ETV Bharat / state

తెలుగు రాష్ట్రాల సీఎం ల భేటీపై తెలంగాణ బీజేపీ నేతలు ఏమంటున్నారు? - T BJP ON TELUGU STATES CMS MEETING

BJP MP Laxman About Telugu States CMs Meeting : కేంద్రం రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి కట్టుబడి ఉందని తెలంగాణ బీజేపీ నేతలు అంటున్నారు. విభజన సమస్యలపై ఇద్దరు సీఎంలు పరిష్కార మార్గం చూపించాలని వారు అభిలాషించారు. రేవంత్ రెడ్డి, చంద్రబాబుల సమావేశంపై సీనియర్ నేత లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 6, 2024, 4:40 PM IST

BJP MP LAXMAN ON CMS MEETING
BJP MP LAXMAN ON CMS MEETING (ETV Bharat)

BJP MP Laxman About Telugu States CMs Meeting : రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు విభజన సమస్యలను పరిష్కరించుకోవాలని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్​ తెలిపారు. కేంద్రం రెండు రాష్ట్రాల అభివృద్ధికి కట్టుబడి ఉందని అన్నారు. అలాగే తిరుపతి పవిత్రతను కాపాడాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకి ఆయన బహిరంగ లేఖ రాశారు. హైదరాబాద్​లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన శ్యామా ప్రసాద్​ ముఖర్జీ జయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన లక్ష్మణ్, ఆయన చిత్రపటం వద్ద నివాళులు అర్పించారు.

అనంతరం బీజేపీ ఎంపీ లక్ష్మణ్ మాట్లాడుతూ, కాంగ్రెస్​ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడిందని ఆరోపించారు. కాంగ్రెస్​ నెహ్రూ విధానాలను మరిచిపోయి ఈ ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూసిందని విమర్శించారు. బీజేపీ ముస్లింలకు వ్యతిరేకమని కాంగ్రెస్​ పార్టీ విష ప్రచారం చేసిందని ధ్వజమెత్తారు. మతపరమైన రిజర్వేషన్లను మాత్రమే బీజేపీ వ్యతిరేకించిందని చెప్పుకొచ్చారు. రిజర్వేషన్లు రద్దు, రాజ్యాంగాన్ని మారుస్తారని కాంగ్రెస్​ పార్టీ తప్పుడు ప్రచారం చేసి లోక్​సభ ఎన్నికల్లో లబ్ధి పొందిందని చెప్పారు. కుల, మతాల మధ్య చిచ్చు పెట్టి భారతదేశం విచ్ఛిన్నానికి కాంగ్రెస్​ పాల్పడిందని లక్ష్మణ్​ తీవ్రస్థాయిలో ఆరోపించారు.

భారతదేశ సమగ్రత కోసం తన ప్రాణాలు సైతం అర్పించిన వ్యక్తి శ్యామా ప్రసాద్​ ముఖర్జీ అని బీజేపీ నేత లక్ష్మణ్ కొనియాడారు. భావితరాలకు, నేటి తరాలకు స్ఫూర్తిని కలిగించేలా శ్యామా ప్రసాద్​ ముఖర్జీ పేరుతో అనేక కార్యక్రమాలు నిర్వహించామని గుర్తుచేశారు. పశ్చిమ బంగాల్​ను తూర్పు పాకిస్థాన్​లో కలుపుతారనే కుట్రల నేపథ్యంలో ఎదురొడ్డి నిలుచున్న వ్యక్తి ఆయనే అని గర్వంగా చెప్పారు. ఆయన చొరవ వల్లే పశ్చిమ బెంగాల్​ భారతదేశంలోనే ఉండి సురక్షితంగా జీవించగల్గుతున్నారన్నారు. ఆయన త్యాగ ఫలితమే ప్రధాని నరేంద్ర మోదీ 370 ఆర్టికల్​ను రద్దు చేశారన్నారు. 370 ఆర్టికల్​ రద్దు తర్వాత నరేంద్ర మోదీ జమ్మూకశ్మీర్​ ప్రజలకు రిజర్వేషన్లు కల్పించారని తెలిపారు.మోదీ ప్రభుత్వం మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించిందని వివరించారు.

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎంపీ రఘునందన్​రావు : ఏపీలోని తిరుమల శ్రీవారిని బీజేపీ ఎంపీ రఘునందన్​రావు దర్శించుకున్నారు. ఉభయ రాష్ట్రాల ప్రజలకు ఆనందాన్నిచ్చేలా సీఎంలు భేటీ ఉండాలని అన్నారు. ఇద్దరు సీఎంల మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయని కావున అన్ని సమస్యలకు పరిష్కారం దిశగా సమావేశం జరపాలని ఎంపీ రఘునందన్​రావు కోరారు.

నేడు తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ - విభజన సమస్యలే ప్రధాన అజెండా - chandrababu revanth reddy meeting

ఏపీఎస్‌ఆర్టీసీ కష్టాలు తీరేనా - ఉమ్మడి ఆస్తుల్లో వాటా దక్కేనా - APSRTC Losses State Bifurcation

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.