ETV Bharat / state

ఆర్టీసీ బస్టాండులో బ్లేడ్​ బ్యాచ్​ అరాచకాలు - ఉద్యోగులకు గాయాలు

ఆర్టీసీ సిబ్బందిపై విజయవాడలో పెరుగుతున్న బ్లేడ్​ బ్యాచ్​ ఆగడాలు - మొన్నకండక్టర్​, నిన్న కంట్రోలర్​ పై బ్లేడ్​లతో దాడి - నిఘా పెంచాలని పోలీసులకు విజ్ఞప్తి

RTC EMPLOYEE INJURED
BLADE BATCH ATTACKS IN RTC BUS STAND (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 13, 2024, 4:20 PM IST

Blade Batch Attacks in Bus Stand : ఆంధ్రప్రదేశ్​లోని విజయవాడలో పండిట్‌ నెహ్రూ బస్టాండ్‌లో బ్లేడ్ బ్యాచ్ గత కొతం కాలంగా హల్​చల్​ చేస్తున్నారు. మంగళవారం(నవంబరు 12) రాత్రి డ్యూటీలో ఉన్న ఆర్టీసీ కంట్రోలర్‌ కొప్పుల గాంధీపై దుండగులు బ్లేడ్‌తో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన ఆయనను వెంటనే ఆర్టీసీ సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. మంగళవారం అర్ధరాత్రి బ్లేడ్‌ బ్యాచ్‌ బస్టాండ్‌లో తిరుగుతుంటే వాళ్లను ప్రశ్నించినందుకు దాడి చేసినట్టు తెలుస్తోంది. అనంతరం పరారైపోతున్న కొంత మంది దుండగులను పోలీసులు పట్టుకున్నారు.

ఇటీవల బస్టాండ్​లో టికెట్ కౌంటర్​లోని సిబ్బందిపైనా బ్లేడ్ బ్యాచ్ రెచ్చిపోయి దాడి చేశారు. పీవీ రావు అనే కండక్టర్​పై దాడి చేసి ఆయన వద్ద ఉన్న నగదును లాక్కొని ఉడాయించారు. దీనిపై కృష్ణలంక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బస్టాండ్​లో బ్లేడ్ బ్యాచ్ ఆగడాల నివారణకు చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీసులను ఆర్టీసీ సిబ్బంది కోరుతున్నారు. బస్టాండ్​లో సెక్యూరిటీతో పాటు నిఘాను పెంచి సిబ్బంది, ప్రయాణికులకు రక్షణ కల్పించాలని పలువురు విజ్ఞప్తి చేశారు.

ఆర్టీసీ కార్మికుల కష్టాలు తీరేదెన్నడు..?

సీఎం రేవంత్​ను కలిసిన సస్పెండైన ఆర్టీసీ ఉద్యోగులు - విధుల్లోకి తీసుకోవాలని విజ్ఞప్తి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.