ETV Bharat / state

పురపాలక మంత్రిగా కేటీఆర్‌ చేసినన్నీ తప్పులు ఎవరూ చేయలేదు : రఘునందన్‌రావు - RAGHUNANDAN RAO ON HYDRA OPERATION

Raghunandan rao Slams KTR : పురపాలక మంత్రిగా కేటీఆర్‌ చేసినన్నీ తప్పులు ఎవరూ చేయలేదని బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు దుయ్యబట్టారు. చెరువులు ఎక్కడ కబ్జా చేశారో పదేళ్లు అధికారంలో ఉన్న కేటీఆర్‌కు తెలియదా? అని ఆయన ప్రశ్నించారు. ఎన్‌ కన్వెన్షన్‌ను కూలగొట్టాలని 2014లోనే హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిందని ఆయన గుర్తుచేశారు. పదేళ్లపాటు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ ఎన్‌ కన్వెన్షన్‌ను ఎందుకు కూలగొట్టలేదని ప్రశ్నించారు.

RAGHUNANDAN RAO ON HYDRA OPERATION
Raghunandan rao Slams KTR (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 24, 2024, 3:02 PM IST

Updated : Aug 24, 2024, 3:56 PM IST

RAGHUNANDAN RAO ON HYDRA OPERATION : హైడ్రా కూల్చివేతలపై బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు కీలక వ్యాఖ్యలు చేశారు. సినీ హీరో నాగార్జునకు చెందిన ఎన్‌ కన్వెన్షన్‌ను కూలగొట్టాలని 2014లోనే హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిందని ఆయన గుర్తుచేశారు. పురపాలక మంత్రిగా కేటీఆర్‌ చేసినన్నీ తప్పులు ఎవరూ చేయలేదని రఘునందన్‌రావు దుయ్యబట్టారు. పదేళ్లపాటు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ ఎన్‌ కన్వెన్షన్‌ను కూలగొట్టలేదని, చెరువులు ఎక్కడ కబ్జా చేశారో పదేళ్లు అధికారంలో ఉన్న కేటీఆర్‌కు తెలియదా? అని ఆయన ప్రశ్నించారు.

డ్రామా నడిపిస్తున్నారు : కేటీఆర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు వారి బాధ్యతలు మర్చిపోయి మాట్లాడుతున్నారని రఘునందన్‌రావు పేర్కొన్నారు. పార్టీలనే తేడా లేకుండా ఎఫ్‌టీఎల్‌, బఫర్ జోన్‌లో ఉన్న అక్రమ నిర్మాణాలు కూల్చాలనీ 2010 లోనే హై కోర్టు తీర్పు ఇచ్చిందని ఆయన గుర్తుచేశారు. కొత్తగా రేవంత్ రెడ్డి వచ్చి ఏదో చేసినట్టు ఒక డ్రామా నడిపిస్తున్నారని, రేవంత్ రెడ్డికి, హైడ్రాకు చిత్తశుద్ధి ఉంటే హైకోర్టు గుర్తించిన రెండు వేల ఐదు వందల చెరువులు కాపాడాలని పేర్కొన్నారు.

ముక్కు పిండి వసూలు చేయాలి : ఇవాళ మీరాళం ట్యాంక్ ఉందా? అని రఘునందన్‌రావు ప్రశ్నించారు. అక్కడి ఎంఐఎం వాళ్లకి, కార్పొరేటర్లకు భయపడి హైడ్రా వెనక్కి తగ్గిందన్నారు. ఆంధ్రోళ్లు అనేక కబ్జాలు చేశారని, వాటిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. 2014 లోనే ఎన్ కన్వెన్షన్ కూలగొట్టలని హై కోర్టు తీర్పు ఇచ్చిందని, 2014 నుంచి ఈ కన్వెన్షన్ పై వచ్చిన ఆదాయాన్ని హీరో నుంచి ముక్కు పిండి వసూలు చేయాలని డిమాండ్ చేశారు.

కేటీఆర్ పదేళ్లు మున్సిపల్ మంత్రిగా పని చేశారని, ఆయన తీసుకున్న చర్యలు ఎంటని రఘునందన్‌రావు నిలదీశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇళ్లు లేవా?, హరీశ్‌, కవిత, కేటీఆర్‌కు 111 జీవో పరిధిలో ఆస్తులు లేవా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వీటిని ఎందుకు కాపాడుతున్నారని, ముందు ముగ్గురు ఇల్లు కులగొట్టాలని డిమాండ్ చేశారు. జన్వాడ ఫామ్‌హౌస్ కూలగొట్టడానికి రేవంత్‌కు భయమెందుకని నిలదీశారు.

"పురపాలక మంత్రిగా కేటీఆర్‌ చేసినన్నీ తప్పులు ఎవరూ చేయలేదు. పదేళ్లపాటు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ ఎన్‌ కన్వెన్షన్‌ను కూలగొట్టలేదు. చెరువులు ఎక్కడ కబ్జా చేశారో పదేళ్లు అధికారంలో ఉన్న కేటీఆర్‌కు తెలియదా? రేవంత్ రెడ్డికి, హైడ్రాకు చిత్తశుద్ధి ఉంటే హైకోర్టు గుర్తించిన రెండు వేల ఐదు వందల చెరువులు కాపాడాలి". - రఘునందన్‌రావు, ఎంపీ బీజేపీ

ఆరు నెలలవుతున్నా కేటీఆర్​ను ఎందుకు అరెస్టు చేయట్లేదు : ఎంపీ రఘునందన్​రావు - MP Raghunandan Rao On CM Revanth

'దేశ సమైక్యత, సమగ్రతలను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది' - Raghunandan ON Har Ghar Tiranga

Last Updated : Aug 24, 2024, 3:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.