల వద్ద కౌంటర్ వెయిట్లు ధ్వంసమయ్యాయి. ప్రవాహంలో ఒక పడవ దిగువకు కొట్టుకు పోగా, మరో 3 భారీ బోట్లు, ఒక మోస్తరు పడవ గేట్ల వద్ద చిక్కుకున్నాయి. ఇవి బ్యారేజీ గేట్లకు అడ్డుపడి ప్రవాహాన్ని అడ్డుకుంటున్నాయి. దీంతో భారీ పడవలను తొలగించేందుకు పలు ప్లాన్​ అమలు చేసిన అధికారులు రెండు పడవలను బయటకు తీశారు. తాజాగా ఇవాళ మూడో బోటును వెలికితీసి సఫలీకృతమయ్యారు.

ప్రకాశం బ్యారేజీ విధ్వంసానికి కుట్ర పన్నిన వారిని వదిలేది లేదు : మంత్రి నిమ్మల - Nimmala Inspected Prakasam Barrage

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.